వేసవిలో వేడి గాలితో ఇబ్బందులా? తక్కువ ధరలో ఎక్కువ చల్లదనాన్ని అందించే బెస్ట్ సీలింగ్ ఫ్యాన్స్ ఇవిగో.. !
Best Ceiling Fans: వేసవి వచ్చేసింది, మండే ఎండలతో ఉక్కపోత మొదలైంది. ఇంట్లో మంచి సీలింగ్ ఫ్యాన్ ఉంటేనే కాస్త హాయిగా ఉంటుంది. మంచి ఫ్యాన్ గాలి ఇవ్వడమే కాదు, కరెంటు బిల్లు తగ్గించి, ఎక్కువ కాలం పనిచేస్తుంది కూడా. మీరు తక్కువ ధరలో ఉత్తమమైన ఫ్యాన్ కోసం చూస్తున్నా, లేదంటే చాలా ఆకర్షణీయంగా, అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫ్యాన్ కావాలన్నా, మీకోసం 5 బెస్ట్ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నాయి.
ఇవి ఇండియాలో బాగా అమ్ముడవుతున్న, నమ్మకమైన ఫ్యాన్స్. అంతేకాదు, కరెంటు పొదుపు చేస్తాయి, చాలా ఉపయోగకరమైన ఫీచర్లు సైతం అందిస్తాయి. ఆ టాప్ 5 సీలింగ్ ఫ్యాన్స్ ఏవో చూద్దాం. ఇవన్నీ కూడా బాగా పేరు మోసిన బ్రాండ్ల ఫ్యాన్లే కావడం విశేషం.

* బజాజ్ న్యూ బహార్ 1200mm సీలింగ్ ఫ్యాన్
బజాజ్ న్యూ బహార్ ఫ్యాన్ మన్నికకు పెట్టింది పేరు. ఇది నిమిషానికి 205 క్యూబిక్ మీటర్ల గాలిని, 380 RPM స్పీడ్‌తో ఇస్తుంది. ఇది 73 వాట్స్ కరెంటు మాత్రమే తీసుకుంటుంది, కరెంటు తక్కువగా వినియోగిస్తుంది. మంచి పనితీరు కనబరుస్తుంది. దీని మోటార్ క్వాలిటీ బాగుంటుంది. దీని ధర రూ.1,400 నుంచి రూ.1,600 మధ్య ఉంటుంది.
* ఓరియంట్ ఎలక్ట్రిక్ ఏపెక్స్-FX సీలింగ్ ఫ్యాన్
తక్కువ ధరలో లభించే ఓరియంట్ ఏపెక్స్-FX ఫ్యాన్ గాలిని బాగా విసురుతుంది. ఇది 370 RPM (రొటేషన్లు పర్ మినిట్ - రెక్కలు తిరిగే వేగం) స్పీడ్‌తో నిమిషానికి 200 క్యూబిక్ మీటర్ల (CMM) గాలిని ఇస్తుంది. అంటే గాలి మీకు ఒకేలా, స్మూత్‌గా తగులుతుంది. ఇది కేవలం 78 వాట్స్ కరెంటు మాత్రమే తీసుకుంటుంది.
కాబట్టి రోజూ వాడినా కరెంటు బిల్లు పెద్దగా రాదు. మూడు రెక్కలతో డిజైన్ ఉండటం వల్ల గాలి రూమ్ మొత్తం చక్కగా చేరుతుంది. ఇది చాలా సైలెంట్‌గా పనిచేస్తుంది, అందుకే బెడ్‌రూమ్స్‌లో, హాల్స్‌లో పెట్టుకోవడానికి బాగుంటుంది. దీని ధర రూ.1,300-రూ.1,500 మధ్య ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫ్యాన్ కావాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.
