తొలిసారిగా మడతపెట్టే టీవీ వచ్చింది, ధర, ఫీచర్లు తెలుసుకోండి
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ స్మార్ట్ టీవీ సెగ్మెంట్లో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ స్మార్ట్ టీవీ సెగ్మెంట్లో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా పరుపులా చుట్టగలిగే ఓ నూతన ఓలెడ్ టీవీని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2019లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లో మడతపెట్టగలిగే 65 అంగుళాల 4కే సిగ్నేచర్ ఓఎల్‌ఈడీ టీవీని లాంచ్ చేసింది. సిగ్నేచర్ ఓలెడ్ టీవీ ఆర్ పేరిట విడుదలైన ఈ టీవీ తెర సైజ్ 65 ఇంచులుగా ఉంది. ఈ టీవీలో సినిమా చూస్తే ధియేటర్లో చూసినట్లే ఉంటుంది. ఈ ఏడాదిలోనే ఈటీవీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.

పరుపులా చుట్టేసి..
ఈ టీవీని వినియోగదారులు అవసరం లేని సమయంలో పరుపులా చుట్టేసి పక్కన పెట్టుకోవచ్చు. దీనికోసం రిమోట్ లేదా టీవీపై ఉండే బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనపుడు చుట్టుకునే విధంగా 65 అంగుళాల తెరను ఎల్‌జీ రూపొందించింది.

రోలబుల్ ఓలెడ్ టీవీ
ఇలా ప్రెస్ చేయడం ద్వారా టీవీ దాని కింద ఉండే బాక్స్‌లోకి రోల్ అవుతుంది. ఎల్‌జీ కంపెనీ దీన్ని రోలబుల్ ఓలెడ్ టీవీగా వ్యవహరిస్తున్నది. మార్కెట్లో ఈ టీవీ మరో సంచలనం సృష్టిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మూడు రకాలైన వ్యూయింగ్ ఆప్షన్లు
ఈ టీవీలో వీక్షకులకు మూడు రకాలైన వ్యూయింగ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. ఫుల్ వ్యూ, లైన్ వ్యూ, జీరో వ్యూలలో టీవీని వీక్షించవచ్చు. 100W front-firing Dolby Atmos audio system మ్యూజిక్ ని ఇందులో ప్రవేశపెట్టారు.

అమెజాన్ అలెక్సా, ఆపిల్ ఎయిర్‌ప్లే 2
ఇక ఇందులో అమెజాన్ అలెక్సా, ఆపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్ కిట్‌లకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే 4.2 చానల్ డాల్బీ అట్మోస్ ఆడియో సిస్టమ్‌ను కూడా ఈ టీవీకి కనెక్ట్ చేసుకుని అత్యంత నాణ్యమైన సౌండ్ అవుట్‌పుట్‌ను పొందవచ్చు. అయితే ఈ టీవీ ధర వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

88 అంగుళాల 8కె ఓఎల్‌ఈడీ టీవీ
lock, Frame, Mood, Music and Home Dashboard లాంటి ఆప్సన్లు ఉన్నాయి. అలాగే తన మొట్టమొదటి సూపర్-హై-డెఫినేషన్ 88 అంగుళాల 8కె ఓఎల్‌ఈడీ టీవీని కూడా ఈ సందర్భంగా తీసుకురావడం విశేషం.

ధర
దశాబ్దాల క్రితంనుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని మార్కెటింగ్ ఎల్‌జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వండర్ వాల్ ఓఎల్‌ఈడీ ఆర్ టీవీ పరిచయం సందర్బంగా చెప్పారు. అయితే దీని ధరను ఇంకా రివీల్ చేయలేదు.ాదాపు రూ. 50 వేల నుంచి లక్ష మధ్యలో ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications








