ధర రూ.1,199 కే 7 రోజుల బ్యాటరీ లైఫ్, నావిగేషన్ ఫీచర్‌తో బోట్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్‌లు, సేల్ వివరాలు..!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. బోట్ వేవ్ సిగ్మా 3 (boAt Wave Sigma 3 Smartwatch) పేరుతో లాంచ్ చేసింది. దీని ద్వారా నావిగేషన్ సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంటుందని బోట్ సంస్థ వెల్లడించింది.
ఈ బోట్ స్మార్ట్ వాచ్ 2.01 అంగుళాల డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 550 నిట్స్ HD రిజల్యూషన్‌తో లాంచ్ అయింది. ఫలితంగా సూర్యకాంతి ఎక్కువగా ఉన్న సమయంలోనూ సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అనేక ఫీచర్లు, హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంది.

ఈ బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ప్రీమియం అల్యూమినియం కేస్‌ను కలిగి ఉంది. ఈ బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్‌వాచ్ మెటల్ లేదా సాఫ్ట్ సిలికాన్ స్ర్టాప్‌లతో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు కస్టమైజ్ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంటుంది.
ఈ బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్‌వాచ్ MapMyIndia ఆధారిత నావిగేషన్‌ను ఇన్‌బిల్ట్‌గా కలిగి ఉంటుంది. ఫలితంగా కొత్త ప్రాంతాల్లోకి వెళ్లిన సమయంలో నావిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్‌ను తరచూ చూసే అవసరం లేకుండా స్మార్ట్‌వాచ్ ద్వారా రహదారి వివరాలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు Crest యాప్ ద్వారా QR కోడ్‌లను కూడా సులభంగా యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్‌వాచ్ IP67 రేటింగ్‌తో నీరు, చెమట నుంచి రక్షణను కలిగి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌వాచ్ సింగిల్ ఛార్జింగ్‌తో 7 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. అదే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది.
దీంతోపాటు ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఫోన్ నోటిఫికేషన్, ఇన్‌కమింగ్ కాల్స్ మరియు మెసేజ్‌లను నేరుగా వాచ్ నుంచే తనిఖీ చేసుకోవచ్చు. ఇందులో డయల్ ప్యాడ్, కాంటాక్ట్ లిస్ట్ ను కూడా చూడవచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్ ఆరోగ్యానికి సంబంధించిన అనేక ట్రాకర్లను కలిగి ఉంటుంది. హార్ట్ రేట్, SpO2 స్థాయి, నిద్రకు సంబంధించిన అంశాలను ట్రాకింగ్ చేయవచ్చు. దీంతోపాటు నిద్ర నాణ్యత, రోజువారీ ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యాయి వంటి వివరాలను తనిఖీ చేయవచ్చు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ మరియు యోగా పర్యవేక్షణకు 700 పైగా యాక్టివ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.
వీటితోపాటు మరికొన్ని అదనపు ఫీచర్లు కూడా ఈ బోట్ స్మార్ట్‌వాచ్ సొంతం. ఎమర్జెన్సీ SOS, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, అలారం, స్టాప్‌వాచ్, టైమర్, వాతావరణానికి సంబంధించిన అప్‌డేట్ సహా ఫైండ్ మై ఫోన్/వాచ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి.
ఈ బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్‌వాచ్ అనేక రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. యాక్టివ్ బ్లాక్, మెటల్ బ్లాక్, మెటల్ గ్రే, కూల్ గ్రే, చెర్రీ బ్లోసమ్, రస్టిక్ రోజ్ మరియు సఫైర్ బ్రీజ్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ.1199 గా ఉంది. బోట్ అధికారిక వెబ్‌సైట్ boat-lifestyle.com సహా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








