Home
Gadgets

ప్రేమికుల రోజు బహుమతిగా తక్కువ ధరలో గల స్మార్ట్ ఐటమ్స్ ఇవే!!!!

వాలెంటైన్స్ డే చాలా దగ్గరలో ఉంది. ప్రేమికుల రోజును జరుపుకోవడానికి మీ యొక్క భాగస్వామికి ఎదో ఒక బహుమతిని ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. గిఫ్ట్ ను కొనడానికి మరియు ఎటువంటిది కొనాలి అనే దానిపై ఇంకా గందరగోళంలోనే ఉంటే కనుక మంచి స్మార్ట్ వస్తువులను కొనడం చాలా మంచిది.

బహుమతి

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచస్ మరియు స్మార్ట్ వస్తువులను చాలా ఎక్కువగా ఇష్టపడతారు కావున మేము సూచించే ఈ 5 గాడ్జెట్ మీ భాగస్వామికి బహుమతిగా అందిస్తే కనుక ఇవి సరైన వాలెంటైన్స్ డే బహుమతిగా మారుతుంది . తక్కువ ధరను కలిగి ఉండే మంచి స్మార్ట్ బహుమతి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ఫిట్‌నెస్ బ్యాండ్

ఫిట్‌నెస్ బ్యాండ్

మీ ఫిట్‌నెస్ ఫ్రీక్ భాగస్వామికి మంచి వాలెంటైన్స్ డే బహుమతిగా ఫిట్‌నెస్ బ్యాండ్ సరిగ్గా ఉంటుంది. హృదయ స్పందన సెన్సార్‌తో వచ్చే ఫిట్‌బిట్ ను కొనుగోలు చేయడం కోసం వెళ్ళవచ్చు. దీని యొక్క ధర రూ.11,990 గా ఉంటుంది. మరోవైపు షియోమి Mi బ్యాండ్ 4 కూడా మంచి బహుమతిగా అందించవచ్చు. ఇది 20 రోజుల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉండి రూ.2,299 ధర వద్ద లభిస్తుంది.

 

 

యాక్షన్ కెమెరా

యాక్షన్ కెమెరా

మీ భాగస్వామి సాహసాన్ని ఇష్టపడుతున్నారా అయితే అప్పుడు యాక్షన్ కెమెరా ఖచ్చితమైన వాలెంటైన్స్ డే బహుమతిగా ఉంటుంది. 36,500 రూపాయల ధర గల గోప్రో హీరో 8 బ్లాక్ యాక్షన్ కెమెరాను బహుమతిగా ఇవ్వవచ్చు. హీరో 8 బ్లాక్ కెమెరా నాలుగు డిజిటల్ లెన్స్‌లను స్పోర్ట్ చేస్తుంది. వీటితో పాటుగా మెరుగైన విండ్, మెరుగైన ఆడియో, అనుకూలీకరించదగిన మోడ్ ప్రీసెట్లు మరియు మడత మౌంటు వేళ్లను కలిగి ఉన్న తేలికైన ఫ్రేమ్‌లెస్ డిజైన్ కలిగి ఉంటుంది.

 

 

హెడ్‌ఫోన్

హెడ్‌ఫోన్

మీ భాగస్వామి సంగీతాన్ని ఇష్టపడితే లేదా టీవీ షోలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడితే కనుక హెడ్‌ఫోన్ మంచి బహుమతి ఎంపిక అవుతుంది. డబ్బు ఇష్యూ కాకపోతే మీరు బోస్ నుండి కొనుగోలును పరిగణించవచ్చు. ఇది ప్రారంభ ధర 9,000 రూపాయలతో వస్తుంది. మీరు తక్కువ ఖరీదైన వాటి కోసం వెళ్లాలనుకుంటే మీరు స్కల్ కాండీ మరియు బోట్ వంటి బ్రాండ్లను ఎంచుకోవచ్చు.

 

 

స్మార్ట్ వాచ్

స్మార్ట్ వాచ్

మీ భాగస్వామికి స్మార్ట్ వాచ్ మీద ఎక్కువ మక్కువ ఉంటె కనుక ఇది మంచి బహుమతి ఎంపిక అవుతుంది. మార్కెట్లో చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీ భాగస్వామి ఐఫోన్ యూజర్ అయితే మీరు ఆపిల్ వాచ్ సిరీస్ 5 కోసం వెళ్ళవచ్చు. మీకు ఆండ్రాయిడ్ యూజర్ ఉంటే శామ్సంగ్ గెలాక్సీ వేర్ యాక్టివ్ 2 మంచి ఎంపిక.

 

 

E-పాఠకులు

E-పాఠకులు

మీ భాగస్వామి ఆసక్తిగల రీడర్ అయితే కనుక మీరు ఈ ప్రేమికుల రోజున వారికి ఇ-రీడర్ బహుమతిగా ఇవ్వడం చాలా మంచిది. మీకు బడ్జెట్ పరిమితి ఉంటే కనుక మీరు 6 అంగుళాల డిస్ప్లే గల కిండ్ల్ ను 7,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు ఎక్కువ మొత్తం కూడా ఖర్చు చేయగలిగితే మీరు కిండ్ల్ ఒయాసిస్‌ను 28,999 రూపాయల ధర వద్ద కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వవచ్చు.

Best Mobiles in India

English summary
Best 5 Gadgets Gift Ideas for Valentine's Day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X