ధర రూ.1099 కే భారీ డిస్‌ప్లే, హెల్త్ ట్రాకర్‌లు, బ్లూటూత్ కాలింగ్, వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌వాచ్..
స్మార్ట్‌వాచ్‌లకు భారత్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గతంతో పోలిస్తే స్మార్ట్‌వాచ్‌లను వినియోగించేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోపాటు హెల్త్ అప్‌డేట్‌లు, వర్కౌట్‌ల కోసం ఉపయోగించే యూజర్లు ఉన్నాయి. భారీ డిమాండ్ నేపథ్యంతో వాచ్‌ల తయారీ సంస్థలు యూజర్ల అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. రూ.1000 ధరలోనూ మెరుగైన ఫీచర్‌లతో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ బౌల్ట్ (Boult India) తక్కువ ధరలో మెరుగైన ఫీచర్‌లతో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ వాచ్ మెరుగైన వాటర్ ప్రూఫ్‌గా ఉంది. దీంతోపాటు అనేక ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. భారత్ మార్కెట్లో రెండు రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

బౌల్ట్ డ్రిఫ్ట్ మ్యాక్స్ పేరుతో స్మార్ట్‌వాచ్‌ను (Boult Drift Max Smartwatch) లాంచ్ చేసింది. సిలికాన్ స్ట్రాప్, స్టీల్ స్ట్రాప్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్, ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ అనేక హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. ఈ వాచ్ గూగుల్ అసిస్టెంట్, సిరి తో ఇంటిగ్రేట్ చేశారు.
స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
బౌల్ట్ డ్రిఫ్ట్ మ్యాక్స్ వాచ్ 2.01 అంగుళాల (240*240 పిక్సల్స్) HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 250 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. నేవిగేషన్ కోసం రొటేటింగ్ క్రోన్‌ను అమర్చారు. ఈ వాచ్ 250 కి పైగా వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. 120 స్పోర్ట్ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ వాచ్ అనేక హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. SpO2 (బ్లడ్ ఆక్సీజన్) స్థాయి పర్యవేక్షణ, హార్ట్ రేట్ మానిటర్,, బ్లడ్ ప్రజర్ సహా మహిళల్లో రుతు క్రమాన్ని ట్రాకింగ్ చేసే ఫీచర్‌లను కలిగి ఉంది. వీటితోపాటు నిత్ర నాణ్యత, కేలరీలను ట్రాక్ చేస్తుంది. క్రమం తప్పకుండా నీరు తాగేందుకు వీలుగా రిమైండర్ ఫీచర్‌ను కలిగి ఉంది.
స్మార్ట్‌వాచ్ 120 స్పోర్ట్స్ మోడ్స్, ఫిట్‌నెస్ ట్రాకర్‌లను కలిగి ఉంది. రన్నింగ్, సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్, స్టెప్స్ వంటి సమయాల్లో ఖర్చు అయిన కేలరీలను ట్రాక్ చేస్తుంది. దీంతోపాటు నిరంతరం పర్యవేక్షిస్తుంది. మరియు మరింత ఫిట్‌గా ఉండేలా విలువైలు సూచనలు చేస్తుందని తెలుస్తోంది.

ఈ వాచ్ బ్లూటూత్ 5.2 వెర్షన్‌తో బ్లూటూత్ కాలింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా వాచ్ నుంచే ఫోన్ కాల్స్ చేయడం మరియు స్వీకరించేందుకు అవకాశం ఉంది. మైక్రోఫోన్ సహా బిల్ట్ ఇన్ స్పీకర్‌ను అమర్చి ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, సిరి తో ఇంటిగ్రేట్ చేయబడి ఉంది.
సూపర్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌వాచ్ :
దీంతోపాటు ఈ బౌల్ట్ డ్రిఫ్ట్ మ్యాక్స్ స్మార్ట్‌వాచ్ వాతావరణ అప్‌డేట్‌లు, Calculator, ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ వాచ్ ద్వారానే స్మార్ట్‌ఫోన్ కెమెరాను నియంత్రించవచ్చు. ఈ వాచ్ IP68 రేటింగ్‌తో కూడిన మెరుగైన డస్ట్ మరియు వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా సుమారు 30 నిమిషాల పాటు నీటిలో ఉన్నా వాచ్ డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువ.
స్మార్ట్‌వాచ్ ధర, సేల్ వివరాలు :
బౌల్ట్ డ్రిఫ్ట్ మ్యాక్స్ సిలికాన్ స్ట్రాప్ వేరియంట ధర రూ.1099 గా ఉంది. స్టీల్ స్ట్రాప్ వేరియంట్ ధర రూ.1,199 గా ఉంది. బౌల్ట్ అధికారిక వెబ్‌సైట్ www.boultaudio.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ వాచ్ సిల్వర్, కోల్ బ్లాక్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications