Home
Gadgets

Boult నుంచి తొలిసారిగా కారు డ్యాష్‌క్యామ్‌ కెమెరాలు... తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్‌లు, సేల్ వివరాలు..!!

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ Boult తాజాగా కారు డ్యాష్‌బోర్డ్‌ కెమెరాను విడుదల చేసింది. Boult Cruisecam X1 సిరీస్‌ పేరుతో లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా క్రూయిజ్‌క్యామ్‌ X1 మరియు X1 GPS రెండు కెమెరాలున్నాయి. ఈ పరికరాల డిజైన్ ఆకట్టుకుంటోంది. అధిక నాణ్యత కలిగిన వీడియో, మరియు ఆన్‌రోడ్‌ భద్రత కోసం పనిచేస్తుంది. ఈ డ్యాష్‌క్యామ్‌లతో తొలిసారిగా ఆటోమొబైల్ రంగంలోకి బౌల్ట్‌ (Boult CruiseCam X1 Series Dashcam Launched) సంస్థ ప్రవేశించినట్లయింది.

బౌల్ట్‌ క్రూయిజ్‌క్యామ్‌ X1 తో 360 డిగ్రీల రొటేటింగ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. అవసరం అయిన యాంగిల్‌లో కెమెరాను సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే X1 GPS మోడల్‌ రియల్‌ టైం వెహికల్‌ ట్రాకింగ్‌ మరియు వేగానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

Boult CruiseCam X1 Series dashcam launched at RS2999

సూపర్‌ కెపాసిటర్‌లు, మెరుగైన పనితీరు.. : ఈ డ్యాష్‌ క్యామ్‌ లిథియం బ్యాటరీ లకు బదులుగా సూపర్‌ కెపాసిటర్‌ లను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ కాలం వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరియు అధిక ఉష్ణోగ్రతల సమయంలోనూ మెరుగైన పనితీరునే కనబరుస్తుంది.

బౌల్ట్‌ క్రూయిజ్‌క్యా్మ్‌ X1 సిరీస్‌ 1080P పుల్ HD రిజల్యూషన్‌ తో వీడియోను క్యాప్చర్‌ చేయవచ్చు. ఈ సిరీస్‌ డ్యాష్‌క్యామ్‌ 2MP కెమెరాను కలిగి ఉంటుంది. పగలు మరియు రాత్రి సమయాల్లో అధిక నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. మరియు 170 అల్ట్రా వైడ్‌ యాంగిల్ కెమెరాతో బ్లైండ్ స్పాట్‌లను తగ్గిస్తుంది.

ఈ డ్యాష్‌క్యామ్‌ G సెన్సార్‌తో వస్తుంది. దీని ద్వారా ఆటోమేటిక్‌గా ప్రమాదాలను గుర్తిస్తుంది. మరియు వెంటనే వీడియోను రికార్డు చేస్తుంది. ఫలితంగా సాక్ష్యాలను సిద్ధం చేస్తుంది. క్యూయిజ్‌క్యామ్‌ X1 GPS మోడల్‌.. GPS ఫీచర్‌తో పనిచేస్తుంది. వాహనం లోకేషన్‌, వేగాన్ని పర్యవేక్షిస్తుంది. ఏదైనా ప్రమాద సమయంలో సరైన డేటాను అందిస్తుంది.

కనెక్టివిటీ పరంగా వైఫైను సపోర్టు చేస్తుంది. ప్రత్యేక యాప్‌ ద్వారా డ్యాష్‌క్యామ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ యాప్‌ GPS ఇంటిగ్రేషన్‌ సహా వీడియోను గ్యాలరీని కలిగి ఉంటుంది. వైఫై ద్వారా నేరుగా స్ట్రీమింగ్‌ చేయవచ్చు. దీంతోపాటు మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది.

బౌల్ట్‌ క్రూయిజ్‌క్యామ్‌ X1 సిరీస్‌ ధర..
బౌల్ట్‌ క్రూయిజ్‌క్యామ్‌ X1 మోడల్‌ ప్రారంభ ధర రూ.2999 గా ఉంది. అదే X1 GPS మోడల్‌ ధర రూ.3999 గా ఉంది. ఈ డ్యాష్‌క్యామ్‌ను బౌల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ మరియు ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Boult CruiseCam X1 Series dashcam launched in india here are the features and price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X