Home
Gadgets

మెటల్‌ బాడీ, అమోలెడ్‌ డిస్‌ప్లే, హెల్త్‌ ఫీచర్లతో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. ధర, సేల్, ఫీచర్ల వివరాలు..!

Boat Chrome iris Smartwatch : ప్రముఖ ఆడియో ఉత్పత్తులు, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ బోట్‌.. తాజాగా భారత్‌ మార్కెట్‌ లో స్మార్ట్‌వాచ్‌ ను లాంచ్‌ చేసింది. ఈ బోట్‌ క్రోమ్‌ ఐరిస్‌ వాచ్ మెటల్‌ బాడీని కలిగి ఉంది. ఈ వాచ్‌ అనేక హెల్త్‌ మానిటరింగ్‌, ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాచ్‌ ఐదు కలర్ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 5 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

బోట్‌ క్రోమ్‌ ఐరిస్‌ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లు :
ఈ బోట్‌ స్మార్ట్‌వాచ్‌ 1.32 అంగుళాల (466 x 466 పిక్సల్స్‌) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే (ఆల్‌వేజ్‌ ఆన్ డిస్‌ప్లే) Always On Display ను సపోర్టు చేస్తుంది.

Boat Chrome iris smartwatch sale

అనేక హెల్త్‌ ఫీచర్లు :
బోట్ క్రోమ్ ఐరిస్‌ స్మార్ట్‌వాచ్‌ అనేక హెల్త్‌ ఫీచర్‌ లను కలిగి ఉంది. ఇందులో హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌, స్లీప్‌ ట్రాకింగ్‌, బ్రీథింగ్‌ మోడ్స్‌, SpO2 ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు నడక, కెలరీలను ట్రాక్‌ చేయవచ్చు. మెన్‌స్ట్రక్చరల్‌ సైకిల్‌ ట్రాకింగ్‌ ఫీచర్ కూడా ఉంది.

బ్లూటూత్‌ కాలింగ్ :
ఈ వాచ్‌ క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ ఫేసెస్‌ ను సపోర్టు చేస్తుంది. కస్టమైజ్‌ మెనూ లేఅవుట్‌, 2.5D యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ నేవిగేషన్‌ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ మల్టిపుల్ స్పోర్ట్స్‌ మోడ్స్‌ ను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

Boat Chrome iris smartwatch sale

5 రోజుల బ్యాటరీ లైఫ్‌ :
బోట్‌ క్రోమ్ ఐరిస్‌ స్మార్ట్‌వాచ్‌ 180mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ వాచ్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు రెండు గంటల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది. పవర్‌ సేవింగ్‌ మోడ్‌ లో ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి గరిష్ఠ 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుందని సంస్థ తెలిపింది.

స్మార్ట్‌ టూల్స్ :
ఈ బోట్‌ స్మార్ట్‌వాచ్‌ గేమ్స్‌, కాలిక్యూలేటర్‌, వాతావరణ సమాచారం, మ్యూజిక్, కెమెరా కంట్రోల్‌, అలారం, టైమర్‌, స్టాప్ వాచ్‌ వంటి అనేక స్మార్ట్‌ టూల్స్‌ ఉన్నాయి. IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

బోట్‌ క్రోమ్‌ ఐరిస్‌ స్మార్ట్‌వాచ్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.3499 గా ఉంది. ఈ బోట్‌ వాచ్‌ బోట్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ ( Amazon ), ఫ్లిప్‌కార్ట్‌ ( Flipkart ), ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్స్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ మెటల్‌ గోల్డ్‌, రోజ్‌ పింక్, వెల్‌వెట్‌ వైన్‌, సిల్క్‌ స్కిన్‌, ప్రాస్టడ్ స్కై కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Boat Chrome iris smartwatch launched with 5 days battery life and amoled display in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X