50 గంటల ప్లే టైమ్‌తో బోట్ ఇయర్‌బడ్స్.. ANC, డైనమిక్ హెడ్ ట్రాకింగ్ సహా కీలక ఫీచర్‌లు..!
ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ బోట్ నుంచి తాజాగా బోట్ నిర్వానా ivy ఇయర్‌బడ్స్ (Boat Nirvana ivy TWS Earbuds) విడుదల అయ్యాయి. డిజైన్ పరంగా ఈ బడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ సపోర్టు వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేయడం ద్వారా 50 గంటలపాటు ప్లేబ్యాక్ టైమ్‌ను పొందవచ్చని బోట్ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ ఫీచర్లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
బోట్ నిర్వానా ivy ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్‌లు :
ఈ బోట్ ఇయర్‌బడ్స్ 10mm డ్యూయల్ డ్రైవర్లను కలిగి ఉంది. మెరుగైన ఆడియో అనుభూతి కోసం ఈ బడ్స్ 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్టును కలిగి ఉంటుంది. బీస్ట్ మోడ్‌లో 60ms లేటెన్సీ రేట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటిని కలిగి ఉంటాయి. మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. సులభంగా ఇతర పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బడ్స్ మరో ఆసక్తికర ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. డైనమిక్ హెడ్ ట్రాకింగ్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. అంటే తల కదలికల ఆధారంగా ఆడియోను సర్దుబాటు చేస్తుంది.
ఈ బోట్ నిర్వానా ivy ఇయర్‌బడ్స్ IPX4 డస్ట్ వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. కస్టమైజ్ చేసిన సౌండ్ ప్రొఫైల్‌ను రూపొందించుకోవచ్చు. మిమి మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు 360 డిగ్రీల స్పేషియల్ ఆడియో అనుభూతిని అందిస్తుంది. Boat Hearable app ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.

ఈ బోట్ TWS ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్ 400mAh బ్యాటరీ కలిగి ఉంది. అదే బడ్స్ ఒక్కోటి 40mAh బ్యాటరీలను కలిగి ఉంటాయి USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ బడ్స్ సింగిల్ ఛార్జింగ్‌తో 50 గంటల ప్లే టైమ్ ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. బోట్ ఆధారంగా బడ్స్‌ను పూర్తిగా ఛార్జింగ్ చేసేందుకు 35 నిమిషాల సమయం పడుతుంది. అదే ఛార్జింగ్ కేసును 1.5 గంటల్లోగా ఛార్జింగ్ చేయవచ్చు.
బోట్ ఇయర్‌బడ్స్ ధర, సేల్ వివరాలు :
బోట్ నిర్వానా ivy ఇయర్‌బడ్స్ ధర రూ.2999 గా ఉంది. ఈ బడ్స్ బ్లాక్, క్వార్జ్ట్ సియాన్, గన్‌మెటల్ వైట్ రంగుల్లో లభించనున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి ఈ బడ్స్ సేల్ ప్రారంభం కానుంది. బోట్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








