Home
Gadgets

నమ్మలేని నిజం, ఆపిల్ వాచ్ మనిషి ప్రాణాన్ని కాపాడింది, ధన్యవాదాలు కుక్..

రోజురోజుకు విస్తరిస్తున్న టెక్నాలజీ మనుషులపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.

By Chaitanyakumar Ark

రోజురోజుకు విస్తరిస్తున్న టెక్నాలజీ మనుషులపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే టెక్నాలజీ మనిషి ప్రాణాలను కాపాడితే నిజంగా సంచలనమే కదా..అవును మీరు ఉన్నది నిజమే. ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన వాచ్ ఓ మనిషి ప్రాణాన్ని కాపాడింది. ఐఫోన్కు కొనసాగింపుగా టెక్ గిగ్జాంట్ తీసుకున్న వినూత్న ప్రొడక్ట్ ఆపిల్ వాచ్. వినియోగదారుల ఫోన్ కాల్స్, మెసేజ్ల నుండి, హెల్త్ ఫిట్నెస్ ట్రాకర్ వరకు అన్ని రకాల పనులను ఇది చేస్తోంది. హార్ట్ రేటు స్థిరీకరణ కనుగొనటానికి ఈ డివైజాలకు మించినది మరేమి లేదంటే అతిశయోక్తి లేదు. తాజాగా ఈ ఆపిల్ వాచీ ఓ 76 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను కాపాడింది.

హార్ట్ రేటు

హార్ట్ రేటు

దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ప్రకారం హాంకాంగ్‌కు చెందిన Gaston D'Aquino చర్చిలో ప్రార్థనలకు వెళ్ళినప్పుడు హార్ట్ రేటు సాధారణ స్థాయి నుండి ఎక్కువకి పెరిగిందనే విషయాన్ని ఆపిల్ వాచ్ కనిపెట్టేసి, హార్ట్ ఎటాక్ సూచనలు ఉన్నాయియని సంకేతాలు ఇచ్చింది.

Gaston D'Aquino

Gaston D'Aquino

దీంతో కొంచెం కంగారు పడ్డ Gaston D'Aquino వెంటనే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ ని ఈ విషయమై కలిసాడు. మీకెలా తెలిసిందని డాక్టర్లు అడుగగా నా హార్ట్ రేటు పెరుగుతుందని నా వాచ్ చెప్పిందని తెలిపారు.

టెస్టులు చేయగా..

టెస్టులు చేయగా..

గాస్టన్ మాటలు విన్న డాక్టర్ ఒకింత ఆశ్చర్యపోయి ఎందుకైనా మంచిదని టెస్టులు చేయగా ఇది నిజమేనని తేలింది. డాక్టర్లు ఎలెక్ట్రోకార్డియోగ్రాఫ్ (ఈజీజీ) మిషన్ ద్వారా అతన్ని పరీక్షిస్తే నిజంగానే హార్ట్ ఎటాక్ సంభవించబోతున్నట్లు రిపోర్టుల్లో తేలింది.

గుండెకు చెందిన మూడు ప్రధాన హృదయ ధమనులలో..

గుండెకు చెందిన మూడు ప్రధాన హృదయ ధమనులలో..

అప్పటికే గాస్టన్ గుండెకు చెందిన మూడు ప్రధాన హృదయ ధమనులలో రెండు పూర్తిగా మూసుకుపోయిని, మూడోది కూడా దాదాపు 90 శాతం బ్లాక్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీని వలన గుండె పోటు ఎక్కువగా సంభవించిన, మనిషి ప్రాణాలను హరింపజేస్తుందని చెప్పారు. తక్షణమే డాక్టర్ గాస్టన్ కు శస్త్రచికిత్స చేసారు.

గుండెకు రక్తం సరఫరా అయ్యేలా

గుండెకు రక్తం సరఫరా అయ్యేలా

గుండెకు రక్తం సరఫరా అయ్యేలా చికిత్స చేసి గాస్టన్ డిశ్చార్జ్ చేశారు. ఆపిల్ వాచ్ వల్లే తన ప్రాణాలను కాపాడుకోగలిగానని గస్టన్ చెప్పారు. ఈ సంఘటన ఏప్రిల్ 1 న జరిగింది, కాగా ఇదే సంఘటన ఇతర వినియోగదారులకు కూడా జరిగింది.

సీఈఓ టిమ్-కుక్ కు లేఖ

సీఈఓ టిమ్-కుక్ కు లేఖ

బెలూన్ ఆంజియో ప్లాస్టీ చికిత్స తర్వాత, గస్టోన్ ప్రమాదం నుండి బయట పడ్డాడు. సరైన సమయంలో తనను హెచ్చరించినందుకు ఆపిల్ వాచ్ పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో కలిగి ఆపిల్ సీఈఓ టిమ్-కుక్ కు ఆపిల్ వాచ్ తన జీవితాన్ని ఎలా కాపాడిందో అని తెలియజేస్తూ ఒక లేఖ రాశాడు.ఈ లేఖలో "దయచేసి ఆపిల్ వాచ్ వాడకాన్ని హృదయ సంబంధ సమస్యలతో భాధపడే వాళ్ళకు సూచించండి , రెండు వారాల క్రితం గుండెపోటు కారణంగా నా కజిన్ ను కోల్పోయాను, అతను ఈ ఆపిల్ వాచ్ కలిగి ఉన్నట్లయితే, నాలాగే జీవించే అవకాశాన్ని పొందేవారేమో" అని భాధపడ్డారు.

ప్రత్యుత్తరం

ప్రత్యుత్తరం

ఈ లేఖకు టిం-కుక్ ప్రత్యుత్తరం కూడా ఇచ్చారు. "గాస్టన్, మీరు సరైన వైద్య సంరక్షణా చర్యలు తీసుకుని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నదుకు చాలా ఆనందిస్తున్నాను. మీరు మీ కథనాన్ని పంచుకోవడానికి మాకోసం సమయం వెచ్చించినందుకు అభినందిస్తున్నానని తెలిపారు.

ఇంతకు ముందు

ఇంతకు ముందు

ఇంతకు ముందు 18 ఏళ్ల డయానా రెకెటెన్వాల్డ్ అనే మహిళ యాపిల్ వాచ్ మానిటర్ హెచ్చరిక ద్వారా డాక్టరును సంప్రదించి, పరీక్షలలో తనకు మూత్రపిండాల సమస్య ఉందని తెలుసుకుని చికిత్స తీసుకుంది. అలాగే 32 ఏళ్ల విలియం మోంజిడెలిస్ అనే వ్యక్తి తన మానిటర్ హెచ్చరిక ద్వారా, తేలికగా తీసుకున్న అసాధారణ రక్త స్రావం సమస్యకై వైద్య చికిత్సను పొంది ఇప్పుడు సంతోషంగా గడుపుతున్నాడు.

Best Mobiles in India

English summary
76-year old man sends thank-you letter to Tim Cook after the Apple Watch helped save his life More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X