ఆపిల్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. హెల్త్ ఫీచర్లు, ధర, సేల్ పూర్తి వివరాలు..!
ఆపిల్ Awe Dropping ఈవెంట్‌లో వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3, వాచ్ SE 3 మోడల్స్ లాంచ్ అయ్యాయి. వీటితోపాటు ఐఫోన్ 17 సిరీస్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆపిల్ కొత్త వాచ్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
ఆపిల్ వాచ్ సిరీస్ 11 :
ఈ వాచ్ సిరీస్ 100 శాతం రిసైకిల్ చేసిన టైటానియం, అల్యూమినియంతో తయారు చేసినట్లు ఆపిల్ తెలిపింది. అల్యామినియం ఫ్రేమ్ వెర్షన్‌లు సిరామిక్ కోటింగ్‌తో కూడిన lon X గ్లాస్‌ను కలిగి ఉంటుంది. టైటానియం వేరియంట్ సఫ్ఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఆపిల్ వాచ్ సిరీస్ 11 లైవ్ ట్రాన్స్‌లేషన్ ను సపోర్టు చేస్తుంది. మరియు ECG సహా ఇతర హెల్త్ ట్రాకర్‌లతో కూడిన హెల్త్ సూట్‌ను కలిగి ఉంది. నిద్ర నాణ్యత తెలిపే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. ఈ ఆపిల్ వాచ్ 5G ను సపోర్టు చేస్తుంది. WatchOS 26 పైన పనిచేస్తుంది.
ఈ వాచ్ Hypertension నోటిఫికేషన్‌లను కూడా అందిస్తుంది. ఆప్టికల్ హార్ట్ సెన్సార్ ద్వారా వివరాలను తీసుకుంటుంది. 30 రోజుల డేటా ఆధారంగా రిపోర్టు ఇస్తుంది. ఏదైన మార్పులను గమనిస్తే నోటిఫికేషన్‌ల రూపంలో అప్రమత్తం చేస్తుంది.
ఈ వాచ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 8 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు.

ఆపిల్ వాచ్ అల్ట్రా 3 ఫీచర్లు :
ఈ వాచ్ భారీ LTPO3 OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ స్లీప్ స్కోర్ (నిద్ర నాణ్యత), హైపర్ టెన్షన్‌పై నోటిఫికేషన్‌ల రూపంలో అలెర్ట్ పొందవచ్చు.
ఈ వాచ్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 42 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. Low power Mode లో 72 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది. ఈ మోడ్‌లోనే GPS, హార్ట్ రేట్ రీడింగ్స్ కోసం ఉపయోగిస్తే 20 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందుతుంది.
ఈ వాచ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఫలితం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 12 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. వాచ్ అల్ట్రా 3 కూడా 5G సపోర్టును కలిగి ఉంటుంది.
ఆపిల్ వాచ్ SE 3 :
ఈ వాచ్ s10 చిప్ పైన పనిచేస్తుంది. మరియు Siri ను కూడా సపోర్టు చేస్తుంది. అనేక గెశ్చర్స్‌ను సపోర్టు చేస్తుంది. కాల్ క్వాలిటీ కోసం వాయిస్ ఐసోలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. లైవ్ ట్రాన్స్‌లేషన్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్, ఆల్‌వైజ్ ఆన్ డిస్‌ప్లే, స్లీప్ స్కోర్, టెంపరేచర్ సెన్సింగ్ సహా మరిన్ని ఫీచర్లున్నాయి.
ఆపిల్ వాచ్ ధర వివరాలు :
ఆపిల్ వాచ్ సిరీస్ 11 (అల్యూనిమియం) 42mm ధర రూ.46900, 46mm ధర రూ.49900 గా ఉంది. అదే టైటానియం వేరియంట్ 42mm ధర రూ.79900, 46mm ధర రూ.84900 గా ఉంది.
ఆపిల్ వాచ్ SE 3 40mm ధర రూ.25900, 44mm ధర రూ.28900 గా ఉంది. ఆపిల్ వాచ్ అల్ట్రా 3 ఆల్పైన్ లూప్, టైల్ లూప్ లేదా ఓషన్ బ్యాండ్ స్ట్రాప్ ధర రూ.89900 గా ఉంది. అదే టైటానియం మిలనీస్ లూప్ ధర రూ.1,04,900 గా ఉంది. సెప్టెంబర్ 19 నుంచి సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications