Home
Gadgets

Boat నుంచి మరో స్మార్ట్‌రింగ్‌.. హెల్త్ ట్రాకర్లు, మల్టీ స్పోర్ట్స్ మోడ్‌ సహా అనేక ఫీచర్‌లు..!

ప్రముఖ గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ బోట్ నుంచి మరో స్మార్ట్‌ రింగ్‌ భారత్‌ మార్కెట్‌లోకి విడుదల అయింది. బోట్‌ స్మార్ట్‌ రింగ్ యాక్టివ్‌ ప్లస్‌ పేరుతో లాంచ్ చేసింది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తోపాటు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ రింగ్ అనేక హెల్చ్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. మరియు ఒక్కసారి ఛార్జింగ్ చేసి 5 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.

బోట్‌ స్మార్ట్‌రింగ్ యాక్టివ్‌ ప్లస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ బోట్‌ స్మార్ట్ రింగ్‌ (Boat Smart Ring Active Plus Launched) స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌రింగ్‌ 7 నుంచి 12 వరకు మొత్తంగా 6 సైజుల్లో లభిస్తుంది. ఈ రింగ్‌ కేవలం 4.7 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

Boat smart ring active plus launched

హెల్త్‌ ట్రాకర్‌లు :
ఈ బోట్‌ స్మార్ట్‌రింగ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. ఈ రింగ్‌ అనేక సెన్సార్‌లతో అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా SpO2, హార్ట్‌ రేట్‌, హార్ట్‌ రేట్‌లో మార్పులును గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు నిద్ర తీరు, నిద్ర నాణ్యత, ఒత్తిడిని పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది.

స్పోర్ట్స్ మోడ్‌ :
ఈ బోట్‌ స్మార్ట్‌రింగ్‌ యాక్టివ్‌ ప్లస్‌.. హెల్త్‌ ట్రాకర్‌లతోపాటు మల్టీ స్పోర్ట్స్‌ మోడ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఇందులో యోగా, సైక్లింగ్‌, రన్నింగ్‌ తోపాటు చర్మ ఉష్ణోగ్రత (Skin Temperature) ను గుర్తించేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీని ద్వారా కూడా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

Boat smart ring active plus launched

ఈ బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ బ్లూటూత్‌ 5.0 పైన పనిచేస్తుంది. ఈ హెల్త్‌ ట్రాకర్‌ వివరాలను Boat Crest app ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ రింగ్‌ ద్వారా కెమెరాను కూడా కంట్రోల్‌ చేయవచ్చు. ఈ రింగ్‌ 5ATM డస్ట్‌, చెమర మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఫలితంగా వర్కౌట్స్‌, స్విమ్మింగ్‌ సహా ఇతర సందర్బాల్లో రింగ్‌ డ్యామేజీ కాకుండా ఉంటుంది.

ఛార్జింగ్‌ కేస్‌తో 30 రోజుల బ్యాటరీ లైఫ్ :

ఈ బోట్‌ స్మార్ట్‌రింగ్ మాగ్నటిక్‌ కేస్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. ఈ రింగ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 5 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. మరియు ఈ ఛార్జింగ్‌ కేస్‌ను పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే, 30 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

Take a Poll

బోట్‌ స్మార్ట్‌రింగ్‌ యాక్టివ్‌ ప్లస్‌ ధర, సేల్‌ వివరాలు :
బోట్‌ స్మార్ట్‌రింగ్‌ యాక్టివ్‌ ప్లస్‌ ధర రూ.2999 గా ఉంది. బోట్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా ఈ స్మార్ట్ రింగ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ రింగ్ మిడ్‌ నైట్‌ బ్లాక్‌, రేడియంట్‌ సిల్వర్‌, రోజ్‌ గోల్డ్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అనేక స్మార్ట్‌వాచ్‌లను హెల్త్‌ ట్రాకర్‌లు సహా అనేక ఫీచర్‌లను కలిగి ఉంటున్నాయి. ఈ స్మార్ట్‌రింగ్‌లు కూడా ఇటీవల అనేక సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. నాయిస్‌, శాంసంగ్‌, బోట్‌ సహా మరిన్ని ఈ జాబితాలో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Boat smart ring active plus launched with health trackers and multi sports mode in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X