Home
Gadgets

అద్భుతమైన స్మార్ట్ ఫీచర్లతో బోట్ స్మార్ట్ రింగ్! ఎలా పనిచేస్తుందో చూడండి

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ Boat నుంచి సరికొత్త స్మార్ట్ రింగ్‌ విడుదల కానుంది. దీనిని బోట్‌ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే ఈ స్మార్ట్‌ రింగ్‌ హెల్త్‌ ట్రాకర్‌ సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంటుందని తెలిపింది. చాలా మంది వాచ్‌లకు బదులుగా రింగ్‌లను ధరించేందుకు ఆసక్తి చూపిస్తారు.. అటువంటి సమయాల్లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ట్రాకింగ్‌ చేసేందుకు ఉపయోగపడనుంది.

స్మార్ట్‌వాచ్‌ కలిగిన అన్ని ఫీచర్లు ఈ స్మార్ట్‌వాచ్‌లోనూ ఉంటాయి. ఈ స్మార్ట్‌ రింగ్‌ దూరం, అడుగులు, రోజులో ఖర్చు అయిన క్యాలరీ వివరాలను కూడా లెక్కించగలదు. హార్ట్‌ రేట్‌ను పర్యవేక్షిస్తుంది. మరియు వ్యాయామం వంటి శరీరం ఒత్తిడికి గురయ్యే సమయాల్లో గుండె ఆరోగ్య స్థితిని నిర్దారించేందుకు సాయపడుతుందని బోట్‌ సంస్థ చెబుతోంది.

Boat smart ring

బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ నిద్ర సమయం, నాణ్యత సహా మహిళల రుతుచక్రాలను కూడా ట్రాక్‌ చేస్తుంది. వీటితోపాటు శరీర ఉష్ణోగ్రత, SpO2 స్థాయిలను కూడా పర్యవేక్షిస్తుంది. ఒక్క చేతితోనే ఈ స్మార్ట్‌ రింగ్‌ను నియంత్రించవచ్చు. ఈ రింగ్‌ బోట్‌ రింగ్‌ యాప్‌తో కనెక్ట్‌ అవుతుంది. మరియు శరీరంలోని వివిధ భాగాల పనితీరు యొక్క ట్రాకింగ్‌ వివరాలను ఆ యాప్‌ ద్వారా అందిస్తుంది.

ఈ బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ నీరు, చెమట నుంచి రక్షణ పొందేలా 5 ATM రేటింగ్‌తో తయారు చేయబడింది. ఈ రింగ్‌ రోజు ధరించవచ్చు లేదా వ్యాయామం చేస్తున్న సమయంలో కూడా ధరించవచ్చు. ఈ రింగ్‌ సిరామిక్‌, మెటల్‌ బాడీని కలిగి ఉంటుంది. ఈ రింగ్‌లో స్మార్ట్‌వాచ్‌ తరహాలో చాలా ఫీచర్లు ఉన్నాయని బోట్ సంస్థ చెబుతోంది.

ఈ బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. స్మార్ట్‌వాచ్‌లు ధరించే అలవాటు లేని వ్యక్తులకు ఈ స్మార్ట్‌ రింగ్‌ చాలా ఉపయోగపడుతుంది. మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ తరహా ఉత్పత్తులను తొలుత Oura సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే భారత్‌లో బోట్‌ రింగ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత రెండింటిలో మధ్య తేడాలు, ఉపయోగాలపై మరింత స్పష్టత వస్తుంది.

ఈ బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ మంచి మెరుగైన, స్టైలిష్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఎటువంటి దుస్తులు వేసుకున్న సరిగా మ్యాచ్‌ అవుతుంది. స్మార్ట్‌ రింగ్‌లోని స్లీప్‌ ట్రాకర్‌.. స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌ల కంటే మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉంది. మహిళలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వారి వ్యక్తిగత సహా ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుంది, అప్రమత్తం చేస్తుంది.

అయితే ఈ బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ ఎంత ధరకు లభిస్తుంది, ఎప్పటి నుంచి భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందన్న విషయాలపై బోట్‌ సంస్థ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా బోట్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Boat smart ring with health trackers will be launched in india specs features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X