Home
Gadgets

ధర రూ.1099 కే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌, SOS ఫీచర్‌ కలిగిన బోట్‌ స్మార్ట్‌వాచ్‌ విడుదల.. సేల్ వివరాలు..!

బోట్‌ సంస్థ భారత్‌ మార్కెట్‌లో తాజాగా బోట్‌ స్ట్రోమ్‌ కాల్ 3 (Boat Storm Call 3 Launched) పేరుతో స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ వాచ్‌ 1.83 అంగుళాల దీర్ఘ చతురస్రాకార డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు బ్లూటూత్‌ కాలింగ్‌, నావిగేషన్‌ సపోర్టుతో లాంచ్ అయింది.

బోట్‌ స్ట్రోమ్ కాల్‌ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
బోట్‌ స్ట్రోమ్ కాల్‌ 3 స్మార్ట్‌ వాచ్‌ 1.83 అంగుళాల దీర్ఘ చతురస్రాకార డిస్‌ప్లేను కలిగి ఉంది. 240*296 పిక్సల్‌ రిజల్యూషన్‌, 550 నిట్స్‌ బ్రైట్‌ నెస్‌ ను కలిగి ఉంది. ఈ వాచ్‌ ఫేస్‌ను వినియోగదారుడికి నచ్చినట్లుగా మార్చుకొనే వీలుంది. ఈ డిస్‌ప్లే వేక్‌ గెశ్చర్స్‌ (Wake Gestures) లను కలిగి ఉంటుంది.

Boat Storm Call 3 Smartwatch price

ఎమర్జెన్సి SOS :
దీంతోపాటు ఈ స్మార్ట్‌ వాచ్‌ సూపర్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా SOS మోడ్‌ను కలిగి ఉంది. ఎమర్జెన్సీ సమయాల్లో ముందస్తుగానే నమోదు చేసిన వ్యక్తుల ఫోన్‌ నంబర్లకు సమాచారం అందిస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసేందుకు వాచ్‌ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది.

7 రోజుల బ్యాటరీ బ్యాకప్ :
ఈ బోట్‌ కొత్త స్మార్ట్‌ వాచ్‌ 230mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుందని బోట్‌ వెల్లడించింది. దీంతోపాటు Crest+ OS మరియు ఇన్‌బిల్ట్‌ నావిగేషన్ సిస్టమ్‌తో లాంచ్‌ అయింది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్‌ 5.2 మరియు బ్లూటూత్‌ కాలింగ్ సపోర్టుతో వస్తుంది.

హెల్త్‌ ట్రాకర్లు :
ఈ బోట్‌ స్ట్రోమ్ కాల్‌ 3 స్మార్ట్‌ వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంటుంది. హార్ట్‌ రేట్‌, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్‌, స్లీప్‌ సైకిల్‌ ట్రాకర్ వంటి అనేక ట్రాకర్లను కలిగి ఉంది. మరియు 700+ ప్రీ ఇన్‌ స్టాల్ట్‌ యాక్టివిటీ మోడ్‌లను కలిగి ఉంది. బోట్‌ యాప్‌ ద్వారా ఈ వివరాలను ట్రాక్ చేయవచ్చు.

బోట్‌ స్ట్రోమ్‌ కాల్‌ 3 ధర..
బోట్‌ స్ట్రోమ్‌ కాల్‌ 3 స్మార్ట్‌వాచ్‌ను బోట్‌ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. యాక్టివ్‌ బ్లాక్‌, చెర్రీ బ్లోసమ్‌, డార్క్ బ్లూ, ఓలివ్‌ గ్రీన్‌ మరియు సిల్వర్‌ మెటల్‌ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌వాచ్‌ ప్రారంభ ధర రూ.1099 కాగా.. సిల్వర్‌ మెటల్‌ వేరియంట్ ధర రూ.1249 గా ఉంది. మిగిలిన వేరియంట్ల ధరలు రూ.1,588, రూ.1,694 గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Boat Storm Call 3 Smartwatch launched in india with SOS feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X