Home
Gadgets

రూ.1999 కే 50 గంటల ప్లేబ్యాక్‌ టైం, ఇన్‌-ఇయర్‌ డిటెక్షన్‌ ఫీచర్‌తో Boat ఇయర్‌బడ్స్‌..!

Boat India : ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్‌ నుంచి ఇయర్‌బడ్స్‌ లాంచ్‌ అయ్యాయి. బోట్‌ ఎయిర్‌డోప్స్‌ ప్రైమ్‌ 701 ANC పేరుతో అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్స్‌ ANC, ENC సపోర్టును కలిగి ఉన్నాయి. లో లేటెన్సీ మోడ్‌ సహా అధిక సమయం బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తోంది. ఈ TWS ఇయర్‌బడ్స్‌ మరిన్ని ప్రత్యేక ఫీచర్‌ లను కలిగి ఉన్నాయి. డిజైన్‌ పరంగానూ ఈ బడ్స్‌ ఆకట్టుకుంటాయి. ఈ బడ్స్‌ ను కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.

బోట్‌ ఎయిర్‌డోప్స్‌ ప్రైమ్‌ 701 ANC ధర, సేల్‌ వివరాలు :
బోట్‌ ఎయిర్‌డోప్స్‌ ప్రైమ్‌ 701 ANC ( Boat Airdopes Prime 701 ANC ) ధర రూ.1999 గా ఉంది. ప్రస్తుతం బోట్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ (Amazon) ద్వారా కొనుగోలు చేయవచ్చు. టైటానియం బ్లూ, జింక్‌ వైట్‌, ఒబ్సిడియన్‌ గ్రే కలర్ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉన్నాయి.

Boat Airdopes Prime 701 ANC

బోట్ ఇయర్‌బడ్స్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
బోట్‌ ఎయిర్‌డోప్స్‌ ప్రైమ్‌ 701 ANC ఇయర్‌బడ్స్‌ ఇన్ ఇయర్‌ డిజైన్‌ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్స్‌ 10mm డ్రైవర్స్‌ ను కలిగి ఉన్నాయి. 24 - bit స్పేషియల్‌ ఆడియో టెక్నాలజీ, ఇన్‌ - ఇయర్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ లను సపోర్టు చేస్తుంది.

ANC, ENC :
బోట్‌ ఇయర్‌బడ్స్‌ 46dB ANC ( యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ) మరియు AI ENC ( ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ) సపోర్టుతో క్వాడ్‌ మైక్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.2, గూగుల్‌ ఫాస్ట్‌ పెయిర్‌ టెక్నాలజీ ని సపోర్టు చేస్తుంది. మెరుగైన గేమింగ్‌ పనితీరు కోసం 60ms Low latency Beast మోడ్‌ ను సపోర్టు చేస్తుంది.

Boat Airdopes Prime 701 ANC

ఈ యాప్‌ ద్వారా కనెక్ట్ కావచ్చు.. :
ఈ ఇయర్‌బడ్స్‌ Boat hearable యాప్‌ ద్వారా కనెక్ట్‌ చేయవచ్చు. ఈ యాప్‌ ద్వారా బడ్స్‌ EQ సెట్టింగ్స్‌ ను కస్టమైజ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. బోట్‌ ఎయిర్‌డోప్స్‌ ప్రైమ్ 701 ANC ఇయర్‌బడ్స్‌ IPX5 వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉన్నాయి.

50 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు :
బోట్‌ ఎయిర్‌డోప్స్‌ ప్రైమ్‌ 701 ANC ఇయర్‌బడ్స్‌ ఛార్జింగ్ కేస్‌ 500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే ఒక్కో బడ్‌ 35mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ ను సింగిల్‌ ఛార్జింగ్‌ తో ఏకంగా 50 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు.

ఇయర్‌బడ్స్‌ ను (Boat TWS Earbuds) ఛార్జింగ్ చేసేందుకు 40 నిమిషాల సమయం పడుతుంది. అదే పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు గంటన్నర సమయం పడుతుందని బోట్‌ చెబుతోంది. అయితే 10 నిమిషాల క్విక్‌ ఛార్జింగ్‌ తో 3 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ బడ్స్‌ USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటాయి.

Best Mobiles in India

English summary
Boat Airdopes Prime 701 ANC TWS earphones now available in india on amazon and boat official store
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X