Home
Gadgets

1.43 అంగుళాల డిస్‌ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌, బ్లూటూత్‌ కాలింగ్‌తో Boat స్మార్ట్‌వాచ్‌.. ధర, సేల్‌ వివరాలు.!

ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ బోట్‌ నుంచి స్మార్ట్‌వాచ్‌ విడుదల అయింది. ఈ బోట్‌ లూనార్‌ ఒయాసిస్‌ స్మార్ట్‌వాచ్‌ (Boat Lunar Oasis smartwatch) బ్లూటూత్‌ కాలింగ్‌ సపోర్టు సహా 1.43 అంగుళాల ఆల్‌వేజ్‌ ఆన్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఆ స్మా్ర్ట్‌వాచ్‌ కస్టమైజ్‌డ్‌ వాచ్‌ ఫేస్‌లను సపోర్టు చేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను బోట్‌ వెబ్‌సైట్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

బోట్‌ లూనార్‌ ఒయాసిస్‌ స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్‌లు :
బోట్‌ లూనార్‌ ఒయాసిస్‌ స్మార్ట్‌వాచ్‌ 466*466 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 1.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. 2.5D వృత్తాకార డిస్‌ప్లే ఆల్‌వేజ్‌ ఆన్‌ సపోర్టును కలిగి ఉంది.

Boat Lunar Oasis smartwatch sale and price

బోట్‌ లూనార్‌ ఒయాసిస్‌ స్మార్ట్‌వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్‌లతో అందుబాటులోకి వచ్చింది. హార్ట్‌ రేట్‌, SpO2 స్థాయిలను పర్యవేక్షించవచ్చు. దీంతోపాటు నిద్ర, ఒత్తిడి పర్యవేక్షణ కోసం ప్రత్యేక సెన్సార్‌లను కలిగి ఉంది. ఇందు కోసం Boat Crest App ను కలిగి ఉండాల్సి ఉంటుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ Cres+ OS ను కలిగి ఉంది. దీంతోపాటు బోట్‌ ఇన్‌ హౌస్‌ X1 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. GPS, మ్యాప్‌మైఇండియా టర్న్‌ బై టర్న్‌ నేవిగేషన్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. యూజర్లకు నచ్చిన విధంగా కస్టమైజ్‌ యానిమేటెడ్‌ వాచ్‌ ఫేస్‌లను రూపొందించేందుకు DIY వాచ్‌ ఫేస్‌ స్టూడియోను కలిగి ఉంటుంది. 700 లకు పైగా యాక్టివ్‌ మోడ్స్‌ ను కలిగి ఉంది.

ఈ బోట్‌ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు యాప్‌ నోటిఫికేషన్‌లను కూడా చూసేందుకు వీలుంటుంది. దీంతోపాటు ఈ ఫీచర్‌ ద్వారా మ్యూజిక్‌, కెమెరాను నియంత్రించవచ్చు. ఈ వాచ్‌ ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ సహా QR కోడ్‌ ట్రే ను కలిగి ఉంటుంది.

సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ :
బోట్‌ లూనార్‌ ఒయాసిస్‌ స్మార్ట్‌వాచ్‌ 300mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌ తో 7 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని సంస్థ తెలిపింది. బోట్‌ లూనార్‌ ఒయాసిస్‌ స్మార్ట్‌వాచ్‌ IP68 రేటింగ్‌తో చమట, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

బోట్‌ లూనార్‌ ఒయాసిస్‌ స్మార్ట్‌వాచ్‌ ధర, సేల్‌ వివరాలు :
బోట్‌ లూనార్‌ ఒయాసిస్‌ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.3299 గా ఉంది. ఒలివ్‌ గ్రీన్‌, మాగ్నటిక్‌ సిలికాన్‌, యాక్టివ్‌ బ్లాక్‌ సిలికాన్, బ్లాక్ మెటల్‌ స్ట్రాప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ బోట్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ను Boat.lifestyle.com, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. సంవత్సరం పాటు వారంటీని పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Boat Lunar Oasis smartwatch launched with 1.43 inch amoled display and 7 days battery life in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X