Home
Gadgets

అద్భుతమైన ఫీచర్లతో Boat స్మార్ట్ రింగ్‌.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో నేటి నుంచి సేల్‌

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్‌ సరికొత్త విభాగంలోకి ప్రవేశించింది. Boat smart ringను భారత్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ రింగ్‌ సిరామిక్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యం, ఉష్టోగ్రత, హృదయ స్పందన రేటు సహా ఇతర విభాగాల పనితీరును ట్రాకింగ్‌ చేస్తుంది.

ఈ బోట్‌ స్మార్ట్ రింగ్‌ అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఈ రింగ్‌ అధునాత ట్రాకింగ్‌ సామర్థ్యాతో వస్తుంది. ప్రీమియం సిరామిక్‌, మెటల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు స్మార్ట్ టచ్ కంట్రోల్స్‌తో ఈ రింగ్‌ వస్తుంది. ఈ స్మార్ట్‌ రింగ్‌ బోట్‌ రింగ్‌ యాప్‌కు అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని ద్వారా మ్యూజిక్‌ ప్లే, పాజ్‌ చేయవచ్చని, ట్రాక్స్‌ మార్చుకోవచ్చని తెలిపింది.

Boat smart ring

ఈ బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ హార్ట్‌ రేట్‌ మానిటర్‌, SpO2 సెన్సార్‌, శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్‌లను కలిగి ఉంటుందని బోట్‌ తెలిపింది. దీంతోపాటు నిద్ర నాణ్యత సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. మహిళల రుతుక్రమాన్ని ట్రాకింగ్‌ చేయగలదని తెలిపింది. ఈ రింగ్‌ 5 ATM వాటర్‌ రెసిస్టెంట్‌ రేటింగ్‌తో వస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.

ఈ రింగ్‌ రన్నింగ్‌, వాకింగ్‌, రైడింగ్‌, ఇండోర్‌, అవుట్‌డోర్‌ ట్రాకింగ్‌ సహా అనేక రకాల వ్యాయామాలను ట్రాక్‌ చేయగలదు. ఈ సమాచారాన్ని బోట్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ రింగ్‌ శరీర కదలికలను గుర్తించేందుకు వీలుగా ఆరు యాక్సిస్‌ మోషన్‌ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల కోసం SOS మోడ్‌తో వస్తుంది.

Boat smart ring

ఈ బోట్‌ స్మార్ట్ రింగ్‌ ధర రూ.8,999గా ఉంది. ఈ రింగ్‌ ఇవాళ్టి మధ్యాహ్నం 12 (ఆగస్టు 28) నుంచి ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంటాయి. ఈ బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ 7, 9, 11 సైజులతో 17.40mm, 19.15mm, 20.85mm డయామీటర్‌లో లభిస్తుంది.

పోటీగా నాయిస్‌ లూనా రింగ్‌! : స్మార్ట్‌ రింగ్‌ విభాగంతో బోట్‌కు పోటీగా నాయిస్‌ నిలిచే అవకాశం ఉంది. నాయిస్‌ సంస్థ లూనా పేరుతో స్మార్ట్ రింగ్‌ను ఆవిష్కరించింది. నాయిస్‌ లూనా రింగ్‌ కూడా హార్ట్‌ రేట్‌ మానిటర్‌, శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్‌, SpO2 సెన్సార్‌ సహా 70 రకాలకు పైగా శరీర విభాగాలను ట్రాకింగ్‌ చేయగలదని నాయిస్‌ సంస్థ చెబుతోంది. ఈ సమాచారాన్ని నాయిస్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

నాయిస్‌ లూనా స్మార్ట్‌ రింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఫోటోఫ్లేథిస్మోగ్రఫీ సెన్సార్లు, స్కిన్‌ టెంపరేచర్‌ సెన్సార్లు, 3 యాక్సిస్ యాక్సిలెరోమీటర్‌ వంటి అధునాతన సెన్సార్లు ఉన్నాయి. కస్టమర్‌ వేతితో ఆప్టికల్‌ సెన్సార్‌ల అమరికను నిర్దారించేందుకు ఈ రింగ్ మూడు బంప్‌లతో పాటు ఎల్ఈడీ, పీడీలను కలిగి ఆప్టో మెకానికల్‌ డిజైన్‌ను వినియోగిస్తున్నామని నాయిస్‌ సంస్థ తెలిపింది.

నాయిస్‌ స్మార్ట్ రింగ్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 7 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని సంస్థ చెబుతోంది. కేవలం 60 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జింగ్‌ చేయవచ్చని తెలిపింది. ఈ రింగ్‌ ఆటోమేటిక్‌ అప్‌డేట్‌లను సపోర్టు చేస్తుందని, iOS, ఆండ్రాయిడ్‌ 6 కంటే ఎక్కువ వెర్షన్‌లను సపోర్టు చేస్తుందని తెలిపింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Boat smart ring will be on sale from august 28 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X