70 గంటల బ్యాటరీ లైఫ్‌తో హెడ్‌ఫోన్స్.. ANC, ENC తో పాటు ఎన్నో ఫీచర్లు.. సేల్ ప్రారంభం..!
Boult Headphones : ప్రముఖ ఆడియో గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ Boult నుంచి రెండు ఓవర్ ది ఇయర్ హెడ్‌ఫోన్స్‌ను సంస్థ లాంచ్ చేసింది. Boult Fluidx మరియు Fluidx Pro పేర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు హెడ్‌ఫోన్స్ ANC, ENC ఫీచర్లను సపోర్టు చేస్తుంది. మరియు అధిక బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నాయి. మరియు టచ్ కంట్రోల్స్‌ను కూడా కలిగి ఉంది.
డిజైన్ :
ఈ రెండు హెడ్‌ఫోన్స్ ఓవర్ ఇయర్ డిజైన్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చాయి. దీర్ఘచతురస్రాకార ఇయర్ కప్స్‌ను కలిగి ఉన్నాయి. యూజర్లు సౌకర్యవంతంగా ఉపయోగించుకొనేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ఈ హెడ్‌ఫోన్స్ టచ్ కంట్రోల్స్ తోపాటు వాయిస్ అసిస్టెంట్ సపోర్టును కలిగి ఉంది.

బౌల్ట్ హెడ్‌ఫోన్స్ BoomX టెక్నాలజీ సపోర్టుతో 40mm బాస్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్స్ డైనమిక్ బాస్‌తో కూడిన మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుందని చెబుతోంది. ఈ హెడ్‌ఫోన్స్ బ్లూటూత్ 5.4 సపోర్టు చేస్తుంది. మరియు బ్లింక్ అంట్ పెయిర్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంది.
ఈ హెడ్‌ఫోన్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) వంటి ఫీచర్లను కూడా సపోర్టు చేస్తుంది. ఫలితంగా కాలింగ్ సహా ఇతర సమయాల్లో అవసరం లేని శబ్ధాలను కట్టడి చేస్తుంది. ఫలితంగా బహిరంగ ప్రదేశాల్లోనూ సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.
దీంతోపాటు ఈ రెండు హెడ్‌ఫోన్స్ కాంబాట్ గేమింగ్ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతో గేమింగ్ సమయంలో 60ms లో లేటెన్సీ ని సపోర్టు చేస్తుంది. ఫలితంగా గేమింగ్ సమయంలో సౌకర్యవంతంగా ఉపయోగించుకొనే వీలుంది. ఈ రెండు హెడ్‌ఫోన్స్ IPX5 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి.

60, 70 గంటల బ్యాటరీ లైఫ్ :
ఈ రెండు హెడ్‌ఫోన్స్ అధిక బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నాయి. Boult Fluidx హెడ్‌ఫోన్స్ ఒక్కసారి ఛార్జింగ్ చేసి 60 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను పొందవచ్చు. మరియు 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్ సపోర్టుతో 3 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది.
అదే విధంగా ప్రో మోడల్ హెడ్‌ఫోన్స్ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 70 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. అదే విధంగా 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్ సపోర్టుతో 5 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను పొందవచ్చని Boult సంస్థ చెబుతోంది.
Boult హెడ్‌ఫోన్స్ ధర, సేల్ వివరాలు :
Boult Fluidx ప్రారంభ ధర రూ.5999 గా ఉంది. అదే Boult Fluidx ప్రో మోడల్ ధర రూ.7999 గా ఉంది. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో కొనుగోలు చేయవచ్చు. అయితే అమెజాన్‌లో మాత్రం వీటి ధరలు రూ.2232, రూ.2791 గా ఉన్నాయి. ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ సంస్థ వెల్లడించిన ధర కంటే తక్కువగానే ఉన్నాయి.
Boult Fluidx మోడల్ బ్లాక్, గ్రీన్, ఐవరీ వైట్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. అదే ప్రో వేరియంట్ రవీన్ బ్లాక్, స్కిన్ బీజ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ హెడ్‌ఫోన్స్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








