Home
Gadgets

బ్లూటూత్‌ కాలింగ్‌, హెల్త్ ట్రాకర్లు, అమోలెడ్‌ డిస్‌ప్లేతో Boat స్మార్ట్‌వాచ్‌లు విడుదల.. సేల్‌ ప్రారంభం..!

ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ Boat తాజాగా బ్లూటూత్‌ కాలింగ్ సపోర్టుతో స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ఈ వాచ్‌లు మెరుగైన వాటర్‌ రెసిస్టెన్స్‌ ను కలిగి ఉన్నాయి. డిజైన్ పరంగా ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు ఆకట్టుకుంటున్నాయి. రెండు వాచ్‌లు వేర్వేరు డిజైన్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లతో అందుబాటులోకి వచ్చాయి. బోట్‌ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన వాచ్‌లు, ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.

బోట్‌ తాజాగా అల్టిమా ప్రైమ్‌, అల్టిమా ఎంబర్‌ పేరుతో రెండు స్మార్ట్‌వాచ్‌లను భారత్‌ మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు వాచ్‌లు IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. ఈ వాచ్‌లో అనేక ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లు, హెల్త్‌ ట్రాకర్‌లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.

Boat Ultima Prime  Ultima Ember SmartWatches price

బోట్‌ అల్టిమా ప్రైమ్‌ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
ఈ వాచ్‌ (Boat Ultima Prime Smartwatch) 1.43 అంగుళాల (466*466 పిక్సల్స్‌) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 700 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ వాచ్‌ క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ ఫేస్‌లు సహా 100 పైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌ ను సపోర్టు చేస్తుంది. మరియు Wake గెశ్చర్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు 20 కాంటాక్ట్స్‌ వరకు సేవ్‌ చేసేందుకు అవకాశం ఉంది.

ఈ బోట్‌ స్మార్ట్‌వాచ్‌ ఇన్‌బిల్ట్‌ మైక్‌, స్పీకర్‌, ఫంక్షనల్ క్రోన్‌ను కలిగి ఉంది. మరియు ఈ వాచ్ 300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 5 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. బోట్‌ అల్టిమా ప్రైమ్‌ స్మార్ట్‌వాచ్‌ రాయల్‌ బెర్రీ, రోజ్‌ గోల్డ్‌, సిల్వర్‌ మిస్ట్‌, స్టీల్‌ బ్లాక్‌, ఫారెస్ట్‌ గ్రీన్‌, ఆనిక్స్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

Boat Ultima Prime  Ultima Ember SmartWatches price

బోట్‌ అల్టిమా ఎంబర్‌ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
ఈ వాచ్‌ 1.96 అంగుళాల (386*448 పిక్సల్స్) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ ఫేస్‌లు సహా 100 పైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. సిల్వర్‌ మిస్ట్‌, స్టీల్‌ బ్లాక్‌, రోజ్‌ గోల్డ్‌, రాయల్‌ బెర్రీ, బోల్డ్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఈ వాచ్‌ (Boat Ultima Ember Smartwatch) బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు 20 కాంటాక్ట్ వరకు సేవ్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఇన్‌బిల్ట్‌ మైక్‌, స్పీకర్‌, ఫంక్షనల్ క్రోన్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ 300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 15 రోజుల వరకు వినియోగించుకోవచ్చు.

ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు అనేక హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను కలిగి ఉన్నాయి. హార్ట్‌ రేట్‌, SpO2 (బ్లడ్‌ ఆక్సిజన్‌ స్థాయి), నిద్ర నాణ్యత, ఒత్తిడి పర్యవేక్షణ సహా రుతుక్రమాన్ని ట్రాక్ చేసే ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. వ్యాయామాలు, నడక వంటి సమయాల్లో ఈ వాచ్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

ధర, సేల్ వార్తలు :
బోట్‌ అల్టిమా ప్రైమ్‌, అల్టిమా ఎంబర్‌ స్మార్ట్‌వాచ్‌ల ప్రారంభ ధర రూ.2199 గా ఉంది. ఈ రెండు వాచ్‌లు బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఇతర రిటైల్‌ స్టోర్‌లలోనూ కొనుగోలు చేయవచ్చని బోట్‌ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Boat Ultima Prime, Ultima Ember Smartwatches launched in india sale is live on amazon and flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X