Home
Gadgets

CMF నుంచి త్వరలో స్మార్ట్‌వాచ్‌, హెడ్‌ఫోన్స్‌ విడుదల.. పూర్తి వివరాలు..!

నథింగ్‌ నుంచి ఇటీవల ఫోన్ 3a లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో లాంచ్ అయింది. అయితే నథింగ్‌ సబ్‌బ్రాండ్ CMF నుంచి త్వరలో హెడ్‌ఫోన్‌, వాచ్‌ విడుదల కానున్నాయి. అయితే విడుదల తేదీ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. CMF హెడ్‌ఫోన్‌ ప్రో (CMF Headphone Pro), వాచ్‌ 3 ప్రో (CMF Watch 3 Pro) స్మార్ట్‌వాచ్‌లు ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో గత సంవత్సరమే అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో కీలక వివరాలు :
వాచ్‌, హెడ్‌ఫోన్‌ వివరాలను త్వరలో వెల్లడిస్తామని సీఎంఎఫ్‌ తెలిపింది. అయితే గ్లోబల్‌ వేరియంట్‌ తరహా ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను భారత్‌ వేరియంట్‌ లోనూ చాలా వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

CMF teased Headphone Pro  Watch 3 pro Smartwatch

సీఎంఎఫ్‌ వాచ్‌ 3 ప్రో స్మార్ట్‌వాచ్‌ :
సీఎంఎఫ్‌ వాచ్‌ 3 ప్రో గ్లోబల్‌ వేరియంట్‌ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 670 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ మెటల్ బాడీ, సిలికాన్‌ స్ట్రాప్‌ తో అందుబాటులో ఉంది.

ఈ వాచ్ 3 ప్రో హార్ట్‌ రేట్‌, స్లీప్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌, ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు బ్లూటూత్‌ కాలింగ్‌, GPS, గెశ్చర్‌ కంట్రోల్స్‌ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ 350mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 13 రోజుల బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తోంది.

సీఎంఎఫ్‌ హెడ్‌ఫోన్‌ ప్రో :
సీఎంఎఫ్‌ హెడ్‌ఫోన్‌ ప్రో ఓవర్‌ ఇయర్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. 40dB వరకు నాయిస్‌ రిడక్షన్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్‌ నథింగ్‌ X యాప్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్‌ 40mm డ్రైవర్స్‌, LDAC, Hi-Res ఆడియో సపోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ హెడ్‌ఫోన్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 100 గంటల ప్లేబ్యాక్‌ ను అందిస్తుంది. అదే ANC ఫీచర్‌ యాక్టివేట్‌ చేసి వినియోగిస్తుంటే 50 గంటల ప్లేబ్యాక్‌ టైంను అందిస్తుంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

ధర వివరాలు :
భారత్‌ మార్కెట్‌లో సీఎంఎఫ్‌ హెడ్‌ఫోన్‌ ప్రో, వాచ్ 3 ప్రో మోడల్స్‌ లైట్‌ గ్రీన్‌, లైట్‌ గ్రే/వైట్‌, బ్లాక్‌, ఆరెంజ్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ కానున్నాయి. ఇటలీ, జపాన్‌ మార్కెట్లలో సీఎంఎఫ్‌ వాచ్ 3 ప్రో ధర EUR 99 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.10,000), JPY 13800 (భారత కరెన్సీ ప్రకారం రూ.8100) గా ఉంది.

అదే అమెరికా, యూకే, యూరప్‌ మారెట్లలో సీఎంఎఫ్‌ హెడ్‌ఫోన్‌ ప్రో ధర $99 (భారత కరెన్సీ ప్రకారం రూ.8,000), GBP 79 (భారత కరెన్సీ ప్రకారం రూ.9420), EUR 99 (భారత కరెన్సీ ప్రకారం రూ.10,000) గా ఉంది. భారత్‌లో ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
CMF teased Headphone Pro, Watch 3 pro Smartwatch, expected to launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X