ఇది గాల్లో ఎగిరే స్మార్ట్‌ఫోన్ కేస్!

Posted By: BOMMU SIVANJANEYULU

ఎలక్ట్రానిక్ ఏవియేషన్ ఇంకా కెమెరా టెక్నాలజీ విభాగాల్లో గ్లోబల్ లీడర్‌గా కొనసాగుతోన్న ఏఈఈ ఏవియేషన్ టెక్నాలజీ ఇంక్, సెల్ఫీ కెమెరా ఎల్ఎల్‌సీ భాగస్వామ్యంతో 'AEE Selfly’ పేరుతో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ కేస్‌ను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2018లో అనౌన్స్ చేసింది.

ఇది గాల్లో ఎగిరే స్మార్ట్‌ఫోన్ కేస్!

ప్రత్యేకమైన డ్రోన్‌తో ఎంబెడె కాబడి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ కేస్ ద్వారా అవార్డ్ విన్నింగ్ సెల్ఫీ ఫోటోలను క్యాప్చుర్ చేసుకోవచ్చని ఏఈఈ ఏవియేషన్ టెక్నాలజీ ఇంక్ చెబుతోంది. డ్రోన్ సామర్థ్యంతో గాలిలోకి ఎగరగలిగే ఈ స్మార్ట్‌ఫోన్ కేస్ సెల్ఫీలను సరికొత్త లుక్‌లో క్యాప్చుర్ చేయగలుగుతుంది.

ఇప్పటిక వరకు స్మార్ట్‌ఫోన్‌తో సాధ్యంకాని అత్యుత్తమ ఫోటోగ్రాఫ్‌లను తమ ఏఈఈ సెల్ఫీ కేస్ ద్వారా క్యాప్చుర్ వీలుంటుందని ఏఈఈ సంస్థల చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మైక్ ఖాన్ తెలిపారు. ఒకే ఒక బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా ఏఈఈ సెల్ఫీ కేస్, డ్రోన్ సహాయంతో గాలిలోకి ఎగిరి అద్భుతమైన సెల్ఫీలను క్యాప్చుర్ చేయగలుగుతుందని ఆయన తెలిపారు.

ఇది గాల్లో ఎగిరే స్మార్ట్‌ఫోన్ కేస్!

సెల్ఫీలతో పాటు వీడియోలు కూడా..

హై-ఎండ్ స్టెబిలైజేషన్ టెక్నలజీతో పనిచేయగలిగే ఈ ఏఈఈ సెల్ఫీ కేస్ 4 నుంచి 6 అంగుళాల మధ్య లభ్యమవుతోన్న అన్ని స్టాండర్డ్ సైజ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేయగలుగుతుందట. యూజర్ కమాండ్స్ ఆధారంగా స్పందించగలిగే ఈ డివైస్ అధిక ఎత్తులోకి వెళ్లి ఫోటోలతో పాటు వీడియోలను క్యాప్చుర్ చేస్తుంది. డ్రోన్ గాల్లోకి వెళ్లి స్టాండ్ అయిన తరువాత యూజర్ కమాండ్స్‌ను బట్టి స్పందించటం మొదలుపెడుతుంది. ఈ సెల్ఫీ కేస్ 1080 పిక్సల్ క్వాలిటీతో వీడియోలను షూట్ చేయగలుగుతుంది.

ఇది గాల్లో ఎగిరే స్మార్ట్‌ఫోన్ కేస్!

ఎనిమిది నిమిషాల పాటు ఎగరగలదు..

యూజర్లు ఓ ప్రత్యేకమైన యాప్ ఆధారంగా ఈ డ్రోన్‌ను కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. యాపిల్ ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఈ డివైస్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. 2018 మొదటి క్వార్టర్‌లో లాంచ్ కాబోతోన్న ఈ డివైస్‌ను అమెజాన్‌తో పాటు AEEUSA.comలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతున్నాయి.

యూఎస్ మార్కెట్లో ఈ డ్రోన్ సెల్ఫీ కేస్ ధర 130 డాలర్లుగా ఉంటుంది. మన కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.8,286. రెండు బ్యాటరీలు ఆధారంగా స్పందించగలిగే ఈ డ్రోన్ సెల్ఫీ కేస్ గాలిలో ఎనిమిది నిమిషాల పాటు ఎగరగలదు.

ఇంటర్నెట్ లేకుండా ఫ్రీ కాల్స్ చేసుకోవాలా...? అయితే మీ కోసమే ఈ యాప్ !

English summary
First-ever flying phone camera case, AEE selfly, captures precision selfies from heights and distances never before possible.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot