మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ కోసం బెస్ట్ Gamepads

స్మార్ట్‌ఫోన్ గేమ్స్‌ను మరింత వినూత్నంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ Gamepads తీసుకోండి. గేమ్‌ప్యాడ్‌లను స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవటం ద్వారా గేమింగ్ అనుభూతి పూర్తిగా మారిపోతుంది. గేమ్‌ప్యాడ్స్ అనేవి కన్సోల్స్ జాయ్‌స్టిక్ మాదిరిగానే కనిపించినప్పటికి భిన్నమైన కీప్యాడ్ సెటప్‌ను కలిగి ఉంటాయి. మార్కెట్లో దొరుకుతోన్న బెస్ట్ గేమ్‌ప్యాడ్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Amkette Evo Gamepad Pro 2

ఈ గేమ్‌ప్యాడ్ దాదాపుగా అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా, గేమ్ పై పూర్తి కంట్రోల్‌ను ఇస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి Evo Gamepad యాప్‌తో పాటు 400 పై చిలుకు గేమ్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Amigo 7 IN 1 (STK 7004) Gamepad

గేమ్‌ప్యాడ్ 350mAh బ్యాటరీ‌తో కూడిన బిల్ట్-ఇన్ రీఛార్జబుల్ లిథియమ్ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లను ఈ ప్యాడ్ సపోర్ట్ చేస్తుంది. అమెజాన్‌ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడ్ అవుతోంది.

Mobilegear Wireless Bluetooth Mobile Gamepad

గేమ్‌ప్యాడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐపోడ్, ఐఫోన్, ఐప్యాడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. 300mAh బ్యాటరీ‌ వస్తోన్న ఈ గేమింగ్ ప్యాడ్ బ్లూటత్ 3.0 కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ 6 నుంచి 8 మీటర్ల మధ్య యాక్టివ్‌గా ఉంటుంది.

Amkette Evo Gamepad Wired

యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్‌తో వచ్చే అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ గేమ్‌ప్యాడ్ సపోర్ట్ చేస్తుంది. ప్యాడ్‌లో ఇన్‌బిల్ట్‌గా అమర్చిన బటన్స్ మరింత గ్రిప్‌ను ఆఫర్ చేస్తాయి. ట్రావెలింగ్ సమయంలో మీతో క్యారీ చేసేందుకు ఈ గేమింగ్ ప్యాడ్ చాలా అనువుగా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Gamepads for smartphones you can buy in India now. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting