గుండె జబ్బుల్ని పసిగట్టే ఆపిల్ స్మార్ట్ వాచీలు

ఆపిల్ గ్యాద‌ర్ రౌండ్ ఈవెంట్‌లో భాగంగా సరికొత్త ఐఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

|

ఆపిల్ గ్యాద‌ర్ రౌండ్ ఈవెంట్‌లో భాగంగా సరికొత్త ఐఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్లతో పాటుగా ఆపిల్ వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌ల‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. గ‌తంలో వ‌చ్చిన ఆపిల్ వాచ్‌ల క‌న్నా సిరీస్ 4 వాచ్‌లు 30 శాతం పెద్ద‌విగా ఉంటాయ‌ని ఆపిల్ తెలిపింది. ఇక ఈ నూత‌న సిరీస్‌లో ప‌లు నూత‌న వాచ్ ఫేస్ ల‌ను కూడా ఆపిల్ అందిస్తున్న‌ది. గ‌తంలో వ‌చ్చిన ఆపిల్ వాచ్‌ల‌ క‌న్నా సిరీస్ 4 వాచ్‌లు 50 శాతం ఎక్కువ సౌండ్ అవుట్ పుట్‌ను ఇస్తాయి. సిరీస్ 4 వాచ్‌ల‌లో అధునాత‌న ఎస్‌4 చిప్‌ను, 64 బిట్ డ్యుయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు.

 

పెట్రోల్, డీజిల్‍పై రూ. 7500 వరకు డిస్కౌంట్, పేటీఎం బంపరాఫర్ !పెట్రోల్, డీజిల్‍పై రూ. 7500 వరకు డిస్కౌంట్, పేటీఎం బంపరాఫర్ !

ధ‌ర

ధ‌ర

ఆపిల్ వాచ్ సిరీస్ 4 జీపీఎస్ ఎడిష‌న్ ధ‌ర 399 డాల‌ర్లు (దాదాపుగా రూ.28,686). అలాగే వాచ్ సిరీస్ 4 జీపీఎస్‌, సెల్యులార్ ఎడిష‌న్ ధ‌ర 499 డాల‌ర్లు (దాదాపుగా రూ.35,875).

కలర్స్

కలర్స్

ఆపిల్ వాచ్ సిరీస్ 4 వాచ్‌లు గోల్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ క‌ల‌ర్, సిల్వ‌ర్‌, స్పేస్ బ్లాక్ స్టెయిన్ లెస్ స్టీల్ మోడ‌ల్స్‌లో లభ్యం కానున్నాయి.

 జీపీఎస్ ఎడిస‌న్..

జీపీఎస్ ఎడిస‌న్..

ఆపిల్ వాచ్ సిరీస్ 4 జీపీఎస్ ఎడిస‌న్ 26 దేశాల్లో ల‌భిస్తుంది. అలాగే ఆపిల్ వాచ్ సిరీస్ 4 జీపీఎస్‌, సెల్యులార్ ఎడిష‌న్ 16 దేశాల్లో ల‌భిస్తుంది.

రెండు మోడ‌ల్స్..
 

రెండు మోడ‌ల్స్..

ఈ రెండు మోడ‌ల్స్ ఈ నెల 21వ తేదీ నుంచి స్టోర్స్‌లో యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానున్నాయి. భార‌త్‌లో ఈ వాచ్‌లు ల‌భ్య‌మ‌య్యే తేదీల‌ను మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

సిరీస్ 3 వాచ్‌లు..

సిరీస్ 3 వాచ్‌లు..

ఇదిలా ఉంటే వాచ్ సిరీస్ 4 వాచ్‌లు విడుద‌ల‌యిన నేపథ్యంలో వాచ్ సిరీస్ 3 వాచ్‌లు రూ.20వేల ప్రారంభ ధ‌ర‌కు ల‌భిస్తాయ‌ని ఆపిల్ వెల్ల‌డించింది.

ఎల‌క్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) చిప్‌..

ఎల‌క్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) చిప్‌..

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తొలిసారిగా సిరీస్ 4 వాచ్‌ల‌లో ఎల‌క్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) చిప్‌ను అమ‌ర్చారు. దీని వ‌ల్ల యూజ‌ర్లు ఎప్పుడైనా, ఎక్క‌డైనా వాచ్‌లోని ఈసీజీ యాప్ ద్వారా త‌మ ఈసీజీ చెక్ చేసుకోవ‌చ్చు.

గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాన్ని ..

గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాన్ని ..

దీని వ‌ల్ల యూజ‌ర్లు త‌మ‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాన్ని ముందుగానే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. గుండె కొట్టుకునే రేటు, ప‌లు ఇత‌ర అంశాల ఆధారంగా ఆపిల్ సిరీస్ 4 వాచ్‌లు యూజ‌ర్లకు గుండె జ‌బ్బుకు చెందిన స‌మాచారాన్ని తెలియ‌జేస్తాయి.

పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో...

పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో...

ఈ వివ‌రాల‌న్నింటినీ పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆపిల్ వాచ్ స్టోర్ చేస్తుంది. అనంత‌రం వాటిని డాక్ట‌ర్ల‌తో యూజర్లు షేర్ చేసుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
Apple Watch Series 4: Release date, specs, price and how to pre-order more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X