Home
Gadgets

Blaupunkt Xtreme 120 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్‌ విడుదల.. AI మైక్‌, ENC సహా కీలక ఫీచర్‌లు..!!

ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ Blaupunkt తాజాగా వైర్‌ లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేసింది. జర్మనీకి చెందిన ఈ సంస్థ లాంచ్‌ చేసిన ఇయర్‌ బడ్స్‌ (Blaupunkt Xtreme Earbuds) సింగిల్‌ ఛార్జింగ్‌తో 120 గంటల బ్యాటరీ బ్యాకప్‌ ను పొందుతుంది. ఫలితంగా కాల్స్‌ మరియు మ్యూజిక్‌ను ఎక్కువ సమయం ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చు.

800mAh బ్యాటరీ సామర్థ్యం :
Xtreame ఇయర్‌ బడ్స్ 800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇయర్‌ బడ్స్‌ అత్యాధునిక చిప్‌లను కలిగి ఉంటాయి. ఫలితంగా 20 శాతం తక్కువ విద్యుత్‌ను ఉపయోగించు కుంటుంది. బ్యాటరీ తోపాటు మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫలితంగా వినియోగదారులకు మెరుగైన అనుభూతి కలుగుతుందని తెలుస్తోంది.

Blaupunkt Xtreme wireless earbuds

AI మైక్‌, ENC ఫీచర్లు :
ఈ ఇయర్‌ బడ్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ( AI ) మైక్‌ మరియు ఎన్విరాన్‌మెంట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ( ENC ) టెక్నాలజీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పరిసరాల నుంచి ఎక్కువ శబ్దాలు వినిపిస్తున్నా.. కాల్స్ మాట్లాడుతున్న సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది.

8 సార్లు ఛార్జింగ్‌ చేయవచ్చు :
ఈ ఇయర్‌ బడ్స్‌ టర్బో వోల్ట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటాయి. దీంతోపాటు ఛార్జింగ్‌ కేస్‌ ద్వారా 8 సార్లు ఇయర్‌ బడ్స్‌ను ఛార్జింగ్ చేయవచ్చు. దీంతోపాటు 15 నిమిషాల ఛార్జింగ్ సపోర్టుతో 5 గంటలపాటు ప్లే టైంను పొందవచ్చు.

బ్లూటూత్‌ 5.3 టెక్నాలజీ : గేమింగ్‌ మోడ్‌ లోనూ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. దీంతోపాటు ఈ ఇయర్‌ బడ్స్ బ్లూటూత్‌ 5.3 టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఫలితంగా దూరం నుంచి కూడా మెరుగైన సౌండ్‌ క్వాలిటీని పొందవచ్చు. అయితే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా మెరుగైన పనితీరు కనబరుస్తాయని సంస్థ చెబుతోంది.

వందేళ్లు అనుభవం : జర్మనీకి చెందిన ఈ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ Blaupunkt.. ఈ రంగంలో వందేళ్ల అనుభవం ఉన్నట్లు చెబుతోంది. ప్రీమియం మెటీరియల్‌ వినియోగం సహా ఇతర కారణాలతో ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా ఆడియో ఉత్పత్తులను తయారు చేస్తారని తెలుస్తోంది.

అమెజాన్‌లో సేల్‌.. ధర ఎంతంటే :
Blaupunkt Xtreme ఇయర్‌బడ్స్‌ ధర రూ.1,699 గా ఉంది. ఈ ఇయర్‌ బడ్స్‌ను ప్రముఖ ఇ- కామర్స్‌ ప్లాట్‌ ఫాం అమెజాన్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ బడ్స్‌ బ్యాటరీ, ఫీచర్ల పరంగా మెరుగైన పనితీరును కనబరుస్తాయని సంస్థ చెబుతోంది. మరియు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Blaupunkt Xtreme wireless earbuds launched with 120 hours of battery life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X