Home
Gadgets

Apple Vitals App ఆరోగ్య సమస్యలు వస్తాయని ముందుగానే చెప్పేసే ఆపిల్‌ వాచ్‌ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుంది..?

ఆపిల్‌ వాచ్‌ ఫీచర్‌లు (Apple Watch) ఇప్పటికే అనేక మంది యూజర్లను ప్రాణాలను కాపాడాయి. గుండె సంబంధిత సమస్యలు, అకస్మాత్తుగా పడిపోయినా ఆపిల్‌ వాచ్‌లోని స్మార్ట్‌ ఫీచర్‌లు వైద్యసాయం పొందేలా అప్రమత్తం చేయడం సహా అత్యవసర వైద్య బృందాలకు సమాచారం అందిస్తాయి. ఈ తరహా ఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా వచ్చిన అప్‌డేట్‌ ద్వారా మీరు ఎప్పుడు అనారోగ్యం బారినపడతారనే సమాచారాన్ని యూజర్లకు ముందుగానే తెలియనుంది. ఈ ఫీచర్‌ నెల రోజుల ముందే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌పై ఆపిల్‌ వాచ్‌ యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

గుండె కొ‌ట్టుకొనే వేగంలో అకస్మాత్తుగా మార్పులు గమనించిన ఆపిల్‌ వాచ్‌.. యూజర్లను అప్రమత్తం చేస్తుంది. వెంటనే వైద్యసాయం పొందాలని సూచిస్తుంది. అదే విధంగా ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా నేలమీద పడిపోతే.. వారి చేతికున్న ఆపిల్‌ వాచ్‌లోని ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌.. తన పని ప్రారంభిస్తుంది. కొన్ని సెకన్లపాటు భారీ శబ్ధంతో అలారం మోగిస్తుంది.

how Apple watch Vitals app works

ఆ శబ్ధానికి యూజర్‌ స్పృహలోకి వస్తే సరే.. లేకుంటే వెంటనే సమీపంలోని వైద్యబృందాలు సహా యూజర్‌ కుటుంబ సభ్యులకు సమాచారం పంపిస్తుంది. లోకేషన్‌ సహా వివరాలను షేర్‌ చేస్తుంది. ఫలితంగా వేగంగా వైద్యం అందేలా సాయం చేస్తుంది. ఈ తరహా ఘటనలో చాలా వెలుగులోకి వచ్చాయి.

శరీరంలోని వచ్చిన మార్పులను :
అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌ (Apple watch Vitals app) మరింత అత్యాధునికంగా పనిచేస్తుంది. మీకు ఎప్పుడు అనారోగ్యం కలుగుతుందో కూడా కచ్చితంగా చెప్పగలుగుతుంది. మరో మూడు రోజుల్లో మీరు అనారోగ్యం బారిన పడతారని ముందస్తుగానే యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ఇందుకోసం శరీరంలోని వచ్చిన మార్పులను విశ్లేషణ చేస్తుంది.

ఆపిల్‌ వాచ్‌ ఇటీవల WatchOS 11 అప్‌డేట్‌ను పొందింది. ఈ అప్‌డేట్‌ ద్వారా Vitals యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ యూజర్‌ల రోజువారీ ఆరోగ్యానికి సంబంధించిన విశ్లేషణ చేస్తుంది. యూజర్‌ నిద్రలో ఉన్న సమయంలో.. నిద్రకు సంబంధించిన వివరాలు, హార్ట్‌ రేట్‌, శ్వాస క్రియ రేటు, బ్లడ్‌ ఆక్సిజన్ లెవల్‌ (SpO2), శరీర ఉష్ణోగ్రత వంటి గణాంకాలను సేకరిస్తుంది. దీని ఆధారంగా యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది.

మరికొన్ని రోజుల్లో మీకు అనారోగ్యం! :
యూజర్‌ సాధారణ స్థితిలో గణనీయమైన మార్పులు వస్తే ఈ ఫీచర్‌ అప్రమత్తం చేస్తుంది. సాధారణ పరిస్థితితో పోలిస్తే అసాధారణ రీడింగ్‌లు నమోదవుతున్నాయని.. మరికొన్ని రోజుల్లో అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని వారికి సమాచారం అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై సోషల్‌ మీడియా వేదికగా యూజర్‌లు ఆపిల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ఫీచర్‌పై ప్రశంసలు :
ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం Reddit లో ఆపిల్ Vitals యాప్‌ను ప్రశంసిస్తున్నారు. అనారోగ్యం బారినపడతానని ఈ యాప్‌కి మూడు రోజుల ముందే తెలుసంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. శరీర ఉష్ణోగ్రతలో మార్పులపై మూడు రోజుల ముందుగానే సూచనలు అందినట్లు మరో యూజర్‌ తెలిపారు. ఈ యాప్‌ను సూపర్‌ ఫీచర్‌గా పేర్కొంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple watch Vitals app detects illness in advance with the latest watchOS 11 update
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X