ధర రూ.799, రూ.1099 కే Boult నుంచి ఇయర్‌బడ్స్.. ఫీచర్‌లు, సేల్ పూర్తి వివరాలు.. !
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ Boult ఆడియో తాజాగా భారత్ మార్కెట్ లో రెండు TWS ఇయర్‌బడ్స్ ను విడుదల చేసింది. Boult K10 మరియు W10 పేర్లతో విడుదల చేసింది. ఈ రెండు మోడళ్లు ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి. మరియు మెరుగైన కనెక్టివిటీ సహా ఆడియోను అందిస్తాయని సంస్థ చెబుతోంది. మరియు ఎక్కువ రోజులపాటు బ్యాటరీ లైఫ్ ను అందిస్తాయని సంస్థ హామీ ఇచ్చింది. ఈ ఇయర్‌బడ్స్ ఫీచర్, ధర, సేల్ పూర్తి వివరాలు.
Boult K10 ఇయర్‌బడ్స్ ఫీచర్లు :
ఈ Boult K10 ఇయర్‌బడ్స్ 10mm డ్రైవర్‌లను కలిగి ఉంది. మరియు బూమ్ X టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫలితంగా మెరుగైన ఆడియో అనుభూతిని పొందుతారని సంస్థ చెబుతోంది. రోజువారీ కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని సంస్థ చెబుతోంది.

ఈ K10 ఇయర్‌బడ్స్ సింగిల్ ఛార్జింగ్‌తో 50 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 150 నిమిషాలపాటు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. K10 ఇయర్‌బడ్స్ క్వాడ్ మైక్‌ను కలిగి ఉంటాయి. ఈ మైక్ ENC (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా కాలింగ్, మీటింగ్స్ సమయాల్లో బయట శబ్ధాలను కట్టడి చేస్తుంది.
ఈ ఇయర్‌బడ్స్‌ను (Boult K10 TWS Earbuds) రోజువారీ పనులు సహా గేమింగ్ సమయంలో అద్భుతంగా పనిచేస్తాయని సంస్థ చెబుతోంది. కాంబాట్ గేమింగ్ మోడ్ ద్వారా 45ms అల్ట్రా లో లేటెన్సీ సాధ్యమవుతుంది. IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉన్నాయి.
Boult W10 ఇయర్‌బడ్స్ ఫీచర్లు :
ఈ ఇయర్‌బడ్స్ 13mm డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. మరియు స్పేషియల్ ఆడియో ఫీచర్ ద్వారా అత్యంత మెరుగైన అవుట్‌పుట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ బడ్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. ఫలితంగా రెండు డివైస్‌లతో సులభంగా కనెక్ట్ కావచ్చు.
ఈ W10 ఇయర్‌బడ్స్ క్వాడ్ మైక్‌ను కలిగి ఉంటాయి. ఈ మైక్ ENC (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా కాలింగ్, మీటింగ్స్ సమయాల్లో పరిసర ప్రాంతాల నుంచి వచ్చే శబ్ధాలను కట్టడి చేస్తుంది. రోజువారీ పనులకు ఈ బడ్స్ అనుకూలంగా ఉంటాయని సంస్థ చెబుతోంది. Boult W10 మోడల్ సింగిల్ ఛార్జింగ్‌తో 55 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది.
Boult K10 ఇయర్‌బడ్స్ ధర రూ.1,099 గా ఉంది. అదే W10 TWS ఇయర్‌బడ్స్ ధర రూ.799 గా ఉంది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్‌లను boultaudio.com వైబ్‌సైట్ సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. K10 ఇయర్‌బడ్స్ కోరల్ వైట్ మరియు జెట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అదే W10 బ్లూ ఐస్ మరియు ప్యూర్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








