Home
Gadgets

7 రోజుల బ్యాటరీ లైఫ్‌, IP68 రేటింగ్‌, హెల్త్‌ ట్రాకర్లతో BoAt స్మార్ట్‌వాచ్‌ విడుదల.. ధర, సేల్‌ వివరాలు..!

దేశీయ ఆడియో ఉత్పత్తులు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ బోట్‌ తాజాగా కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఆకట్టుకొనే డిజైన్‌, కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీతోపాటు అనేక ఫీచర్‌లతో బోట్‌ క్రోమ్‌ హారిజన్‌ స్మార్ట్‌వాచ్‌ను (Boat Chrome Harizon Smartwatch) భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌ అనేక ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు రోజువారీ పనులకు సాయం కూడా చేస్తుంది. ఈ వాచ్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌, చెమట, స్ల్పాష్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.

బోట్‌ క్రోమ్ హారిజన్ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లు :
బోట్‌ క్రోమ్ హారిజన్ స్మార్ట్‌వాచ్ 1.51 అంగుళాల (466x466 పిక్సల్స్ రిజల్యూషన్‌) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 550 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు 2.5D కర్వడ్‌ గ్లాస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ వాచ్‌ అనేక గెశ్చర్స్‌ను సపోర్టు చేస్తుంది.

boat chrome harizon smartwatch launched in india with 7 days battery life

హెల్త్‌ ట్రాకర్లు :
ఈ బోట్‌ స్మార్ట్‌వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో హార్ట్‌ రేట్‌, SpO2 స్థాయి పర్యవేక్షణ, HRV ట్రాకింగ్, VO2 మ్యాక్స్‌ ఇన్‌సైట్స్‌, ఆటో యాక్టివిటీ ట్రాకింగ్‌ వంటి అనేక హెల్త్‌ ట్రాకర్లు ఉన్నాయి. దీంతోపాటు డైలీ స్టెప్స్‌, వాటర్ రిమైండర్‌లు సహా సుమారు 100 కు పైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌ను కలిగి ఉంది.

ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి :
బోట్‌ క్రోమ్‌ హారిజన్ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్టంగా 7 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. అయితే బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగిస్తే బ్యాటరీ లైఫ్‌ 3 రోజులు పాటు అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను 100 శాతం ఛార్జింగ్‌ చేసేందుకు 45 నిమిషాల సమయం పడుతుంది.

బ్లూటూత్‌ కాలింగ్‌ కోసం HD స్పీకర్‌, మైక్ :
ఈ వాచ్ బ్లూటూత్‌ కాలింగ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు HD స్పీకర్‌ మరియు మైక్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌ నుంచే నేరుగా కాల్‌ చేయడంతోపాటు స్పీకరించేందుకు అవకాశం ఉంటుంది. ఈ వాచ్‌లో 30 కాంటాక్ట్స్‌ వరకు సేవ్‌ చేసేందుకు అవకాశం ఉంది.

అనేక ఫీచర్‌లు :
ఈ బోట్‌ స్మార్ట్‌వాచ్‌ ఫక్షనల్‌ క్రోన్‌, ఫైండ్‌ మై డివైజ్, DND, బెడ్‌ టైం మోడ్‌, స్మార్ట్‌ అలెర్ట్‌, స్టాప్‌ వాచ్‌, ఫ్లాష్‌ లైట్‌, వాతావరణ సమాచారం, మ్యూజిక్‌ మరియు కెమెరా కంట్రోల్‌ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. boAt Crest యాప్‌ ద్వారా హెల్త్‌ ట్రాకర్‌లు, ఇతర ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ల వివరాలను తెలుసుకోవచ్చు.

బోట్‌ క్రోమ్ హారిజన్‌ స్మార్ట్‌వాచ్‌ ధర, సేల్‌ వివరాలు :
బోట్‌ క్రోమ్‌ హారిజన్‌ స్మార్ట్‌వాచ్ సిలికాన్ స్ట్రాప్‌ ధర రూ.2,799 గా ఉంది. లెదర్‌ మరియు మెటల్‌ స్ట్రాప్‌ ధర రూ.3099 గా ఉంది. ఈ వాచ్‌ కోకో బ్రౌన్‌, స్టీల్‌ బ్లాక్, రాయల్‌ బ్లూ, మిడ్‌నైట్‌ బ్లాక్ రంగుల్లో భారత్ మార్కెట్‌లో లభిస్తుంది. ఈ బోట్‌ స్మా్ర్ట్‌వాచ్‌ను boatlifestyle.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. బోట్‌ అధికారిక వెబ్‌సైట్లో ఈ వాచ్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

Best Mobiles in India

English summary
boat chrome harizon smartwatch launched in india with 7 days battery life, price sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X