boAt నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో హై-ఎండ్ ఫీచ‌ర్లతో స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

|

స్వదేశానికి చెందిన ప్ర‌ముఖ వేర‌బుల్స్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ boAt, దేశంలో కొత్త స్మార్ట్ వాచ్‌ను విడుద‌ల చేసింది. బ‌డ్జెట్ ధ‌ర‌లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్‌ను యూజ‌ర్ల‌కు ప‌రిచ‌యం చేసింది. boAt Xtend Talk పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్‌కు అలెక్సా స‌పోర్ట్‌, IP68 రేటింగ్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ స్మార్ట్‌వాచ్ 2.5డి కర్వ్డ్ స్క్రీన్‌ను ప్యాక్ చేస్తుంది. భార‌త మార్కెట్లో దీన్ని రూ.3,000 లోపు లాంచ్ చేశారు. ఈ వాచ్ గురించి ఇంకా పూర్తి స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు, ఇత‌ర‌త్రా వివ‌రాలు తెలుసుకోవ‌డానికి ఈ ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి.

 
boAt నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో హై-ఎండ్ ఫీచ‌ర్లతో స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

boAt Xtend Talk స్పెసిఫికేష‌న్లు:
boAt Xtend Talk వాచ్ రెక్టాంగ్యుల‌ర్ ఆకారంలో స్క్రీన్ కలిగి ఉంది. దీనికి మ్యాన్యువ‌ల్ ఆప‌రేష‌న్ కోసం కుడి వైపున ఒక హార్డ్ బటన్‌ను అందిస్తున్నారు. ఇది HD రిజల్యూషన్‌తో పనిచేసే 1.69-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్ మరియు VO2 మ్యాక్స్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది స్టెప్స్‌, కెలోరీలు స‌హా మ‌రిన్నింటిని ట్రాక్ చేయగలదు. ఈ డివైజ్ 60+ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది మరియు ఆటో వర్కౌట్ డిటెక్షన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

boAt నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో హై-ఎండ్ ఫీచ‌ర్లతో స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

ఈ వాచ్‌ను ఒక‌సారి ఫుల్ ఛార్జ్ చేసిన త‌ర్వాత వినియోగదారులు సాధారణ వినియోగంతో 10 రోజుల బ్యాటరీ లైఫ్ పొందుతారు. మరియు బ్లూటూత్ కాలింగ్ ప్రారంభించబడితే 2 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. Xtend Talk వాచ్‌కు IP68 రేటింగ్‌కు మద్దతు ఉంది. ఈ వాచ్‌కు 150కి పైగా వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ ఉందని కంపెనీ పేర్కొంది. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. 300mAh బ్యాటరీ అందిస్తున్నారు.

boAt Xtend Talk ధ‌ర‌లు:
boAt Xtend టాక్ ప్రారంభ ధరను రూ.2,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. దీనిని అమెజాన్ ఇండియా మరియు ఇతర పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది పిచ్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్ మరియు టీమ్ గ్రీన్ సహా మూడు రంగులలో విక్రయించబడుతుంది.

boAt నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో హై-ఎండ్ ఫీచ‌ర్లతో స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

Noise కంపెనీ నుంచి ఈ ఏడాది విడుద‌లైన Colorfit Pro 4 Max, Colorfit Pro 4 ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
Noise Colorfit Pro 4 Max స్పెసిఫికేషన్స్:
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 మాక్స్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×258 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.80-అంగుళాల TFT LCDతో వస్తుంది. ఈ డిస్ప్లే 40Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది మీరు కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు కనుగొనవచ్చు, కానీ అది ధరను సమర్థిస్తుంది. Noise ColorFit Pro 4 Max యొక్క డిస్‌ప్లే Noise ColorFit 3 కంటే 33 శాతం పెద్దదని నాయిస్ పేర్కొంది. Noise ColorFit Pro 4 Max 150కి పైగా ఎంపికలతో మరియు అనుకూలీకరణకు మద్దతుతో వాచ్ ఫేస్‌లతో వస్తుంది. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మాక్స్ ఇండియాలో రూ.3,999 ధర వద్ద లభిస్తుంది.

 

Noise Colorfit Pro 4:
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మోడల్ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ కొంచెం సరసమైన ధరను కలిగి ఉంటుంది. దీని ధర రూ.3,499 కలిగి ఉంటుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 356×400 పిక్సెల్‌ మరియు మెరుగైన 60Hz రిఫ్రెష్ రేట్‌తూ కూడిన 1.72-అంగుళాల TFT LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ColorFit Pro 3 యొక్క డిస్‌ప్లే పరిమాణం కంటే 25 శాతం అధికంగా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండడమే కాకుండా నీరు మరియు ధూళి నిరోధకతకు IP68 నిరోధకతను కలిగి ఉంటాయి.

boAt నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో హై-ఎండ్ ఫీచ‌ర్లతో స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

ColorFit Pro 4 మరియు ColorFit 4 Pro Max రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ మరియు స్ట్రెస్ మానిటరింగ్ కోసం సపోర్ట్‌తో వస్తాయి. అదనంగా ఈ రెండు కూడా ఫిట్‌నెస్-సంబంధిత ఫీచర్లలో రన్నింగ్, అవుట్‌డోర్ స్పోర్ట్స్, హైకింగ్, సైక్లింగ్ మరియు ఇండోర్ స్పోర్ట్స్ తో కలిపి మొత్తంగా 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
boAt Xtend Talk Smartwatch Launched in India, Know Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X