55 అంగుళాల కొత్త టీవీ,వాటర్ ప్యూరీఫైర్ లను లాంచ్ చేసిన క్రోమా! ధరల వివరాలు
టాటా సంస్థ యాజమాన్యంలోని క్రోమా బ్రాండ్ భారతదేశంలో 2 కొత్త స్మార్ట్ టీవీ మోడళ్లను విడుదల చేసింది. వీటితో పాటు కొత్త వాటర్ ప్యూరీఫైర్ ను కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ యొక్క ధర వివరాలు, స్పెసిఫికేషన్లు మరియు కొనవచ్చా, లేదా అని వివరాలు తెలుసుకుందాం.
టాటా సంస్థ భారతదేశంలో తన ఉత్పత్తులను క్రమంగా పెంచుతోంది. తన వినియోగదారులకు, సంస్థ నుంచి స్వంతంగా తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను అందించే ప్రయత్నంలో, క్రోమా తన సొంత లేబుల్ పరిధిలో భాగంగా కొత్త QLED టీవీలు మరియు వాటర్ ప్యూరీఫైర్ పరికరాన్ని విడుదల చేసింది.

ఈ కొత్త QLED స్మార్ట్ టీవీలు మరియు వాటర్ ప్యూరీఫైర్ లు ఆకర్షణీయమైన ధరలకు సరికొత్త టెక్నాలజీలను అందించడం ద్వారా ప్రజల జీవనశైలిని మార్చడానికి ఉద్దేశించినవి అని కంపెనీ పేర్కొంది. క్రోమా ప్రస్తుతం AC, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషీన్ మరియు దాని స్వంత లేబుల్ విభాగంలో మరెన్నో ఉత్పత్తులతో సహా 400 కంటే ఎక్కువ విభిన్న ఉత్పత్తులను ఇది అందిస్తుంది.
ఇవన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. క్రోమా కంపెనీ ప్రకారం, క్రోమా యొక్క సొంత బ్రాండ్ ఉత్పత్తుల శ్రేణి గత సంవత్సరంలో 2.5 రెట్లు పెరిగింది. సరే, ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయబడిన ఈ స్మార్ట్ టీవీ మరియు వాటర్ ప్యూరీఫైర్ ల గురించి వివరాలు చూద్దాం.

ఈ కొత్త క్రోమా QLED TV రెండు వేర్వేరు సైజులలో లాంచ్ చేయబడింది. ఈ కొత్త స్మార్ట్ టీవీలు 55' అంగుళాలు మరియు 65' అంగుళాల మోడళ్లలో వస్తాయి. దీని ధర గురించి చెప్పాలంటే, క్రోమా స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.59,990 గా ఉంది. అలాగే, క్రోమా వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభ ధర రూ.11,990 గా లాంచ్ అయింది.
ఈ రెండు పరికరాలను క్రోమా అధికారిక వెబ్‌సైట్, క్రోమా స్టోర్స్ మరియు టాటా న్యూ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. క్రోమా QLED TV ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. ఇది మెరుగైన వీడియో నాణ్యత మరియు ఖచ్చితమైన ఆడియో నాణ్యతను అందిస్తుంది. దీనిలో కనెక్టివిటీ ఎంపికలలో 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి.

ఇది ఆప్టికల్ ఆడియో అవుట్‌పుట్, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇది 1.9GHz క్వాడ్-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఇది పని చేస్తుంది. అదేవిధంగా, సంస్థ యొక్క వాటర్ ప్యూరీఫైర్ పరికరం ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేయగలదు.
బాక్టీరియా, జెర్మ్స్ మరియు లోహ కాలుష్యం, విషపూరిత పదార్థాలు మరియు ప్రమాదకరమైన రసాయనాలను ఇది నీటి నుండి ఫిల్టర్ చేస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ వాటర్ ప్యూరీఫైర్ లో అధునాతన కాపర్ + పోస్ట్ కార్బన్ ఫిల్టర్ మరియు మాన్యువల్ TDS కంట్రోలర్ ఉన్నాయి. రాగి లోహం ద్వారా నీరు మరింత మెరుపును ఇస్తుంది మరియు మంచి రుచిని కలిగిస్తుంది.
ఈ వాటర్ ప్యూరీఫైర్ 9 లీటర్ల నీటిని స్టోర్ చేయలేదు, మరియు ఇది స్మార్ట్ LED లైట్లను కలిగి ఉంటుంది. అదనంగా, ఈ క్రోమా వాటర్ ఫిల్టర్ ఆరు దశల శుద్దీకరణ టెక్నాలజీ ని కలిగి ఉంటుంది. ఈ అల్ట్రాఫైన్ ఫిల్టర్ మరియు బ్యాక్టీరియాను చంపే UV టెక్నాలజీని అందిస్తారు. ఈ పరికరాలు ఇప్పుడు కొనుగోలు కోసం అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