* క్రాంప్టన్ హిల్ బ్రిజ్ 1200mm సీలింగ్ ఫ్యాన్
తక్కువ ధరలో, హై స్పీడ్ కూలింగ్ అంటే క్రాంప్టన్ హిల్ బ్రిజ్ గుర్తొస్తుంది. ఇది నిమిషానికి 210 క్యూబిక్ మీటర్ల గాలిని, 370 RPM స్పీడ్‌తో ఇస్తుంది. గాలి ఒకేలా, పవర్‌ఫుల్‌గా వస్తుంది. ఇది 75 వాట్స్ కరెంటు మాత్రమే తీసుకుంటుంది. దీని ధర రూ.1,300 నుండి రూ.1,500 మధ్య ఉంటుంది.
* ఉషా స్ట్రైకర్ గెలాక్సీ 1200mm సలింగ్ ఫ్యాన్
ఉషా స్ట్రైకర్ గెలాక్సీ ఫ్యాన్ చాలా ఎక్కువ గాలి అందిస్తూ గదిని క్షణాల్లో చల్లగా మార్చేస్తుంది. ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. ఇది నిమిషానికి 240 క్యూబిక్ మీటర్ల గాలిని, 385 RPM స్పీడ్‌తో ఇస్తుంది. పెద్ద రూమ్స్‌లోనూ గాలి బాగా వస్తుంది. ఇది 70 వాట్స్ కరెంటు మాత్రమే తీసుకుంటుంది, కరెంటు చాలా తక్కువ వినియోగిస్తుంది.
దీని రెక్కలకు దుమ్ము పట్టకుండా స్పెషల్ కోటింగ్ ఉంటుంది, అందుకే ఫ్యాన్ ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది, శుభ్రం చేసే పని కూడా తక్కువ. దీని ధర రూ.2,100 నుంచి రూ.2,300 మధ్య ఉంటుంది. స్టైలిష్‌గా ఉంటే అదిరిపోయే పర్ఫార్మెన్స్ కావాలనుకునేవాళ్లకు ఇది చాలా మంచి ఫ్యాన్ అని చెప్పవచ్చు.
* హావెల్స్ ఫెస్టివా 1200mm సీలింగ్ ఫ్యాన్
స్టైలిష్‌గా ఉండాలి, బాగా గాలి ఇవ్వాలి అనుకుంటే హావెల్స్ ఫెస్టివా ఫ్యాన్ కొనుగోలు చేయొచ్చు. ఇది నిమిషానికి 230 క్యూబిక్ మీటర్ల గాలిని, 400 RPM స్పీడ్‌తో ఇస్తుంది. అంటే గాలి చాలా బలంగా, నిలకడగా వస్తుంది. ఇది కేవలం 70 వాట్స్ కరెంటు మాత్రమే తీసుకుంటుంది.
అందుకే కరెంటు బిల్లు గురించి టెన్షన్ లేదు. దీని రెక్కలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి, మీ రూమ్‌కి మంచి లుక్ వస్తుంది. దీని ధర రూ.2,000 నుంచి రూ.2,300 మధ్య ఉంటుంది. ఇది చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా మంచి పనితీరును అందిస్తుంది. కాస్త ఎక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్యాన్ కావాలనుకునేవాళ్లకు ఇది సరిపోతుంది.
* ఏది తీసుకోవాలి?
సీలింగ్ ఫ్యాన్ కొనేటప్పుడు గాలి ఎంత దూరం వస్తుంది, స్పీడ్ ఎంత, కరెంటు ఎంత తీసుకుంటుంది, క్వాలిటీ ఎలా ఉంది అనేవి చూడాలి. తక్కువ బడ్జెట్‌లో కావాలంటే ఓరియంట్ ఎలక్ట్రిక్ ఏపెక్స్-FX, క్రాంప్టన్ హిల్ బ్రిజ్ ఫ్యాన్స్ కొనొచ్చు. స్టైలిష్‌గా, కరెంటు పొదుపు చేసే ఫ్యాన్స్ కావాలంటే హావెల్స్ ఫెస్టివా, ఉషా స్ట్రైకర్ గెలాక్సీ చూడొచ్చు. మన్నిక, నమ్మకం కావాలంటే బజాజ్ న్యూ బహార్ ఉత్తమ ఎంపిక.


Click it and Unblock the Notifications








