Games ఆడటానికి వీలుగా ఉండే ఉత్తమమైన 32-inch LED టీవీలు ఇవే!!!

|

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎక్కువ మంది ఉద్యగం చేయడం కోసం తమ యొక్క సొంత ఊర్లను వదిలి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తున్నారు. అక్కడ గల అధిక ఖర్చుల కారణంగా చాలా మంది చిన్న చిన్న గదులలో ఉండడానికి ఇష్టపడతారు. ఉదయం మొత్తం ఆఫీసుకు వెళ్లి తిరిగి రూమ్ కి వచ్చినప్పుడు వినోదం కోసం ప్రతి ఒక్కరు టీవీని చూడటం అలవాటు ఉంటుంది. అయితే గదిలో మీకు ఇబ్బంది లేకుండా గోడకు అటాచ్ చేయగల 32 అంగుళాల LED టీవీలను ఎంచుకోవడం ఉత్మమం. సరసమైన ధర వద్ద లభించే కొన్ని టీవీలు మంచి నాణ్యతను అందించడంతో పాటుగా మీకు నచ్చిన గేమ్ లను ఆడటానికి కూడా అనుమతిస్తాయి. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న 32-అంగుళాల ఎల్‌ఈడీ టీవీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ Yసిరీస్ 32Y1 LED TV
 

వన్‌ప్లస్ Yసిరీస్ 32Y1 LED TV

వన్‌ప్లస్ వై సిరీస్ 32Y1 ఎల్‌ఈడీ టీవీ రూ.12,999 ధర వద్ద లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 9.0, వన్‌ప్లస్ కనెక్ట్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, డేటా సేవర్, ఆక్సిజన్ ప్లే మరియు కంటెంట్ క్యాలెండర్ వంటి స్మార్ట్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో గల బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి టీవీని మీ యొక్క ఫోన్ లేదా మరొక డివైస్ కు కూడా కనెక్ట్ చేయవచ్చు. అద్భుతమైన ఇమేజ్ నాణ్యతను అందించడానికి డిస్‌ప్లే నాయిస్ రిడక్షన్, యాంటీ అలియాసింగ్, కలర్ స్పేస్ మ్యాపింగ్, డైనమిక్ కాంట్రాస్ట్, గామా ఇంజన్ మరియు 93% కలర్ గాముట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

శామ్‌సంగ్ UA32T4340AKXXL LED TV

శామ్‌సంగ్ UA32T4340AKXXL LED TV

శామ్‌సంగ్ వండర్‌టైన్మెంట్ సిరీస్ UA32T4340AKXXL LED TV స్టైలిష్ మరియు స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉండి రూ.19,990 ధర వద్ద లభిస్తుంది. ఇది HD రెడీ రిజల్యూషన్, 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 0.5 వాట్స్ యొక్క అతి తక్కువ ఆన్-మోడ్ విద్యుత్ వినియోగంతో వస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ స్పీకర్లను కలిగి ఉండి ఇది 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ఇది స్క్రీన్ షేర్, మ్యూజిక్ సిస్టమ్, కంటెంట్ గైడ్ మరియు కనెక్ట్ షేర్ మూవీ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. టీవీ యొక్క డిస్ప్లే మెగా కాంట్రాస్ట్ ఎన్హాన్సర్ మరియు HD పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది.

సోనీ బ్రావియా KLV-32R202G LED TV
 

సోనీ బ్రావియా KLV-32R202G LED TV

సోనీ బ్రావియా KLV-32R202G ఎల్‌ఇడి టివిని రూ.41,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది HD రెడీ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఇది ఆన్-మోడ్ కోసం కేవలం 47 వాట్స్ విద్యుత్ వినియోగం మాత్రమే వినియోగించుకుంటుంది. దీని యొక్క డిస్ప్లే క్లియర్ రిజల్యూషన్ ఎన్‌హాన్సర్‌ ఫీచర్ తో రూపొందించబడింది. ఇది విజువల్స్ యొక్క బ్రైట్ నెస్ మరియు కలర్ తో సహా చక్కటి అల్లికలు, స్పష్టత మరియు సున్నితమైన వివరాలను నిర్ధారిస్తుంది. X- ప్రొటెక్షన్ PROను కలిగి ఉంది. ఇది టీవీకి దుమ్ము, తేమ, మరియు తేలికపాటి షార్ట్ సర్క్యూట్‌లకు వ్యతిరేకంగా మెరుగైన రక్షణను అందిస్తుంది. ఫోటో ఫ్రేమ్ మోడ్‌తో మీరు మీ ఫోటోలను మొబైల్ ఫోన్ లేదా కెమెరా నుండి మీ టీవీ స్క్రీన్‌లో చూడవచ్చు.

LG 32LK536BPTB LED TV

LG 32LK536BPTB LED TV

LG 32LK536BPTB LED TVను రూ.16,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది అంతర్నిర్మిత గేమ్స్, బాలీవుడ్ మోడ్, క్రికెట్ మోడ్ మరియు సౌకర్యవంతమైన వాల్ మౌంట్ బ్రాకెట్లతో వస్తుంది. ఆహ్లాదకరంగా ఉండే లైఫ్-కలర్ ఇమేజ్ లను లైవ్ జూమ్ ఫీచర్ తో చూడడానికి వీలుగా ఇది ఐపిఎస్ డిస్ప్లే ప్యానెల్ ను కలిగి ఉంది. 20-వాట్ల ఆడియో అవుట్‌పుట్ ఉన్న స్పీకర్లు శక్తివంతమైన మరియు స్పష్టమైన ధ్వనిని ఇవ్వడానికి డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డిటిఎస్‌లను ఉపయోగిస్తాయి. ఈ టీవీ షార్ట్ సర్క్యూట్‌లకు వ్యతిరేకంగా మెరుగైన మరియు అద్భుతమైన రక్షణను అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Best Gaming Support 32-inch LED TVs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X