బ్రేవ్ ఆర్క్ 2 ఇన్ 1 ఆండ్రాయిడ్ పీసీ.. 14,550mAh బ్యాటరీ, 12.95 అంగుళాల డిస్‌ప్లే!
Brave Ark 2 in 1 android PC : దేశీయ టెక్నాలజీ స్టార్టప్ బ్రేవ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారత్ మార్కెట్ లో బ్రేవ్ ఆర్క్ పేరుతో ఆండ్రాయిడ్ పీసీని లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. 2 ఇన్ 1 పీసీగా పనిచేస్తుందని చెబుతోంది. యూజర్లు సులభంగా, సౌకర్యవంతంగా ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈ పీసీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, విడుదల వివరాలు.
ఎప్పుడు విడుదల కానుంది? :
బ్రేవ్ ఆర్క్ ఆండ్రాయిడ్ పీసీ భారత్ మార్కెట్ లో ఫిబ్రవరి 6 వ తేదీన విడుదల కానుంది. విడుదల అనంతరం అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన అమెజాన్ మైక్రోసైట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

క్వాల్‌కాం, గూగుల్‌తో భాగస్వా్‌మ్యం :
మెరుగైన, స్థిరమైన పనితీరు, సాఫ్ట్‌వేర్ సపోర్టును అందించేందుకు వీలుగా క్వాల్‌కాం, గూగుల్ తో పనిచేస్తున్నట్లు బ్రేవ్ తెలిపింది. అదే సమయంలో తయారీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్, నాణ్యత కోసం సిర్మా SGS సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా తన ఉత్పత్తులను సులభంగా విక్రయించేందుకు వీలుగా అమెజాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
14,550mAh బ్యాటరీ భాగస్వా్‌మ్యం :
బ్రేవ్ ఆర్క్ 2 ఇన్ 1 ఆండ్రాయిడ్ పీసీ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 12GB ర్యామ్ 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ పీసీ 3.85V సపోర్టుతో 14,550mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు స్టైలస్ పెన్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.
భారీ డిస్‌ప్లే :
ఆండ్రాయిడ్ పీసీ 144Hz రీఫ్రెష్ రేట్ తో 12.95 అంగుళాల ( 1840 x 2880 పిక్సల్స్ ) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5MP కెమెరాను కలిగి ఉంటుంది.
* భారత్ మార్కెట్ లో రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్ విడుదల అయింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.26,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ( Wi-Fi + 5G ) ధర రూ.29,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (Wi-Fi + 5G) ధర రూ.31,999 గా ఉంది.
రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 11.61 అంగుళాల 2.8K డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు Arm Mali G615 GPU కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తోంది.
ఈ రియల్‌మి ట్యాబ్లెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 6.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 12,200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.


Click it and Unblock the Notifications








