Home
Gadgets

మరొకరి ప్రాణాలను కాపాడిన Apple వాచ్‌.. అసలేం జరిగిందంటే..?

ఆపిల్‌ వాచ్‌ మరోసారి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఆపిల్‌ ఇన్‌సైడర్‌ నివేదిక ప్రకారం.. అలెగ్జాండర్‌ అనే వ్యక్తి నిచ్చెన పైనుంచి కిందపడిపోయారు. వెంటనే సృహ కోల్పోయారు. అతని చేతికి ధరించిన ఆపిల్‌ వాచ్‌లోని ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ వెంటనే అత్యవసర సేవల నంబర్‌కు సమాచారం ఇచ్చింది. మరియు బాధితుడి భార‌్యకు సమాచారం పంపింది.

కిందపడిన అనంతరం అలెగ్జాండర్ చలనం లేకుండా పడి ఉన్నారు. ఆపిల్‌ వాచ్‌లోని ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఈ పరిస్థితిని గుర్తించింది. సుమారు ఒక నిమిషం పాటు అలెగ్జాండర్‌ కదలికల కోసం వేచి చూసింది. అనంతరం అత్యవసర సేవల విభాగానికి సమాచారం పంపింది. అలెగ్జాండర్‌ భార్య దగ్గరిలోనే ఉండడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Apple watch saves another life

అనంతరం అలెగ్జాండర్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆరోగ్య సిబ్బంది వెంటనే అవసరమైన చికిత్సలు అందించారు. మరియు అతని గాయాలకు ఏడు కుట్లు వేశారు. ప్రమాదంలో ఉన్న సమయంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు. మరియు పాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను మెచ్చుకున్నాడు.

గతంలో కూడా ఆపిల్‌ వాచ్‌ ఓ మహిళ ప్రాణాలు కాపాడింది. అమెరికాలోని సిన్సినాటికి చెందిన కిమ్మీ అనే మహిళ కాస్త అస్వస్తతకు గురైయ్యారు. కళ్లు, తలతిరగడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే నిద్రపోతే కొంత ఉపసమనం దొరుకుందన్న భావనతో ఆమె నిద్ర పోయేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆమె నిద్రపోయిన కాసేపటికే చేతికున్న ఆపిల్‌ వాచ్‌ అధిక హృదయ స్పందన రేటును గుర్తించింది.

హృదయ స్పందన రేటు నిమిషానికి 178 సార్లుగా ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఆమెను ఆపిల్‌ వాచ్‌ అప్రమత్తం చేసింది. దీంతో స్థానికంగా అందుబాటులో ఉన్న డాక్టర్‌ వద్దకు వెళ్లింది. కిమ్మీని పరీక్షించిన డాక్టర్లు.. సాడిల్‌ పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతున్నట్లు చెప్పారు. అంటే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఈ పరిస్థితి 50 శాతం మరణాల రేటును కలిగి ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై కిమ్మీ స్పందించారు. ఆపిల్‌ వాచ్‌ టెక్నాలజీతో తన ప్రాణాలు కాపాడుకున్నట్లు చెప్పారు. లేకుంటే అదే తనకు చివరి నిద్ర అయ్యేదని చెప్పారు. ఆపిల్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

ఆపిల్‌స్మార్ట్‌వాచ్‌లోని ఈ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే?
ఏదైనా సమయంలో మీరు ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం కదలకుండా ఉంటే ఆ స్థితిని ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ గ్రహిస్తుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది. మరో 30 సెకన్ల కండౌన్‌ పెడుతుంది. ఆ సమయంలో పెద్ద సౌండ్‌తో అలెల్ట్‌ చేస్తుంది.

ఆ సమయంలో కిందపడిన వ్యక్తి లేవడం లేదా సమీపంలో ఉన్న మరెవరు అయినా ఆ శబ్దం విని అక్కడకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మీరు లేచి స్మార్ట్‌వాచ్‌ పైనున్న టాప్ బటన్‌ క్లిక్‌ చేసి సౌండ్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. ఆ 30 సెకన్లపాటు బటన్‌ను ఆపకపోతే.. ఆటోమేటిక్‌గా మీరు అప్పటికే ఇచ్చిన అత్యవసర నంబర్లు సహా సాధారణ అత్యవసర నంబర్లకు కాల్‌ వెళ్తుంది.

ఆపిల్‌ వాచ్‌లో ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్‌ చేయాలంటే?
స్టెప్‌ 1 : ఐఫోన్‌లో వాచ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, మై వాచ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : ఎమర్జెన్సీ SOSపై క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను ఆన్‌ చేయాలి. ఒకవేళ అప్పటికే ఆన్‌లో ఉంటే, ఆల్‌వేజ్‌ ఆన్‌ లేదా ఓన్లీ ఆన్‌ వర్కౌట్స్‌ను ఎంచుకోండి.

Best Mobiles in India

English summary
Apple watch saves another life with the fall detection feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X