Just In
- 1 hr ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 3 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- Movies
NTR Jamuna: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున.. భగ్గుమన్న ఫ్యాన్స్.. చివరికీ ఏమైందంటే?
- News
షార్ట్‌కట్స్ వద్దు! ‘యావరేజ్’ అద్భుతాలు సృష్టిస్తుంది: పరీక్షాపే చర్చలో ప్రధాని మోడీ
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
LTE సపోర్ట్‌తో ఆపిల్ వాచీలు,భారీ ఆఫర్లతో వస్తున్న జియో,ఎయిర్‌టెల్
ఆపిల్ కంపెనీతో జియో జతకట్టింది. ఇందులో భాగంగా ఆపిల్ వాచ్ 3 సీరిస్ మీద పలు ఆఫర్లను ప్రకటిస్తోంది. Apple Watch Series 3లో LTE సపోర్ట్ తో సెల్యూలార్ వర్షన్ ని ఆపిల్ కంపెనీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.అయితే ఈ వాచీలకు ఇండియాలో ఏ నెట్ వర్క్ ప్రొవైడర్ సపోర్ట ఇవ్వకపోవడంతో వీటిని ఆపిల్ కంపెనీ ఇండియాకి తీసుకురాలేదు. అయితే ఇప్పుడు జియో భాగస్వామ్యంలో ఈ వాచీలు ఇప్పుడు ఇండియాకి రానున్నాయి. జియోతో పాటు ఎయిర్టెల్ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు రెడీ అయింది. సెల్యూలార్ కనెక్టివిటితో జియో, ఎయిర్ టెల్ ఆఫర్లతో ఈ వాచీలు ఇప్పుడు ఇండియాలో సందడి చేయనున్నాయి. అయితే వీటి ధర ఎంత ఉందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఆర్డర్ టైంలో ఈ వాచీ ధర తెలిసే అవకాశం ఉంది.

Airtel
Airtel మే 4 నుంచి ఆపిల్ Watch Series 3(GPS + Cellular)ల మీద తన వెబ్‌సైట్లో ప్రీ రిజిస్ట్రేషన్లను చేపట్టనుంది.మే11 నుంచి ఇవి యూజర్ల చేతికి రానున్నాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు Airtel website ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.అయితే కంపెనీ ఈ వాచీల మీద ఇంకా ఎటువంటి ప్లాన్లను ప్రకటించలేదు.

రిలయన్స్ జియో
రిలయన్స్ జియో విషయానికొస్తే తన కస్టమర్ల కోసం మరో కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఆపిల్ వాచ్ సీరిస్3లోని సెల్యులార్ వాచ్‌లను జియో కస‍్టమర్లకుఅందుబాటులోకి తీసుకొస్తోంది. కాగా ఆపిల్ వాచ్ 3 సిరీస్‌లను విక్రయిస్తున్న తొలి 4జీ ఆపరేటర్‌గా జియో అవతరించింది.

మే4వ తేదీనుంచి
మే4వ తేదీనుంచి ప్రీ ఆర్డర్ చేసుకునే అవకాశాన్నికూడా కల్పిస్తున్నట్టు జియో ప్రకటించింది. రిలయన్స్ జియో.కాం, జియో స్టోర్స్‌లలో, రిలయన్స్ డిజిటల్స్ ద్వారా మే11 నుంచి ఈ ఆపిల్ వాచీలు గదారులకు ఇవి లభ్యం కానున్నాయి

ప్రీ బుకింగ్ ఆఫర్లు:
ఆపిల్ వాచ్ సిరీస్ 3 జియో ఎవ్రీవేర్ కనెక్ట్ సర్వీస్‌తో అందిస్తోంది. దీంతో జియో నెంబర్‌ను ఐఫోన్, ఆపిల్ వాచ్ సిరీస్ 3 సెల్యులర్ రెండింటిలోనూ ఉపయోగించుకోవచ్చు. అంటే నెంబర్ పోర్టబులిటీ ఉచితంగా లభిస్తోంది.

జియో నెంబర్‌తో అనుసంధానం
ఇందుకు ఐఫోన్‌లో ఆపిల్ వాచ్ ఐకాన్ ఓపెన్ చేసి, జియో నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలి. అయితే వినియోగదారులు తమకు ఐఫోన్ 6ఎస్, లేదా కొత్త మోడల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టం 11.3 లేదా ఆ తరువాత వాటిపైన మాత్రమే ఇది పనిచేసే అవకాశముంది. ఆపిల్ ఐఫోన్ యూజర్లు తమ ఐఫోన్ ఏదనేది నిర్థారించుకోవాల్సి ఉంటుంది. ఈ వాచీలను జియో హోమ్ డెలివరీ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.

టారిఫ్:
ఈ సేవలకు రిలయన్స్ జియో ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయదు. జియోలో వాడుతున్న అన్ని ప్లాన్లను ఇందులో కూడా పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ చందాదారులకు ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

ఆపిల్ వాచ్ సిరీస్ 3 (ఎల్‌టీఈ+జీపీఎస్)ఫీచర్లు:
మూడవ తరం ఆపిల్ వాచెస్ ద్వారా మ్యూజిక్ వినవచ్చు..సెల్యులార్ కనెక్టివిటీతో ఫోన్ లేకుండానే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో డ్యూయల్ కోర్ ప్రాసెసర్, వాటర్ రెసిస్టెంట్, కొత్తబారో మెట్రిక్ అల్టీమీటర్, బిల్ట్ ఇన్‌స్పీకర్(సిరి) లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470