Home
Gadgets

Best Earbuds రూ.3000 ధరలో బెస్ట్‌ TWS ఇయర్‌బడ్స్‌.. లిస్ట్‌, ఫీచర్‌లు, ధర వివరాలు..!

ఇయర్‌బడ్స్‌కు భారత్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గతంలో పోలిస్తే తక్కువ ధరకే బడ్స్‌ అందుబాటులో వస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల కాలంలో రూ.3000 మరియు అంతకంటే తక్కువ ధరలో బడ్స్ లాంచ్ అవుతున్నాయి. ఈ బడ్స్‌ చాలా వరకు యాక్టివ్‌ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్టును కలిగి ఉన్నాయి. మరియు భారీ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటున్నాయి.

ప్రస్తుతం రూ.3000 ధరలో (Earbuds under Rs3000) రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 7, రెడ్‌మి బడ్స్‌ 6, వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్‌ 3 ప్రో, బోట్‌ నిర్వానా X, రియల్‌మి బడ్స్‌ T310 వంటి ఇయర్‌బడ్స్‌ ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Best TWS Earbuds under Rs3000

రియల్‌మి బడ్స్‌ T310 :
రియల్‌మి బడ్స్‌ T310 బడ్స్‌ (Realme Buds T310) ధర భారత్‌ మార్కెట్‌లో రూ.1999 గా ఉంది. తక్కువ ధరలో TWS కోసం చూస్తున్న వారికి ఈ బడ్స్‌ అనువుగా ఉండే అవకాశం ఉంది. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఏకంగా 40 గంటల పాటు వినియోగించుకోవచ్చు.

కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 5 గంటల వరకు ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు, ఈ ఫోన్ 46dB ANC (యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) తోపాటు 12.4mm డ్రైవర్స్‌ను కలిగి ఉంది, రూ.2 వేల కంటే తక్కువ ధరలో ఈ బడ్స్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది.

బోట్‌ నిర్వాణా X :
బోట్ నిర్వాణా X ఇయర్‌బడ్స్ (Boat Nirvana X) పనితీరు ఆకట్టుకుంటుంది. ఈ బడ్స్‌ డ్యూయల్‌ డ్రైవర్స్‌, LDAC సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు మెరుగైన కాల్ క్లారిటీ, ఇన్‌ ఇయర్‌ డిటెక్షన్‌ కోసం AI ENx మైక్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 3 ప్రో :
భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్‌ 3 ప్రో (OnePlus Nord Buds 3 Pro) ధర రూ.2,699 గా ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 44 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 11 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు.

ఈ వన్‌ప్లస్‌ బడ్స్‌ 49dB ANC (యాక్టివ్‌ నాయిస్ క్యాన్సిలేషన్) సపోర్టు ను అందిస్తుంది. మరియు 12.4mm డ్రైవర్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ బడ్స్‌ డ్యూయల్‌ డివైస్ సపోర్టు. బ్లూటూత్‌ 5.4, 47ms గేమింగ్ మోడ్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి బడ్స్ 6 :
రెడ్‌మి బడ్స్ 6 ధర (Redmi Buds 6) భారత్ మార్కెట్‌లో రూ.2799 గా ఉంది. ఈ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి ఏకంగా 42 గంటల (ANC Off) బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. అదే ANC ఆన్‌లో ఉంటే బ్యాటరీ లైఫ్ 26 గంటలుగా ఉంటుందని రెడ్‌మి తెలిపింది. ఈ బడ్స్‌ 12.4mm డ్యూయల్‌ డ్రైవర్స్‌ను కలిగి ఉంది. ఈ బడ్స్‌ 49dB హైబ్రిడ్‌ ANC ను కలిగి ఉంది.

రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 7 :
రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 7 (Realme Buds Air 7) భారత్‌ మార్కెట్‌లో రూ.2999 గా ఉంది. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 52 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ బడ్స్‌ 52dB యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) సపోర్టును కలిగి ఉంది. ఈ బడ్స్‌ 45ms లో లేటెన్సీని లిగి ఉంది. గేమింగ్‌ సమయంలో మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 2r :
వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్‌ 2r (OnePlus Nord Buds 2R) సెమీ ఇన్-ఇయర్‌ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 12.4mm డైనమిక్‌ డ్రైవర్‌తో అందుబాటులో ఉంది. దీంతోపాటు డ్యూయల్ మైక్‌ను అమర్చారు. ANC తోపాటు బ్లూటూత్ 5.3 సపోర్టు చేస్తుంది. దీని ధర రూ.1599 గా ఉంది.

ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 38 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. డీప్‌ గ్రే, ట్రిపుల్ బ్లూ. మిస్టీ గ్రే రంగుల్లో ఈ బడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ బడ్స్ Hey Melody యాప్‌ను సపోర్టు చేస్తాయి.

వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 3 :
వన్‌ప్లస్ నార్డ్‌ బడ్స్‌ 3 (OnePlus Nord Buds 3) ధర రూ.1999 గా ఉంది. ఈ బడ్స్‌ 12.4mm టైటానియం డయాఫ్రం ఆధారిత ఆడియో డ్రైవర్‌లను కలిగి ఉంది. 32dB ANC ను కలిగి ఉంది. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 43 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 11 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Best TWS Earbuds under Rs3000 in india here is the list and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X