CES 2017లో లాంచ్ అయిన కొత్త టెక్నాలజీ

లాస్ వేగాస్ వేదికగా జరగుతోన్న సీఈఎస్ 2017 టెక్నాలజీ ప్రియులకు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో కొత్త తరహా స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లతో పాటు వినూత్న శ్రేణి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను ప్రముఖ కంపెనీలు ఆవిష్కరించాయి. సీఈఎస్ 2017లో లాంచ్ అయిన 10 క్రియేటివ్ గాడ్జెట్‌లను ఇప్పుడు చూద్దాం...

Read More : నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Kerastase Smart Hairbrush

ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ప్రొడక్ట్స్‌కు రోజురోజుకు ప్రాధాన్యత సంతరించుకుంటున్న నేపథ్యంలో Withings అండ్ L'Oreal అనే కంపెనీ ఈ సరికొత్త స్మార్ట్ హెయిర్ బ్రష్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కాన్సెప్ట్ హెయిర్ బ్రష్‌ మీ జుట్టుకు సంబంధించిన హెల్త్‌కండీషన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వై-ఫై ద్వారా మీకు సమాచారాన్ని అందిస్తుంది.

Hydrao Smart Showerhead

హైడ్రావ్ స్మార్ట్ షవర్ హెడ్

ఈ స్మార్ట్ షవర్ హెడ్ స్నానం నిమిత్తం మీరు ఎంత నీటిని ఖర్చు చేస్తున్నారనేది లెక్కిస్తుంది. వాటర్ లిమిట్‌ను సెట్ చేసుకోవటం ద్వారా ఈ స్మార్ట్ షవర్ హెడ్ తగినంత నీటిని మాత్రమే మీకు అందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌కు పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేయటం ఎలా..?

 

Flying Selfie Camera

ఫ్లయింగ్ సెల్పీ కెమెరా

హోవర్ కెమెరా పాస్‌పోర్ట్ పేరుతో లాంచ్ అయిన సెల్నీ డ్రోన్ గాల్లో ఎగురుతూ సెల్నీలను తీయగలదు. మీ బైక్ రైడ్, క్లిఫ్ జంప్ వంటి యాక్టివీటీలను ఈ డ్రోన్ సెల్పీ కెమెరా క్రియేటివ్ యాంగిల్స్‌లో క్యాప్చుర్ చేస్తుంది.

 

Sensorwake Oria

సెన్సర్ వేక్ ఓరియా
ఈ కాన్సెప్ట్ అలారమ్ అపానవాయువులతో మిమ్మల్ని నిద్ర లేపుతుంది. తద్వారా మీరు అలారమ్ ఫిక్స్ చేసుకున్న సమయానికి లేచి తీరాల్సిందే.

2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో పెన్‌డ్రైవ్

Smart Cane

స్మార్ట్‌కేన్

ప్రత్యేకించి సీనియర్ సిటిజెన్స్ కోసం డ్రెంగ్ అనే ఫ్రెంచ్ కంపెనీ ఈ స్మార్ట్‌కేన్‌ను అభివృద్ది చేసింది. ఎమర్జెన్సీ కండీషన్స్‌లో సీనియర్ సిటిజెన్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులను ఈ చేతికర్ర అప్రమత్తం చేస్తుంది.

 

Kolibree’s Ara AI toothbrush

కోలిబ్రీ అనే కంపెనీ సరికొత్త టూత్ బ్రెష్ తో ముందుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌బ్రష్ మీ బ్రష్సింగ్ అలవాట్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంది.

రూ.16కే వాడుకున్నంత 4జీ ఇంటర్నెట్

FoodMarble AIRE

ఫుడ్ మార్బుల్ ఎయిర్ అనే ఈ సరికొత్త గాడ్జెట్, మీలో గ్యాస్‌ను సృష్టించే ఆహారాల పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఈ యాప్ ద్వారా మంచి ఆహారపు అలవాట్లను అవర్చుకోవచ్చు.

BACtrack Skyn

బ్యాక్‌ట్రాక్ స్కిన్

బ్రీత్ అనలైజర్‌లా పనిచేసే ఈ వాచ్ బ్యాండ్ మీరు తీసుకునే ఆల్కహాల్ మోతాదను మించకుండా అప్రమత్తం చేస్తుంది.

3 నిమిషాల్లో 100జీబి డేటా డౌన్‌లోడ్

 

Taclim VR Shoes

టాక్లిక్ వీఆర్ షూ

వర్చువల్ రియాల్టీ వస్తువులను రోజురోజుకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో Cerevo అనే కంపెనీ స్పర్శ సంబంధ అభిప్రాయాలను రియల్ టైమ్ లో తెలియజేసే సరికత్త టాక్లిక్ వీఆర్ షూను సీఈఎస్ 2017లో లాంచ్ చేసింది. ఇసుకు, మంచు ఇలా ఎలాంటి నేలల్లోనైనా మీరు ఈ షూను ధరించినట్లయితే ఆ స్పర్శను మీరు ఆస్వాదించగలుగుతారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Check Out 10 Weird Gadgets Launched at CES 2017. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot