Home
Gadgets

20 రోజుల బ్యాటరీ లైఫ్‌, బ్లూటూత్‌ కాలింగ్‌, హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లతో boAt స్మార్ట్‌వాచ్‌ విడుదల..!

Boat Storm Infinity Plus Smartwatch : ప్రముఖ గ్యాడ్జెట్‌లు, ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్‌ తాజాగా భారత్‌ మార్కెట్లో బోట్‌ స్ట్రోమ్‌ ఇన్ఫినిటీ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. హెవీ యూజర్లకు ఈ వాచ్ అనుకూలంగా ఉంటుందని బోట్‌ చెబుతోంది. ఈ వాచ్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 20 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని బోట్‌ చెబుతోంది. ఈ వాచ్‌ ఫైండ్‌ మై డివైజ్‌ ఫీచర్‌, బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

బోట్‌ స్ట్రోమ్‌ ఇన్ఫినిటీ ప్లస్‌ స్మార్ట్‌వాచ్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు
ఈ బోట్‌ స్మా్ర్ట్‌వాచ్‌ దీర్ఘచతురస్రాకార డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ఫంక్షనల్‌ క్రోన్‌ను అమర్చి ఉంటుంది. ఈ వాచ్‌ డిస్‌ప్లే 1.96 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 240x296 పిక్సల్‌ రిజల్యూషన్‌, 480 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

Boat storm infinity plus smartwatch sale

బోట్‌ స్ట్రోమ్‌ ఇన్ఫినిటీ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ 680mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి లైట్‌ యూజర్‌లు అయితే 30 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని బోట్‌ చెబుతోంది. అదే హెవీ యూజర్లకు 20 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని తెలిపింది. కేవలం 60 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని బోట్‌ తెలిపింది.

ఈ వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ ద్వారా హార్ట్‌ రేట్‌, నిద్ర నాణ్యత, ఒత్తిడి, మహిళల్లో రుతుక్రమం, SpO2 ను కూడా ట్రాక్ చేయవచ్చు. హెల్త్‌ ట్రాకర్‌లతోపాటు అనేక ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను కూడా కలిగి ఉంది. ఇందులో డైలీ యాక్టివిటీ ట్రాకర్‌, స్టెప్‌ మానిటర్‌, డిస్టన్స్‌ ట్రాకర్ సహా మరిన్ని ఫీచర్‌లున్నాయి.

ఈ బోట్‌ స్ట్రోమ్ ఇన్ఫినిటీ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ IP68 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ వాచ్‌ 100 స్పోర్ట్స్‌ మోడ్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ Find My Device ఫీచర్‌ను కూడా సపోర్టు చేస్తుంది. వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా కూడా ఈ స్మార్ట్‌వాచ్‌ను నియంత్రించవచ్చని బోట్ చెబుతోంది.

బోట్‌ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు ఈ వాచ్‌లో 10 వరకు కాంటాక్ట్స్‌లను సేవ్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఈ వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేశాక.. ఫోన్ కెమెరా, మీడియా ప్లేయర్‌ను కంట్రోల్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

Boat storm infinity plus smartwatch sale

బోట్‌ స్ట్రోమ్‌ ఇన్ఫినిటీ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ ధర, సేల్‌ :
బోట్‌ స్ట్రోమ్‌ ఇన్ఫినిటీ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ సిలికాన్ స్ట్రాప్‌ వేరియంట్‌ ధర రూ.1199 గా ఉంది. ఈ వేరియంట్‌ డీప్‌ బ్లూ, కూల్‌ గ్రే, యాక్టివ్‌ బ్లాక్‌, చెర్రీ బ్లోసమ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ నైలాన్‌ స్ట్రాప్‌ వేరియంట్ ధర రూ.1399 గా ఉంది. ఈ వేరియంట్ స్పోర్ట్స్‌ బ్లాక్‌, స్పోర్ట్స్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ బోట్‌ స్మార్ట్‌వాచ్‌ను బోట్‌ ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వాచ్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్‌ చేయండి.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

More from GizBot

Best Mobiles in India

English summary
Boat storm infinity plus smartwatch launched with 20 days battery life in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X