Home
Gadgets

Apple వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా2 విడుదల.. ధర, ఫీచర్లు, సేల్‌ వివరాలు..!

ఆపిల్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ Apple Watch series 9 విడుదల అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌ S9 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9.. Siri ని సపోర్టు చేస్తుందని టెక్‌ దిగ్గజం చెబుతోంది. సిరి ఆధారంగా ఆరోగ్య సమాచారం కూడా తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. వాయిస్‌ కమాండ్‌ ఆధారంగా ఇంగ్లీష్‌, మాండరీన్‌ భాషల్లో పనిచేస్తుంది.

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9 స్మార్ట్‌వాచ్‌ 18 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుందని సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌వాచ్‌ 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు డబుల్‌ట్యాప్‌ చేయడం ద్వారా కాల్స్‌ సహా ఇతర పనులు చేయవచ్చని ఆపిల్‌ సంస్థ తెలిపింది.

Apple watch series 9 and watch ultra 2

ఈ వాచ్‌లో అనేక రకాల హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉందని ఆపిల్‌ తెలిపింది. దీంతోపాటు ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ WatchOS 10 ఆధారంగా పనిచేయనుంది. ఆపిల్‌ వాచ్‌ సిరిస్‌ భారీగా అప్‌గ్రేడ్‌ పొందినట్లు సంస్థ తెలిపింది. S9 SIP (సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ) CPUలో 5.6 బిలియన్‌ ట్రాన్సిస్టర్‌లు, 4 కోర్‌ న్యూరల్‌ ఇంజిన్‌ ముందున్న సిరీస్‌ కంటే 30% వేగవంతమైన GPUను కలిగి ఉంది.

దీంతోపాటు ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9లో ఫింగర్‌ ప్రింట్‌ ట్యాపింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీనిని ట్యాపింగ్ చేయడం ద్వారా ఫోన్‌ కాల్‌కు సమాధానం ఇవ్వడం లేదా కాల్‌ ను డిస్‌కనెక్ట్‌ చేయవచ్చు. ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9.. సంస్థ యొక్క తొలి కార్బన్‌ న్యూట్రల్‌ ఉత్పత్తిగా రానుంది.

ఈ వాచ్‌ అల్యూమినియమ్‌ వెర్షన్‌... పింక్‌, స్టార్‌లైట్‌, సిల్వర్‌, మిడ్‌నైట్‌, ప్రొడక్ట్‌ రెడ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వెర్షన్‌ గోల్డ్‌, సిల్వర్‌, గ్రాఫైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఆపిల్‌ ఈవెంట్‌లో ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9 సహా ఆపిల్‌ వాచ్‌ అల్ట్రా2ను ఆవిష్కరించింది.

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9 GPS మోడల్‌ ప్రారంభ ధర $399గా ఉంది. అదే GPS+ సెల్యూలర్‌ మోడల్‌ $499గా ఉంది. ఈ వాచ్‌లు భారతదేశంలో సెప్టెంబర్‌ 22 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అయితే భారత్‌లో ఈ వాచ్‌ ధరలపై ఇంకా సమాచారం వెల్లడి కాలేదు.

ఆపిల్‌ వాచ్‌ అల్ట్రా 2... ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9 తరహా ఫీచర్లను కలిగి ఉంది. అయితే గరిష్ఠ బ్రైట్‌నెస్‌ మాత్రం 3000 నిట్స్‌గా ఉంటుంది. ఈ వాచ్‌ 36 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. తక్కువ పవర్‌మోడ్ ద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చని తెలుస్తోంది. ఈ వాచ్‌ ధర $799గా ఉంది. ఈ వాచ్‌లు భారతదేశంలో సెప్టెంబర్‌ 22 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Apple watch series 9 and watch ultra 2 with S9 chip launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X