37 గంటల ప్లేబ్యాక్ టైంతో నెక్‌బ్యాండ్ ప్రో, 35.5 గంటల ప్లే టైంతో బడ్స్ విడుదల.. నేడు లిమిటెడ్ సేల్..!
నథింగ్ సబ్‌బ్రాండ్ సీఎంఎఫ్ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రో (CMF Neckband Pro) మరియు సీఎంఎఫ్ బడ్స్ (CMF Buds) వంటి ఆడియో సంబంధిత ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఈ రెండింటిని సంస్థ నిర్వహించిన హైబ్రిడ్ ఈవెంట్‌లో నథింగ్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈవో కార్ల్ పై ఆవిష్కరించారు. ఈ రెండు ఆడియో ఉత్పత్తులతోపాటు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 2aను కూడా లాంచ్ చేశారు.
సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రో, సీఎంఎఫ్ బడ్స్ ధర:
సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రో ధర రూ.1,999గా ఉంది. అదేవిధంగా సీఎంఎఫ్ బడ్స్ ధర రూ.2,499 గా ఉంది. ఈ రెండు డార్క్ గ్రే, లైట్ గ్రే మరియు ఆరెంజ్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్, మింత్రా, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

సీఎంఎఫ్ బడ్స్‌ను మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ ధర రూ.2499 కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ.2299 కే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రో ను మార్చి 11 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.
దీని ధర రూ.1999 కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ.1799కు సొంతం చేసుకోవచ్చు. అయితే అధికారిక సేల్ కంటే ముందే ఇవాళ (మార్చి 6) మధ్యాహ్నం 12 గంటలకు మింత్రాలో లిమిటెడ్ సేల్ అందుబాటులో ఉంటుంది. అనంతరం ఫ్లిప్‌కార్ట్, మింత్రా, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు

సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రో స్పెసిఫికేషన్లు :
సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రో.. అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0తో 13.6mm డైనమిక్ డ్రైవర్ యూనిట్‌లను కలిగి ఉంటుంది. ఈ నెక్‌బ్యాండ్ 50dB వరకు హైబ్రిడ్ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) ను కలిగి ఉంటుంది. మరియు 5 మైక్రోఫోన్‌తో క్లియర్ వాయిస్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. IP55 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్‌తో రానుంది.
నెక్‌బ్యాండ్ ట్రిపుల్ ట్యాప్ కంట్రోల్‌ను కలిగి ఉంటుంది. వీటితో సౌండ్‌ను సర్దుబాటు చేయడం, ప్లే, పాజ్ లేదా స్కిప్ చేయవచ్చు. నథింగ్ x యాప్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ఈ సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ 220mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 37 గంటల ప్లేబ్యాక్ టైంను ఇస్తుంది. సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 18 గంటలపాటు ANC మోడ్‌ను ఆఫ్ చేసి వినియోగించుకోవచ్చు.
సీఎంఎఫ్ బడ్స్ స్పెసిఫికేషన్లు : సీఎంఎఫ్ బడ్స్ 12.4mm డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉంటాయి. ఈ బడ్స్ వైర్‌లైస్ స్టీరియో ఇయర్‌ఫోన్లుగా అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0తో పనిచేస్తాయి. కాల్ నాణ్యత కోసం ఈ బడ్స్ HD మైక్రోఫోన్లను కలిగి ఉంటాయి. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్‌తో వస్తాయి.
సీఎంఎఫ్ బడ్స్‌లో ప్రతి బడ్ 45mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేస్ 460mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బడ్స్‌ను సింగిల్ ఛార్జింగ్ చేయడం ద్వారా 8 గంటలపాటు మ్యూజిక్‌ను వినివచ్చని సంస్థ చెబుతోంది. ఛార్జింగ్ కేస్ కలిపి 35.5 గంటలపాటు ప్లేటైంను పొందవచ్చని పేర్కొంది. ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తాయని చెప్పిన సంస్థ కేవలం 10 నిమిషాలపాటు ఛార్జింగ్ చేయడం ద్వారా 6.5 గంటలపాటు వినియోగించుకోవచ్చని తెలిపింది.
సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రో మరియు సీఎంఎఫ్ బడ్స్ రెండు కూడా బ్లూటూత్ 5.3 సపోర్టు చేస్తాయని సంస్థ తెలిపింది. మరియు డ్యూయల్ డివైజ్ కనెక్షన్‌ను కూడా సపోర్టు చేస్తాయని పేర్కొంది. ఈ రెండు కూడా ఆండ్రాయిడ్ 5.1 మరియు iOS 13 తర్వాత వెర్షన్‌లను సపోర్టు చేస్తాయని సంస్థ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








