Boult Audio సంస్థ నుంచి స్మార్ట్ రింగ్.. కీలక ఫీచర్లతో రూ.5000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!!
ప్రస్తుతం అనేక సంస్థలు స్మార్ట్ రింగ్‌ల తయారీపై ఎక్కువ దృష్టిపెడుతున్నాయి. బోట్, నాయిస్ సహా శాంసంగ్ వంటి సంస్థలు కూడా స్మార్ట్ రింగ్‌ల తయారీలో ముందున్నాయి. తాజాగా బౌల్డ్ ఆడియో త్వరలో స్మార్ట్ రింగ్‌ను (Boult Audio Smart Ring) విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు అందుబాటు ధరకే లాంచ్ కానుందని తెలుస్తోంది.
బౌల్ట్ ఇప్పటికే అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. బౌల్డ్ బడ్స్, స్పీకర్లకు ప్రసిద్ది చెందింది. దీంతోపాటు తాజాగా స్మార్ట్ రింగ్ విడుదల కానుంది. రూ.5000 కంటే తక్కువ ధరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ రింగ్ అనేక ప్రత్యేకతలు, హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బౌల్డ్ ఆడియో సీఈవో వరుణ్ గుప్తా ఈ వివరాలు ది మొబైల్ ఇండియన్‌తో వెల్లడించారు.

ప్రస్తుతం నాయిస్ లూనా రింగ్ రూ.19000 గా ఉంది. అదే బోట్ స్మార్ట్ రింగ్ రూ.8999 గా ఉంది. ఈ రెండింటితో పోలిస్తే బౌల్ట్ రింగ్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా ఎక్కువ మందిని ఆకర్షించే అవకాశం ఉంది. అయితే ఈ బౌల్ట్ స్మార్ట్ రింగ్ మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఈ స్మార్ట్ రింగ్ అనేక సెన్సార్లను కలిగి ఉంటున్నాయి. వీటి ద్వారా హార్ట్ రేట్, నిద్ర నాణ్యత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటుని ట్రాక్ చేస్తుంది. సంబంధిత యాప్ ద్వారా వివరాలు అందిస్తుంది. ఈ స్మార్ట్ రింగ్‌లతో నిరంతరం ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకొనే అవకాశం ఉంటుంది.
* ఇటీవలే శాంసంగ్ గెలాక్సీ రింగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ రింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంటుంది. శాంసంగ్ హెల్త్ యాప్ మరియు గెలాక్సీ వాచ్ ద్వారా ఈ శాంసంగ్ స్మార్ట్ రింగ్ సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
*బోట్ స్మార్ట్ రింగ్ అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఈ రింగ్ అధునాత ట్రాకింగ్ సామర్థ్యాతో వస్తుంది. ప్రీమియం సిరామిక్, మెటర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు స్మార్ట్ టచ్ కంట్రోల్స్‌తో ఈ రింగ్ వస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ బోట్ రింగ్ యాప్‌కు అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని ద్వారా మ్యూజిక్ ప్లే, పాజ్ చేయవచ్చని, ట్రాక్స్ మార్చుకోవచ్చు.
ఈ బోట్ స్మార్ట్ రింగ్ హార్ట్ రేట్ మానిటర్, SpO2 సెన్సార్, శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్‌లను కలిగి ఉంటుందని బోట్ తెలిపింది. దీంతోపాటు నిద్ర నాణ్యత సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. మహిళల రుతుక్రమాన్ని ట్రాకింగ్ చేయగలదని తెలిపింది. ఈ రింగ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. స్మార్ట్ రింగ్ ధర రూ.8,999గా ఉంది.
ఈ రింగ్ రన్నింగ్, వాకింగ్, రైడింగ్, ఇండోర్, అవుట్‌డోర్ ట్రాకింగ్ సహా అనేక రకాల వ్యాయామాలను ట్రాక్ చేయగలదు. ఈ సమాచారాన్ని బోట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ శరీర కదలికలను గుర్తించేందుకు వీలుగా ఆరు యాక్సిస్ మోషన్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల కోసం SOS మోడ్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








