Asus బ్రాండ్ కొత్త ల్యాప్‌టాప్‌లు లాంచ్ అయ్యాయి!! ఫీచర్స్ లో ప్రత్యేకతలు ఇవే...

|

తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ఆసుస్ సంస్థకి ఇండియాలో మంచి మార్కెట్ కలిగి ఉంది. ఇప్పుడు ఈ సంస్థ భారత ల్యాప్‌టాప్‌ మార్కెట్‌లో కొత్తగా ఆసుస్ జెన్‌బుక్ S 13 OLED అనే కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ జెన్‌బుక్ S 13 ల్యాప్‌టాప్ 1.1 కిలోల బరువు మరియు 14.9mm మందంతో మార్కెట్‌లో అత్యంత సన్నని మరియు తేలికైన ల్యాప్‌టాప్ అని కంపెనీ పేర్కొంది. కంపెనీ కొత్త జెన్‌బుక్‌తో పాటు Ryzen 7 5800H CPUతో పనిచేసే కొత్త వివోబుక్ ప్రో 14 OLED మరియు వివోబుక్ లను కూడా విడుదల చేసింది.

 

ఆసుస్ జెన్‌బుక్ S 13 OLED ధరల వివరాలు

ఆసుస్ జెన్‌బుక్ S 13 OLED ధరల వివరాలు

ఆసుస్ జెన్‌బుక్ S 13 OLED భారతదేశంలో రూ.99,990 ధర వద్ద విడుదలయింది. మరొకటి ఆసుస్ వివోబుక్ ప్రో 14 OLED (M3400) మోడల్ రూ.59,990 ధర వద్ద సోలార్ సిల్వర్ మరియు కాస్మోస్ బ్లూ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. చివరిగా ఆసుస్ వివోబుక్ 16X మోడల్ రూ.54,990 ధర వద్ద క్వైట్ బ్లూ మరియు ట్రాన్స్‌పరెంట్ సిల్వర్ కలర్‌లో లభిస్తుంది. ఇవి ఈరోజు నుండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Xiaomi నుంచి కొత్త ఫోన్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకొండి.Xiaomi నుంచి కొత్త ఫోన్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకొండి.

Asus ZenBook S 13 OLED (UM5302) స్పెసిఫికేషన్లు
 

Asus ZenBook S 13 OLED (UM5302) స్పెసిఫికేషన్లు

ఆసుస్ జెన్‌బుక్ S 13 OLED (UM5302) ల్యాప్‌టాప్ 13.3-అంగుళాల OLED టచ్‌స్క్రీన్ ప్యానెల్ మరియు 2.8K రిజల్యూషన్‌తో వస్తుంది. దీని యొక్క స్క్రీన్ పొడవైన 16:10 నిష్పత్తితో మరియు 89% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో లభిస్తుంది. ఈ జెన్‌బుక్ S 13 OLED సరికొత్త AMD రైజెన్ 6000 U సిరీస్ CPUలను కలిగి ఉండి వినియోగదారులకు మంచి పనితీరుని అందిస్తుంది. అంతేకాకుండా AMD యొక్క కొత్త RDNA 2 GPU ఆర్కిటెక్చర్‌తో ప్యాక్ చేయబడి ఉండడంతో ఇది మునుపెన్నడూ చూడని ఫారమ్ ఫ్యాక్టర్‌లో గేమింగ్-గ్రేడ్ గ్రాఫిక్‌లను అందించాలని లక్ష్యంగా ఉంది.

ఆసుస్ జెన్‌బుక్ S 13

ఆసుస్ జెన్‌బుక్ S 13 కొత్త ల్యాప్‌టాప్ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఇది AI నాయిస్-లెస్ ఆడియోను కలిగి ఉండడంతో వినియోగదారులు ఎటువంటి సందర్భంలోనైనా స్పష్టంగా వినగలగడానికి అనుమతిని ఇస్తుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్ మినిమల్ ASUS మోనోగ్రామ్ లోగోతో పాటుగా ఆక్వా సెలాడాన్, పాండర్ బ్లూ వంటి రిఫ్రెష్ పాస్టెల్ వంటి కలర్ లలో వస్తుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 67 WHrs పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. ఇది 100% DCI-P3 కలర్ గామట్ కవరేజ్‌తో వస్తుంది.

Infinix InBook X1 Slim ఇండియా లో లాంచ్ అయింది ! ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.Infinix InBook X1 Slim ఇండియా లో లాంచ్ అయింది ! ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.

ఫ్లెక్సిబిలిటీ

Zenbook S13 ఫ్లెక్సిబిలిటీ కోసం జెన్-క్యాప్డ్ 180° కీలుతో అమర్చబడి ఉంటుంది. ఇది కీబోర్డ్ డెక్, టచ్‌ప్యాడ్ మరియు పామ్ రెస్ట్‌పై ASUS యాంటీ బాక్టీరియల్ గార్డ్‌తో కూడా వస్తుంది. ఈ సరికొత్త జెన్‌బుక్ డ్రాప్స్, వైబ్రేషన్‌లు, షాక్‌లు, పవర్ బటన్‌లో పొందుపరిచిన ఫింగర్‌ప్రింట్ స్కానర్ మొదలైన వాటి కోసం US MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది.

ఆసుస్ వివోబుక్ 16X (M1603) స్పెసిఫికేషన్‌లు

ఆసుస్ వివోబుక్ 16X (M1603) స్పెసిఫికేషన్‌లు

ఆసుస్ వివోబుక్ 16X కొత్త ల్యాప్‌టాప్ సరసమైన ధరల వద్ద 16-అంగుళాల డిస్ప్లేని 16:10 స్క్రీన్‌ పరిమాణంతో కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా AMD Ryzen 7 5800H గేమింగ్-గ్రేడ్ CPUతో రన్ అవుతూ 512GB PCIe 3.0 SSD మరియు 16GB వరకు RAM తో పాక్ చేయబడి లభిస్తుంది. చివరిగా ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 50 WHr పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 19.9mm మందం మరియు 1.8kg బరువుతో లభిస్తుంది.

ఆసుస్ వివోబుక్ ప్రో 14 OLED (M3400) స్పెసిఫికేషన్‌లు

ఆసుస్ వివోబుక్ ప్రో 14 OLED (M3400) స్పెసిఫికేషన్‌లు

ఆసుస్ వివోబుక్ ప్రో 14 OLED ల్యాప్‌టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 14-అంగుళాల 2.8K OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 600నిట్‌ల గరిష్ట ప్రకాసంను కలిగి ఉండడంతో పాటుగా VESA యొక్క డిస్‌ప్లేHDR ట్రూ బ్లాక్ 600 ప్రమాణంతో పాటు డాల్బీ విజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 100% DCI-P3 కలర్ స్పేస్‌ను కవర్ చేస్తు దాని ఖచ్చితమైన కలర్ ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తూ పాంటోన్ ధ్రువీకరణతో వస్తుంది. ఇది 45W TDP, 512GB PCIe Gen 3 SSD మరియు 16GB వరకు DDR4 RAMతో AMD Ryzen 7 5800H CPU వరకు అందించబడుతుంది. ఇది 50WHr బ్యాటరీని కలిగి ఉంది మరియు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, ఇది కేవలం 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఇతర ఫీచర్లలో స్మార్ట్ AMP, పవర్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫిజికల్ వెబ్‌క్యామ్ ప్రైవసీ షట్టర్ వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
ASUS Brand Launched New Laptops in India: Price, Specs, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X