నథింగ్ సబ్‌బ్రాండ్ CMF వాచ్ ప్రో 2 కీలక ఫోటో విడుదల.. ఫీచర్‌లు, లాంచ్ వివరాలు..!!
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి భారత్ మార్కెట్‌లోకి CMF ఫోన్ 1 సహా బడ్స్ ప్రో 2 విడుదల కానున్నాయి. వీటితోపాటు CMF వాచ్ ప్రో 2 (CMF Watch pro 2) కూడా లాంచ్ కానుంది. జులై 8 వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. CMF ఇటీవల ఈ వాచ్ ప్రో 2 ను ఫొటోలను విడుదల చేసింది. ఈ వాచ్ అల్యూమినియం బాడీతో అందుబాటులోకి రానుంది.
CMF సంస్థ తాజాగా విడుదల చేసిన ఫోటో ఆధారంగా ఈ వాచ్ ప్రో 2 ఆల్‌రౌండర్ పనితీరు కనబరుస్తుందని తెలిపింది. మరియు 100 వాచ్ ఫేస్‌లను కలిగి ఉంటుందని తెలిపింది. కొన్ని వాచ్ ఫేస్‌లను విడుదల చేసింది. మరియు ఈ వాచ్ వృత్తాకార డిజైన్‌తో రానుంది.

CMF వాచ్ ప్రో రూ.4,499 ధరతో విడుదల అయింది. భారత్ మార్కెట్‌లో వాచ్ ప్రో 2 ధర అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తొలిసారిగా భారత్ మార్కెట్‌లో CMF తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.
CMF ఫోన్ 1.. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో లాంచ్ కానుంది. దీంతోపాటు HDR10+ సపోర్టును కలిగి ఉండనుంది. దీంతోపాటు ఈ హ్యాండ్ సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
ఈ సీఎంఎఫ్ ఫోన్ 1.. 8GB ర్యామ్ స్టోరేజీతో అందుబాటులోకి రానుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ ద్వారా 16GB వరకు ర్యామ్‌ను విస్తరించవచ్చు. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఈ కెమెరాల ద్వారా 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు.
CMF తొలి స్మార్ట్‌ఫోన్ వైఫై 6, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు గ్లిఫ్ లైట్‌లను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ సహా భారత్‌లో ఆరెంజ్ కలర్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ధర రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications