2018లో లాంచ్ అయిన బెస్ట్ టాబ్లెట్స్ : ఆపిల్, అమెజాన్, సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్

|

పోర్టబుల్ కంప్యూటింగ్‌‌ను ఇష్టపడే వారికి టాబ్లెట్ డివైసెస్ అనేవి బెస్ట్ ఛాయిస్. ఆపిల్, అమెజాన్,సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు 2018కిగాను పలు బెస్ట్ టాబ్లెట్స్‌ను మార్కెట్లో లాంచ్ చేయటం జరిగింది. అత్యాధునిక స్పెసిఫికేషన్స్‌తో లాంచ్ అయిన ఈ మినీ కంప్యూటింగ్ డివైసెస్ మనం వెచ్చించే ప్రతిరూపాయికి లాభం చేకూర్చేలా ఉన్నాయి.. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది శాంసంగ్ నుంచి వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

ఆపిల్ ఐప్యాడ్ 9.7 (Apple iPad 9.7) 2018
 

ఆపిల్ ఐప్యాడ్ 9.7 (Apple iPad 9.7) 2018

టాబ్లెట్ కంప్యూటింగ్‌కు పెద్దపీట వేస్తూ ఆపిల్ అభివృద్థి చేస్తోన్న ఐప్యాడ్‌లు మార్కెట్లో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాయో మనందరికి తెలుసు. 2018కిగాను ఆపిల్ తన ఐప్యాడ్ సిరీస్ నుంచి ఆపిల్ ఐప్యాడ్ 9.7 (Apple iPad 9.7)ను మార్కెట్లో రిలీజ్ చేసింది.ఈ డివైస్‌లో పొందుపరించిన స్పెక్స్ శక్తివంతమైన పనితీరును ఆఫర్ చేస్తున్నాయి. ఈ డివైస్‌లో ప్యాక్ అయి ఉన్న 9.7 ఇంచ్ ఎల్ఈడి backlit ఐపీఎస్ డిస్‌ప్లే(1536 x 2048 పిక్సల్స్), 2.3 గిగాహెట్జ్ యాపిల్ ఫ్యూజన్ 10 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్పెసికేషన్స్ నమ్మకమైన పనితీరును కనబరుస్తాయి.

ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఆపిల్ ఐప్యాడ్ 9.7లో కెమెరాను పూర్తిగా రీడిజైన్ చేయటం జరిగింది. ఈ టాబ్లెట్‌లో లోడ్ చేసిన స్మార్ట్‌ హెచ్‌డిఆర్ మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్‌తో వర్క్ అవుతుంది. ఈ టాబ్లెట్‌లో పొందుపరిచిన యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్స్‌కు సహకరిస్తుంది.

యాపిల్ ఐప్యాడ్ ప్రో 2018 (Apple iPad Pro) 2018

యాపిల్ ఐప్యాడ్ ప్రో 2018 (Apple iPad Pro) 2018

ఈ జాబితాలో రెండవది యాపిల్ ఐప్యాడ్ ప్రో 2018.ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతోన్న అత్యంత ఖరీదైన టాబ్లెట్ గా ఈ డివైస్ గుర్తింపు తెచ్చుకుంది. 4జీబి ర్యామ్ కెపాసిటితో వస్తోన్న ఈ డివైస్ 64జీబి, 256జీబి ఇంకా 512జీబి స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ డివైస్ లో ఎక్విప్ చేసిన ఐకానిక్ ఏ12ఎక్స్ బయోనిక్ చిప్ సెట్ ను 7ఎన్ఎమ్ ప్రాసెస్ పై బిల్ట్ చేసినట్లు యాపిల్ తెలిపింది. ఈ చిప్ సెట్ ఐంటెల్ కోర్ ఐ5, ఐ7లతో పోలిస్తే వేగవంతంగా స్పందించగలుగుతుందట.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్4 (Samsung Galaxy Tab S4)
 

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్4 (Samsung Galaxy Tab S4)

ఈ జాబితాలో మూడవది సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్4.ఈ టూ-ఇన్-వన్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ 2018 ఆగష్టులో సామ్‌సంగ్ విడుదల చేసింది. Samsung DEX అనేక స్పెషల్ యాక్సెసరీని ఈ టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. ఈ యాక్సెసరీని టాబ్లెట్‌కు కనెక్ట్ చేసిన డెస్క్‌టాప్‌లో ఉపయోగించుకోవచ్చు. ఎక్స్‌ట్రా మానిటర్‌ను కూడా ఈ టాబ్లెట్‌కు అటాచ్ చేసుకునే వీలుంటుంది. ఇందుకుగాను హెచ్‌డిఎమ్ఐ టు యూఎస్బీ-సీ మల్టీపోర్ట్ అడాప్టర్ అవసరమవుతుంది. ఇదే సమయంలో టాబ్ ఎస్4ను ట్రాక్‌ప్యాడ్‌లా కూడా ఉపయోగించుకునే వీలుంటుంది.

గెలాక్సీ టాబ్ ఎస్4 స్పెసిఫికేషన్స్.. 10.5 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1600 x 2560 పిక్సల్స్), లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ 835 ప్రాసెసర్ అడ్రినో 540 జీపీయూ, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఎస్-పెన్, ఫేస్ అన్‌లాక్, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్, సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాక్సిమిటీ, యాక్సిలరోమీటర్, కంపాస్, గైరోస్కోప్ వంటి సెన్సార్స్ ఈ డివైస్‌లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి.

అమెజాన్ ఫైర్ హెచ్‌డి టాబ్లెట్ (Amazon Fire HD tablet) 2018

అమెజాన్ ఫైర్ హెచ్‌డి టాబ్లెట్ (Amazon Fire HD tablet) 2018

ఈ జాబితాలో నాల్గవది అమెజాన్ ఫైర్ హెచ్‌డి టాబ్లెట్ (Amazon Fire HD tablet). ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ డివైస్ ఖరీదు 79.99 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.6,000. అమెజాన్ ఫైర్ హెచ్‌డి టాబ్లెట్ డీసెంట్ స్పెక్స్‌తో వస్తోంది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే..8 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానల్ (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 800 x 1280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,1.3డిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసెసర్, 1.5జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో 6 (Microsoft Surface Pro 6)

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో 6 (Microsoft Surface Pro 6)

ఈ జాబితాలో చివరిది మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో 6 (Microsoft Surface Pro 6). ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ స్లీక్ డిజైనింగ్‌కు తోడు శక్తివంతమైన ఇంటర్నట్ స్పెక్స్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 12.3 ఇంచ్ 3:2 పిక్సల్ సెన్స్ 10 పాయింట్ మల్టీటచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్ర్కీన్ రిసల్యూషన్ విషయానికి వచ్చేసరికి 1824 x 2736 పిక్సల్స్. క్వాడ్-కోర్ 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5/i7 ప్రాసెసర్ విత్ అల్ట్రా హైడెఫినిషన్ 620 గ్రాఫిక్స్. ర్యామ్ వేరియంట్స్ (8జీబి, 16జీబి), స్టోరజ్ వేరియంట్స్ (128జీబి, 256జీబి, 512జీబి, 1TB) ఎస్ఎస్‌డి స్టోరేజ్.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best tablets that saw the light of day in 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X