Home
Gadgets

Apple smart watch ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. ఏకంగా రూ.10000 తగ్గింపు..!

ఆపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అనేక మంది భావిస్తుంటారు. అయితే ధర ఎక్కువ కావడంతో వెనకడుగు వేస్తుంటారు. పండుగలు సహా ఇతర ఆఫర్లు, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంల సేల్‌ సమయంలో డిస్కౌంట్ ధరలతో కొనుగోలు చేయవచ్చు. ఇటీవల రిపబ్లిక్‌ డే సేల్ సందర్భంగా ఐఫోన్‌లు సహా ఇతర ఉత్పత్తులను తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఐఫోన్‌ 15 సిరీస్‌, ఐఫోన్‌ 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్‌ ధరకు అనేక మంది కొనుగోలు చేశారు.

అయితే తాజాగా ఆపిల్‌ వాచ్‌లపై (Apple Watch Pricedrop in india) ప్రస్తుతం బెస్ట్‌ ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్‌, క్రోమా సహా వివిధ ప్లాట్‌ఫాంలలో ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లను డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఆపిల్‌ వాచ్ SE 2, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10 లపై ఈ ఆఫర్లు ఉన్నాయి.

apple smart watchs gets huge discount

క్రోమా ప్లాట్‌ఫాంలో ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10 ను (Apple Watch 10 Series) సుమారు రూ.4000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. 42mm GPS మోడల్‌ను ధర రూ.46,900 గా ఉండేది. అయితే ప్రస్తుతం రూ.44,990 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు SBI, కోటక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో అదనంగా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఆపిల్ వాచ్‌ సిరీస్‌ 10.. S10 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు పాలిష్డ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ స్లీప్‌ apnea డిటెక్షన్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఛార్జింగ్‌ పరంగా ఈ ఆపిల్ వాచ్‌ సిరీస్‌ 10 మోడల్‌ కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుంది.

అదే ఆపిల్‌ వాచ్ సిరీస్‌ 9 ను (Apple Watch 9 Series) క్రోమాలో సుమారు రూ.10,000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ 45mm GPS మోడల్‌ విడుదల సమయంలో ధర రూ.44,900 గా ఉండేది. అయితే ప్రస్తుతం రూ.33,990 కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఏకంగా రూ.10,910 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9.. S9 చిప్‌తో పనిచేస్తోంది. ఈ వాచ్‌ డబుల్ ట్యాప్‌ గెశ్చర్స్‌ మరియు Siri ను సపోర్టు చేస్తుంది. డబుల్‌ ట్యాప్‌ గెశ్చర్స్‌ ద్వారా మ్యూజిక్‌ కంట్రోల్‌ చేయవచ్చు. దీంతోపాటు అలారం, ఫోన్ కాల్స్‌ను ఆన్సర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ వాచ్OS 10 తో పనిచేస్తోంది.

విజయ్‌ సేల్స్‌లో ఆపిల్‌ వాచ్‌ సిరీస్ 8 (Apple Watch 8 Series) GPS మోడల్‌ (45mm) ను రూ.30,490 కే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా అమెజాన్‌లో ఆపిల్‌ వాచ్‌ SE 2 (40mm) ను రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌ రూ.29,900 కు విడుదల అయింది. అయితే ఇవన్నీ లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌లుగా తెలుస్తోంది.

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ SE అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఎమర్జెన్సీ SOS, ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌లను రిపబ్లిక్‌ డే సందర్భంగా తగ్గింపు ధరలకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
apple smart watchs gets huge discount on croma vijay sales and amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X