Just In
- 1 hr ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 9 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 12 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- News
అఖిలేష్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం: కాన్వాయ్‌లో కార్లను ఢీకొన్న మరో కారు, ముగ్గురికి గాయాలు
- Movies
Writer Padmabhushan day 1 Collections రైటర్ పద్మభూషణ్‌కు భారీ ఓపెన్సింగ్.. తొలి రోజు ఎంతంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Belkin నుంచి సరికొత్త వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్
స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ప్రక్రియను మరింత విప్లవాత్మకం చేస్తూ మార్కెట్లో అడుగుపెట్టిన వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆశించిన స్థాయితో తన పరిధిని విస్తరించుకోలేక పోయింది. ముఖ్యంగా భారత్ వంటి ప్రధాన మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ యూజర్లే ఎక్కువుగా ఉండటంతో ఈ ఖరీదైన టెక్నాలజీకి పూర్తిగా ఆదరణ కొరవడింది. కేవలం హై-ఎండ్ ఫోన్‌లకు మాత్రమే పరిమితమవుతోన్న ఈ టెక్నాలజీని సామ్‌సంగ్, యాపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు మాత్రమే పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్ క్యూఐ ఎనేబుల్డ్ ఛార్జింగ్ ప్యాడ్ ఆధారంగా జరుగుతోంది.

ఈ ప్యాడ్ పై డివైస్‌ను ప్లేస్ చేయటం ద్వారా ఛార్జింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. యాపిల్, సామ్‌సంగ్ బ్రాండ్‌లకు సంబంధించిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను మీరు ఈ మధ్యనే కొనుగోలు చేసినట్లయితే బెల్కిన్ బూస్టప్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. Belkin బ్రాండ్ నుంచి ఈ మధ్యనే మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఛార్జింగ్ ప్యాడ్ ధర రూ.2,999గా ఉంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లతో పాటు అమెజాన్.ఇన్ అలానే ఇమాజిన్ స్టోర్‌లలో ఈ ప్రొడక్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది.

బెల్కిన్ బూస్టప్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ప్రత్యేకతలు..
* క్యూఐ స్టాండర్డ్స్‌తో వస్తోన్న అన్ని డివైస్‌లను ఈ ఛార్జింగ్ ప్యాడ్ సపోర్ట్ చేస్తుంది,
* ఫాస్ట్ ఛార్జింగ్ నిమిత్తం 5W/1-amp అవుట్‌పుట్‌ను ఈ ప్యాడ్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది,
* ఈ ఛార్జింగ్ ప్యాడ్‌కు పోర్టబుల్ డిజైనింగ్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది,
* 3 మిల్లీమీటర్ల మందంతో వచ్చే అన్ని లైట్ వెయిట్ కేస్‌లను ఈ సాఫ్ట్ ఛార్జింగ్ ప్యాడ్ కంఫర్టబుల్‌గా హ్యాండిల్ చేయగలుగుతుంది.

ఏఏ డివైస్‌లను సపోర్ట్ చేస్తుంది..?
Qi స్టాండర్డ్‌తో వచ్చే ప్రతి డివైస్‌ను సపోర్ట్ చేసే విధంగా బెల్కిన్ ఈ ఛార్జింగ్ ప్యాడ్‌ను బిల్ట్ చేసింది. గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్, గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ వంటి టేటెస్ట్ డివైస్‌లను సైతం ఈ ఛార్జింగ్ ప్యాడ్ సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్‌కు సంబంధించిన చార్జింగ్ బెడ్ పై ఏదైనా డివైస్‌ను ప్లేస్ చేసిన వెంటనే, ఆ డివైస్ ఏంటనేది గుర్తించటంతో పాటు, ఆ డివైస్ చార్జ్ అయ్యేందుకు అవసరమైన అన్ని రకాల వనరులను సమకూరుస్తుంది.

1.8ఎమ్ కేబుల్‌తో..
బెల్కిన్ బూస్టప్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ 1.8ఎమ్ మైక్రో-యూఎస్బీ టు యూఎస్బీ-ఏ కేబుల్‌తో షిప్ అవుతోంది. ఈ ప్యాకేజీలో AC adapterను ఇంక్లూడ్ చేయకపోవటం విశేషం.

పోర్టబుల్ అండ్ క్లీన్ డిజైన్..
బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో ప్రత్యేకించి ఇండియన్ కస్టమర్స్ కోసం రూపొందించబడిన ఈ ఛార్జింగ్ ప్యాడ్ డిజైనింగ్ పరంగా మొదటి లుక్‌లోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఫ్లాట్ డిస్క్, మాటీ డార్క్‌గ్రే సర్‌ఫేస్ వంటి అంశాలు ప్యాడ్‌కు మరింత క్లాసికల్ లుక్‌ను తీసుకువచ్చాయి.

ఇండక్టివ్ పవర్ ట్రాన్స్‌ఫర్ సిద్ధాంతం...
స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో వైర్‌లెస్ చార్జింగ్ ఓ విప్లవాత్మక ఆవిష్కరణగా నిలిచింది. ఇండక్టివ్ పవర్ ట్రాన్స్‌ఫర్ సిద్ధాంతం ఆధారంగా స్పందించే వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను వైర్లతో పనిలేకుండా చార్జ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఈ చార్జ్ ప్లేట్ లేదా ప్యాడ్ పై కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది.

ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లను...
సామ్‌సంగ్ వైర్‌లెస్ ఛార్జర్‌కు సంబంధించిన ఛార్జింగ్ బెడ్ పై ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లను చార్జ్ చేసుకునే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. Qi స్టాండర్డ్‌తో వచ్చే ప్రతి డివైస్‌ను సపోర్ట్ చేసే విధంగా సామ్‌సంగ్ ఈ చార్జర్‌ను బిల్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్రతిధ్వని (resonance), అయస్కాంత ప్రేరణ (magnetic induction) వంటి సిద్ధాంతాలను సామ్‌సంగ్ వినియోగించకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చార్జర్‌కు సంబంధించిన చార్జింగ్ బెడ్ పై ఏదైనా డివైస్‌ను ప్లేస్ చేసిన వెంటనే, ఆ డివైస్ ఏంటనేది గుర్తించటంతో పాటు, ఆ డివైస్ చార్జ్ అయ్యేందుకు అవసరమైన సూటబుల్ మాగ్నటిక్ చార్జింగ్ మోడ్‌ను కూడాా ఆటోమెటిక్‌గా ఈ చార్జర్ అడ్జస్ట్ చేసుకోగలుగుతుందట.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470