మార్కెట్లో ఉన్న ది బెస్ట్ 55-ఇంచ్ Smart TV's.. ఓ లుక్కేయండి!

|

మార్కెట్లో వివిధ కంపెనీల నుంచి ర‌క‌ర‌కాల Smart TV లు అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను కంపెనీలు ఆఫ‌ర్ చేస్తుండ‌టంతో వినియోగ‌దారులు Smart TV లు కొనేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అయితే, కొత్త‌గా స్మార్ట్ టీవీలు కొనాల‌నుకునే వారు ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్న టీవీ కొనాలో అని ఆలోచిస్తున్నారా. అయితే ఇక్క‌డ 55-అంగుళాల సైజులో మార్కెట్లో ఉన్న బెస్ట్ టీవీల జాబితా అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి.

 

Sony Bravia 4K Ultra HD Smart LED TV

Sony Bravia 4K Ultra HD Smart LED TV

ఇది సోనీ కంపెనీ నుంచి విడుద‌లైన 2022 మోడ‌ల్ టీవీ. ఈ టీవీ అత్యుత్త‌మమైన హెచ్‌డీ పిక్చ‌ర్ క్వాలిటీని అందిస్తుంది. ఇది శక్తివంతమైన X1 4K ప్రాసెసర్‌ను కలిగి ఉంది. సోనీ స్మార్ట్ LED TV యొక్క అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీ రిచ్ కలర్ మరియు క్లారిటీని అందిస్తుంది. 20W స్పీకర్ల డాల్బీ ఆడియో రిచ్ సౌండ్‌ బేస్ అందిస్తుంది. ఇది 4.8 స్టార్ రేటింగ్ క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం అమెజాన్‌లో దీని ధ‌ర రూ.66,490గా ఉంది.

Mi 4K Ultra HD Android Smart LED TV
 

Mi 4K Ultra HD Android Smart LED TV

Xiaomi సంస్థ నుండి విడుద‌లైన ఈ తాజా టెలివిజన్ 55 అంగుళాల Ultra 4K HD డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఇది గొప్ప వీక్ష‌ణ‌ అనుభూతిని క‌ల్పిస్తుంది. డాల్బీ 20W స్పీకర్లు క‌లిగి ఉంది. అంతేకాకుండా గేమింగ్‌పై ఆస‌క్తి ఉన్న‌వారికి ఇది మంచి అనుభూతి క‌ల్పిస్తుంది. దాంతో పాటుగా స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. క‌ల‌ర్‌పుల్‌ పిక్చర్ క్వాలిటీ అనుభ‌వాన్ని పొంద‌వ‌చ్చు. ప్యాచ్‌వాల్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ టీవీలు ఒకే స్క్రీన్‌పై అన్ని యాప్‌ల నుండి ట్రెండింగ్ కంటెంట్‌కి సులభంగా యాక్సెస్‌ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ యాప్‌లతో, మీరు ఒకే క్లిక్‌తో అన్ని తాజా కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ టీవీలు 4.3 రేటింగ్ క‌లిగి ఉన్నాయి. ప్ర‌స్తుతం అమెజాన్‌లో దీని ధ‌ర రూ.42,999గా ఉంది.

LG 4K Ultra HD Smart LEDT Tv 55 inches

LG 4K Ultra HD Smart LEDT Tv 55 inches

ఈ టీవీ అద్భుత‌మైన 4K అల్ట్రా హెచ్‌డీ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. దీని యాక్టివ్ HDR సాంకేతికత అత్యుత్తమ చిత్ర నాణ్యతను క‌ల‌గ‌జేస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ మీరు చూసే ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది. గేమింగ్‌పై ఆస‌క్తి ఉన్న‌వారికి ఇది చాలా మంచి అనుభూతిని క‌లిగిస్తుంది. ఇది 4.3స్టార్ రేటింగ్ క‌లిగి ఉంది.

Redmi 4K Ultra HD Smart LED TV 55 inch

Redmi 4K Ultra HD Smart LED TV 55 inch

ఈ టీవీ కూడా 55 అంగుళాల స్క్రీన్‌ను క‌లిగి ఉంది. ఇది 8 మిలియన్ పిక్సెల్స్‌తో అల్ట్రా-హై డెఫినిషన్ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. డాల్బీ విజన్ ఫీచర్ క‌లిగి ఉంది. ఈ Redmi స్మార్ట్ అల్ట్రా HD స్మార్ట్ టీవీ డైనమిక్‌గా కంటెంట్ ఫ్రేమ్-బై-ఫ్రేమ్‌ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ టీవీకి శక్తివంతమైన ఆడియో అనుభవం కోసం అమ‌ర్చిన 30W స్పీకర్లు స్టీరియో అనుభవాన్ని అందిస్తాయి. పేరెంటల్ లాక్‌తో దాని కిడ్స్ మోడ్ క‌లిగి ఉండి అన‌వ‌స‌ర‌మైన‌ కంటెంట్ ను స్క్రీన్‌పై కనిపించకుండా నియంత్రిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో Google అసిస్టెంట్ ఉంది, దీనిలో మీరు షోల కోసం సెర్చ్ చేయ‌డానికి, మీ టీవీని నియంత్రించడానికి వాయిస్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం అమెజాన్‌లో దీని ధ‌ర రూ.39,999గా ఉంది.

OnePlus U Series 4K LED

OnePlus U Series 4K LED

OnePlus U సిరీస్ స్మార్ట్ టీవీ 2021 లో విడుద‌లైన మోడ‌ల్‌. ఇది 1 బిలియన్ రంగులతో 4K UHD డిస్‌ప్లేతో సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. OnePlus స్మార్ట్ TV అద్భుతమైన సౌండ్ అనుభ‌వాన్ని క‌లిగిస్తుంది. దాని ఆక్సిజన్ ప్లే 2.0 సాయంతో క్యూరేటెడ్ కంటెంట్ ను కేవలం ఒక క్లిక్‌లో అందిస్తుంది. స్మార్ట్ టీవీ హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్, Google అసిస్టెంట్, కిడ్స్ మోడ్ మరియు మరిన్ని అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం అమెజాన్‌లో దీని ధ‌ర రూ.46,990గా ఉంది.

Samsung Crystal 4K Series

Samsung Crystal 4K Series

ఇది సామ్‌సంగ్ సంస్థ నుంచి భార‌త మార్కెట్లో విడుద‌లైన 2021 మోడ‌ల్ స్మార్ట్ టీవీ. Samsung Ultra HD LED TV ఒక బిలియన్ ట్రూ క‌ల‌ర్స్‌తో క్రిస్టల్ 4K డిస్‌ప్లేను అందిస్తుంది. 4K రిజల్యూషన్‌లో అద్భుతమైన చిత్ర అనుభూతి క‌ల్పిస్తుంది. దాని మోషన్ Xceleratorతో, మీరు స్పష్టమైన చిత్రాన్ని అనుభవించవచ్చు. దాని క్రిస్టల్ 4K ప్రాసెసర్ ప‌నితీరు టీవీలో మీరు చూసే చిత్రాలు రియ‌ల్ లైఫ్ అనుభూతిని క‌ల్పిస్తాయి. ప్ర‌స్తుతం అమెజాన్‌లో దీని ధ‌ర రూ.49,990గా ఉంది.

Best Mobiles in India

English summary
best 55 inch smart tvs in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X