Home
Gadgets

CMF వాచ్‌ ప్రో 2, బడ్స్‌ ప్రో 2 సేల్‌ ప్రారంభం.. ఫీచర్‌లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు..!!

నథింగ్‌ సబ్‌బ్రాండ్‌ CMF నుంచి ఇటీవల ఫోన్‌ 1, బడ్స్‌ ప్రో 2, వాచ్‌ ప్రో 2 విడుదల అయ్యాయి. CMF వాచ్‌ ప్రో 2, బడ్స్ ప్రో 2 సేల్‌ ఇవాళ్టి నుంచి (CMF Watch Pro 2 on Sale) ప్రారంభం అయింది. CMF వాచ్‌ ప్రో 2 డార్క్‌ గ్రే మరియు యాష్‌ గ్రే కలర్ వేరియంట్ ధర రూ.4999 గా ఉంది వేగాన్‌ లెదర్ ఫినిష్‌తో కూడిన బ్లూ మరియు ఆరెంజ్‌ కలర్‌ వేరియంట్ ధర రూ.5499 గా ఉంది. అదనపు బెజెల్‌ మరియు స్ట్రాప్‌ సెట్‌ కోసం రూ.749 చెల్లించాల్సి ఉంది.

CMF వాచ్‌ ప్రో 2... 466*466 రిజల్యూషన్‌తో 1.32 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 620 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. 100 కంటే ఎక్కువ వాచ్‌ ఫేస్‌లు, 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్స్‌ను కలిగి ఉంది. హార్ట్‌బీట్‌ రేట్‌ (హృదయ స్పందన రేట్‌), SPO2 స్థా్యి సహా మహిళల్లో రుతుక్రమాన్ని పర్యవేక్షించగలిగే ఫీచర్‌లను కలిగి ఉంది.

cmf-watch-pro-2

దీంతోపాటు ఈ వాచ్‌ బ్లూటూత్‌ 5.3, GPS, Glonass, QZ55, Beidou కనెక్టివిటీ ఫీచర్‌ లను కలిగి ఉంది. బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ ద్వారా కాల్స్‌ చేయడం లేదా కాల్స్‌ స్వీకరించవచ్చు. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

11 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ :
CMF వాచ్‌ ప్రో 2 స్మార్ట్‌వాచ్‌ 305mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 11 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. ఇవాళ్టి నుంచి సేల్‌ ప్రారంభం అయింది. CMF ఫోన్‌ 1 తో పాటు కొనుగోలు చేయడం ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

cmf-watch-pro-2

CMF బడ్స్ ప్రో 2 ఫీచర్‌ల వివరాలు :
CMF బడ్స్‌ ప్రో 2 ఇయర్‌బడ్స్‌ డ్యూయల్‌ డ్రైవర్లను కలిగి ఉంది. 11mm బాస్‌ డ్రైవర్‌ మరియు 6mm మైక్రో ప్లానర్ ట్విటర్‌ ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌ 50dB హైబ్రిడ్ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ (ANC)ను కలిగి ఉంది. ఈ ANC లో ట్రాన్పరెన్సీ, అడాప్టివ్‌, స్మార్ట్‌ వంటి 3 Modes ఉన్నాయి. బ్లూటూత్‌ 5.3 పైన పనిచేస్తుంది.

ఈ బడ్స్‌లోని ప్రతి బడ్స్‌ మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. కాలింగ్‌ సమయంలో మెరుగైన అనుభూతి కోసం ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్ క్యాన్సిలేషన్‌ (ENC) ఫీచర్‌ యాక్టివేట్‌ అవుతుంది. మరియు Dirac Opteo సపోర్టును కలిగి ఉంటాయి. నథింగ్ X యాప్‌ ద్వారా EQ కస్టమైజేషన్‌తోపాటు బ్లూటూత్‌ కోడెక్‌, స్పేషియల్‌ ఆడియో ఎఫెక్ట్‌లకు సపోర్టు చేస్తాయి.

cmf-watch-pro-2

ఈ నథింగ్‌ X యాప్‌ చాట్‌జీపీటీతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఫలితంగా నథింగ్‌ ఫోన్‌ లేదా CMF ఫోన్‌ల ద్వారా ఈ బడ్స్‌ను వినియోగించి కూడా AI బాట్‌తో కనెక్ట్ కావచ్చు. మరియు ఈ ఇయర్‌బడ్స్‌ ఛార్జింగ్ కేస్‌ స్మార్ట్‌ డయల్‌ను కలిగి ఉంటుంది. ఈ డయల్‌ ద్వారా వాల్యూమ్‌ను నియంత్రించవచ్చు.

CMF బడ్స్‌ ప్రో 2 ఇయర్‌బడ్స్‌ ప్రతి బడ్‌ 60mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఛార్జింగ్‌ కేస్‌ 460mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసేందుకు 70 నిమిషాల సమయం పడుతుంది. దీని ద్వారా గరిష్ఠంగా 43 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.

CMF బడ్స్‌ ప్రో సేల్‌, ధర, ఆఫర్ల వివరాలు :
ఈ బడ్స్‌ సేల్ (CMF Buds Pro 2) ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ధర రూ.4,299 గా ఉంది. ఈ బడ్స్‌ బ్లూ, డార్క్‌ గ్రే, లైట్‌ గ్రే, ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో CMF ఫోన్‌1 తోపాటు ఈ బడ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
CMF Watch pro 2 and Buds Pro 2 sale is live on india via Flipkart features sale offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X