CMF Buds 2 కీలక వివరాలు లీక్.. ఆకట్టుకొనేలా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..! ఎప్పుడు విడుదల కానుందంటే?
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి భారత్ మార్కెట్‌లోకి వివిధ రకాల ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. వీటితో స్మార్ట్‌ఫోన్‌తోపాటు TWS ఇయర్‌బడ్స్ ఉన్నాయి. ఏప్రిల్ 28 తేదీన భారత్ మార్కెట్‌లో లాంచ్ కానున్నాయి. CMF ఫోన్ 2 ప్రో పేరుతో స్మార్ట్‌ఫోన్, CMF బడ్స్ 2 (CMF Buds 2) పేరుతో ఇయర్‌బడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిజైన్ సహా కీలక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా బడ్స్ వివరాలు వెల్లడయ్యాయి.
CMF బడ్స్ 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు అంచనా వివరాలు :
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF బడ్స్ 2 ఇయర్‌బడ్స్ 11mm కస్టమ్ డ్రైవర్స్‌ను కలిగి ఉంటాయి. ఈ డ్రైవర్స్ Dirac Opteo సౌండ్ ట్యూనింగ్ మరియు నథింగ్ అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0 ను సపోర్టు చేస్తుంది.

ఈ బడ్స్ మెరుగైన కాలింగ్ సపోర్టు కోసం 6 HD మైక్రోఫోన్స్ ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ మైక్రోఫోన్స్ క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0 మరియు విండ్ నాయిస్ రిడక్షన్ 3.0 వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి. బెస్ట్ కాల్ క్వాలిటీని అందిస్తాయని తెలుస్తోంది.
సీఎంఎఫ్ బడ్స్ 2 TWS ఇయర్‌బడ్స్ 5200Hz ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో 48dB హైబ్రిడ్ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు ఈ బడ్స్ స్పేషియల్ ఆడియో మరియు డ్యూయల్ కనెక్షన్ సపోర్టును కలిగి ఉంటాయి.
ఈ బడ్స్‌తో మరో ప్రయోజనం కూడా ఉంది. ఈ బడ్స్‌ను ChatGPT తో ఇంటిగ్రేషన్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే బడ్స్ ద్వారా చాట్‌జీపీటీతో ఇంటరాక్ట్ కావచ్చు. వాయిస్ కమాండ్ ద్వారా యాక్టివేడ్ చేయడంతోపాటు చాట్‌జీపీటీ ద్వారా సందేహాలు తీసుకోవచ్చు.
ఈ TWS బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఛార్జింగ్ కేస్ IPX2 రేటింగ్‌తో అందుబాటులోకి రానుంది. సీఎంఎఫ్ బడ్స్ 2 ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 55 గంటల పాటు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. అదే కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 7.5 గంటల ఆడియో ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు.
సీఎంఎఫ్ బడ్స్ 2 ధర వివరాలు :
బడ్స్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌ల వివరాలతోపాటు ధర వివరాలు కూడా వెల్లడయ్యాయి. GSMArena రిపోర్టు ప్రకారం CMF బడ్స్ 2 ధర అమెరికాలో $59 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.5000) ఉంటుందని తెలుస్తోంది. ఈ బడ్స్ లైట్ గ్రీన్, డార్క్ గ్రే, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి.
* CMF ఫోన్ 2 ప్రో మోడల్ బ్యాక్ ప్యానల్ డిజైన్ వీడియోలు ఇటీవలే విడుదల అయ్యాయి. మ్యూటీ ఫినిష్‌తో కూడిన ప్లాస్టిక్ ఎడ్జ్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. బ్యాక్ ప్యానల్ మెటీరియల్ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా తోపాటు 16MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications