Boult నుంచి రెండు ఇయర్‌బడ్స్.. గరిష్ఠంగా 60 గంటల ప్లేటైం సహా కీలక ఫీచర్లు, సేల్ వివరాలు..!!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ Boult తన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా రెండు గేమింగ్ TWS మోడళ్లను లాంచ్ చేసింది. Z40 గేమింగ్, Y1 గేమింగ్ TWS ఇయర్‌బడ్స్‌ను (Bould Gaming Earbuds) విడుదల చేసింది. ఈ రెండు ఇయర్‌బడ్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.4 టెక్నాలజీని కలిగి ఉంటుంది.
బౌల్ట్ Z40 గేమింగ్ ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్లు, ధర :
బౌల్ట్ Z40 గేమింగ్ TWS ఇయర్‌బడ్స్‌ను రూ.1299 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌ను బౌల్ట్ అధికారిక వెబ్‌సైట్ సహా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్లాక్ మాస్, ఎలక్ట్రిక్ వైట్ రంగుల్లో లభిస్తున్నాయి.

బౌల్ట్ Z40 గేమింగ్ ఇయర్‌బడ్స్‌ను సింగిల్ ఛార్జింగ్ ద్వారా 60 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఇవి Boomx టెక్నాలజీ మరియు AAC SBC Codecs ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా స్పష్టమైన ఆడియో అవుట్‌పుట్‌ను పొందవచ్చు. మరియు డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ మరియు బ్లూటూత్ 5.4 టెక్నాలజీని కలిగి ఉంది.
దీంతోపాటు రెండు డివైస్‌ల మధ్య సులభంగా మారేందుకు అవకాశం ఉంటుంది. కాంబాట్ గేమింగ్ మోడ్ 40ms లో లేటెన్సీ కలిగి ఉంది. ZEN క్వాడ్ మైక్ ENC టెక్నాలజీతో వస్తుంది. ఫలితంగా కాలింగ్ సమయంలో వాయిస్ స్పష్టంగా ఉంది. టచ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్, IPX5 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లను కలిగి ఉంది. Boult AMP యాప్ ద్వారా నియంత్రించవచ్చు.
బౌల్ట్ Y1 గేమింగ్ ఇయర్‌బడ్స్ ఫీచర్లు, ధర :
బౌల్ట్ Y1 గేమింగ్ TWS ఇయర్‌బడ్స్‌ను సింగిల్ ఛార్జింగ్ ద్వారా 50 గంటల ప్లే టైంను ఇస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ మరియు బ్లూటూత్ 5.4 టెక్నాలజీని కలిగి ఉంటుంది. కాంబాట్ గేమింగ్ మోడ్‌లో 40ms లో లేటెన్సీ తో వస్తుంది. ZEN క్వాడ్ మైక్ ENC ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా బ్యాగ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది.
దీంతోపాటు టచ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్, IPX5 రెసిస్టెంట్ ఫీచర్లున్నాయి. బౌల్ట్ AMP యాప్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం iOS మరియు ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ మరియు బౌల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.
అదే బౌల్ట్ Y1 గేమింగ్ ఇయర్ బడ్స్ ధర రూ.1199 గా ఉంది. ఈ TWS ఇయర్‌బడ్స్‌ను ఫ్లిప్‌కార్ట్ మరియు బౌల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. బ్లాక్ మెటల్, ఎలక్ట్రిక్ రెడ్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








