Apple Watch Series 10 ఆపిల్ వాచ్ సిరీస్ 10 విడుదల.. Sleep Apnea డిటెక్షన్ సహా అదిరిపోయే ఫీచర్లు..!!
ఆపిల్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 10వ జనరేషన్ వాచ్ సిరీస్ విడుదల అయింది. సోమవారం (సెప్టెంబర్ 9వ తేదీ) ఆపిల్ పార్క్‌లో నిర్వహించిన ఆపిల్ Its Glowtime ఈవెంట్‌లో వాచ్ సిరీస్ 10 ను (Apple Watch Series 10 Launched) విడుదల చేసింది. ఆకట్టుకొనే డిజైన్ సహా గత మోడల్‌తో పోలిస్తే సన్నని డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు పెద్ద డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ వాచ్ సిరీస్ Sleep Apnea డిటెక్షన్ ఫీచర్‌తో విడుదల అయింది. ఆపిల్ వాచ్ 10 సిరీస్‌తోపాటు వాచ్ అల్ట్రా 2 కొత్త కలర్ వేరియంట్ విడుదల అయింది.
ఆపిల్ వాచ్ సిరీస్ 10 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ వాచ్ సిరీస్ 10 సిరీస్ కొత్త వైడ్ యాంగిల్ OLED డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఫలితంగా మెసెజ్, కోడ్‌లు టైప్ చేసేందుకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపిల్ వాచ్‌లు కంటే.. ఈ కొత్త సిరీస్ అత్యంత సన్నని డిజైన్‌ను కలిగి ఉందని ఆపిల్ తెలిపింది. దీంతోపాటు గత మోడల్ కంటే 40 శాతం బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ వాచ్ సిరీస్ పాలిష్ చేయబడిన అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు టైటానియం వేరియంట్‌ను కూడా సంస్థ ఆవిష్కరించింది. ఆపిల్ వాచ్ సిరీస్ 10 మీడియా ప్లేయర్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా నేరుగా మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌ను ప్లే చేయవచ్చు. ఆపిల్ వాచ్ సిరీస్ 10 50 మీటర్ల వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
ఆపిల్ వాచ్ సిరీస్ 10.. S10 చిప్‌సెట్ పైన (Under the hood) పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని ఆపిల్ చెబుతోంది. మరియు WatchOS 11 ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాచ్ సిరీస్‌ల కంటే.. వాచ్ సిరీస్ 10 ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆపిల్ తెలిపింది. కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని తెలిపింది.

ఈ వాచ్ సిరీస్ 10 అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. నిద్ర నాణ్యత సహా శ్వాస సమస్యలను అత్యాధునిక టెక్నాలజీ ద్వారా గుర్తిస్తుంది. ఈ వాచ్ సిరీస్‌లో Sleep Apnea డిటెక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌లో ఇదే ముఖ్యమైన ఫీచర్‌గా ఉంది. 80 శాతానికి పైగా Sleep Apnea కేసులు నిర్ధారణ కావడం లేదు.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆపిల్ అధునాతన సాంకేతికను వినియోగించింది. నిద్రలో శ్వాసకోశ సమస్యలను పర్యవేక్షించేందు వీలుగా మోషన్ డిటెక్షన్‌ను ఉపయోగిస్తుంది. ఫలితంగా ఈ సమస్యను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి 30 రోజులకు ఒకసారి డేటాను విశ్లేషించి వినియోగదారునికి అందిస్తుంది. ఈ Sleep Apnea ఫీచర్ సుమారు 150 దేశాల్లో అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.

ఆపిల్ వాచ్ సిరీస్ 10 అమెరికా ధరలు ప్రస్తుతం విడుదల అయ్యాయి. GPS వెర్షన్ ధర $399 (భారత కరెన్సీ ప్రకారం రూ.33,498) గా ఉంటుంది. అదే GPS + సెల్యూలర్ వెర్షన్ ధర $499 (భారత కరెన్సీ ప్రకారం రూ.41,894) గా ఉంది. ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 20 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
ఈ వాచ్ సిరీస్ జెట్ బ్లాక్, పాలిష్‌డ్ టైటానియం రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రంగులు మెటాలిక్ థీమ్‌తో అందుబాటులో ఉంటాయి. ఆపిల్ వాచ్ అల్ట్రా 2 బ్లాక్ శాటిన్ కలర్ వేరియంట్‌ను కూడా ఆపిల్ విడుదల చేసింది. దీని ధర $799 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.67,000) గా ఉంది. ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ వాచ్ కొత్త కలర్ వేరియంట్ సేల్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








