ధర రూ.1099, 1499 లకే ప్రీమియం డిజైన్, LED డిజిటల్ డిస్‌ప్లేతో Boult పవర్ బ్యాంక్‌లు.. పూర్తి వివరాలు..!
ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ Boult తాజాగా రెండు పవర్ బ్యాంక్‌లను విడుదల చేసింది. ఈ పవర్ బ్యాంక్‌లు అడ్వాన్స్‌డ్ ఛార్జింగ్ ఫీచర్‌లను సపోర్టు చేస్తాయని సంస్థ చెబుతోంది. ఈ రెండు వేర్వేరు సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. మరియు తక్కువ ధరలోనే ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ చెబుతోంది. దూర ప్రాంత ప్రయాణాల్లో సౌకర్యవంతంగా తీసుకెళ్లేందుకు వీలుగా మెరుగైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. Boult AmpVault V10 మరియు V20 పేర్లతో భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది.
AmpVault V10, V20 పవర్ బ్యాంక్‌లు అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ సహా ప్రీమియం డిజైన్‌తో మెరుగైన పనితీరును అందిస్తాయని Boult చెబుతోంది. మీడియం, అధిక ఛార్జింగ్ అవసరాలు ఉన్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు చెబుతోంది. ఒకేసారి వివిధ డివైజ్‌లను ఛార్జింగ్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ఈ పవర్ బ్యాంక్‌ల ధర, సామర్థ్యం సహా మరిన్ని వివరాలు.

AmpVault V10 పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్‌లు :
ఈ పవర్ బ్యాంక్ 10000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని Boult సంస్థ వెల్లడించింది. ఒకరిద్దరు యూజర్లు వినియోగించుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. 22.5W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. భద్రత, ఫాస్ట్ ఛార్జింగ్, పోర్టబుల్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. LED డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
AmpVault V20 పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్‌లు :
ఈ Boult పవర్ బ్యాంక్ 20,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అధికంగా ఛార్జింగ్ అవసరాలు ఉన్న వినియోగదారులకు ఈ పవర్ బ్యాంక్ అనుకూలంగా ఉంటుంది. ఈ V20 పవర్ బ్యాంక్ 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. LED డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ AmpVault పవర్ బ్యాంకుతో 4.9 సార్లు ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్‌ను ఛార్జింగ్ చేయవచ్చని Boult చెబుతోంది. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్‌ను 4.1, వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌లను 6 సార్లు ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది. ఆకట్టుకొనే డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో మెరుగైన పనితీరు కనబరుస్తుందని సంస్థ తెలిపింది.
ఈ V20 పవర్ బ్యాంక్ ద్వారా ఒకేసారి అనేక డివైజ్‌లను ఛార్జింగ్ చేయవచ్చు. అందుకు అనుగుణంగా మైక్రో USB, టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లు మరియు USB ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ సహా ట్యాబ్లెట్‌లను ఛార్జింగ్ చేసుకొనేందుకు ఈ పవర్ బ్యాంక్ అనుకూలంగా ఉంటుందని Boult చెబుతోంది.

ఈ పవర్ బ్యాంక్ ప్రీమియం డిజైన్ సహా మెరుగైన పనితీరుతోపాటు అధునాతన ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. స్మార్ట్ షట్‌డౌన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్‌లతో అందుబాటులో ఉంది. Boult AmpVault V20 పవర్ బ్యాంకు సుపీరియర్ మెటాలిక్ ఫినిష్‌తో మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. టీల్, రెడ్, ప్యూర్ బ్యాక్ రంగుల్లో లభిస్తుంది. V10.. బ్లాక్, బ్లూ, బీజ్ రంగుల్లో లభిస్తుంది.
Boult పవర్ బ్యాంకు ధర, సేల్ వివరాలు :
భారత్ మార్కెట్‌లో V10 పవర్ బ్యాంక్ ధర ప్రస్తుతం రూ.1099 గా ఉంది. అదే V20 ధర రూ.1499 గా ఉంది. ప్రస్తుతం ఈ రెండు పవర్ బ్యాంకులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. Boult అధికారిక వెబ్‌సైట్ సహా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








