Home
Gadgets

Dell 86-inch, 43-inch టచ్ మానిటర్‌ ఫీచర్స్ ఇవే...

CES 2020 సంవత్సరంలో డెల్ నుండి అతి పెద్ద ఉత్పత్తి ప్రకటన వెలువడింది. అది 5G మద్దతుతో వస్తున్న 2020 XPS 13 మరియు లాటిట్యూడ్ 9510 . కానీ కంపెనీ లాస్ వెగాస్‌లో జరిగే వాణిజ్య ప్రదర్శనకు డిస్ప్లే ల శ్రేణిని తీసుకువస్తోంది.

మానిటర్

6 సంవత్సరాలుగా ప్రపంచంలోని నంబర్ వన్ మానిటర్ సంస్థగా డెల్ కంపెనీ ఉంది. ఇప్పుడు ఇది 19-అంగుళాల నుండి 86-అంగుళాల వరకు గల కొత్త డిస్ప్లేలను ప్రారంభించడంతో ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

 

 

డెల్ 86-అంగుళాల 4K ఇంటరాక్టివ్ టచ్ మానిటర్

డెల్ 86-అంగుళాల 4K ఇంటరాక్టివ్ టచ్ మానిటర్

డెల్ సంస్థ ఇప్పుడు కొత్తగా తన 86-అంగుళాల 4K ఇంటరాక్టివ్ టచ్ మానిటర్‌ను ప్రారంభించడంతో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ హబ్‌కు పెద్ద సవాలు విసురుతోంది. ఇది కాన్ఫరెన్స్ రూమ్ లలో వున్న డిజిటల్ వైట్‌బోర్డులను మార్చడం కోసం దీనిని లక్ష్యంగా పెట్టుకుంది. "దీనిని వినియోగదారులు సులభంగా కనెక్ట్ చేయడానికి మరియు రియల్-టైంలో సహకారాన్ని మరింత పెంచడానికి రూపొందించబడింది" అని డెల్ ఒక ప్రకటనలో తెలిపారు. 20 పాయింట్ల మల్టీ-టచ్ సపోర్ట్, యుఎస్‌బి టైప్-సి కనెక్టివిటీ మరియు స్క్రీన్ డ్రాప్ ఫీచర్‌తో 4K డిస్‌ప్లే ఉండడం వలన వినియోగదారులు వివిధ రకాల దూరాల వద్ద దీనిని యాక్సిస్ ను చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది 2020 ఏప్రిల్ 10 న ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. అలాగే దీని యొక్క ధర ప్రారంభించటానికి ముందు వెల్లడించనున్నది.

 

డెల్ అల్ట్రాషార్ప్ 43 4K USB-C మానిటర్

డెల్ అల్ట్రాషార్ప్ 43 4K USB-C మానిటర్

86 అంగుళాల ఇంటరాక్టివ్ మానిటర్‌ను డెల్ అల్ట్రాషార్ప్ 43 4K యుఎస్‌బి-సి మానిటర్ మోడల్ నంబర్ U4320Qతో కలుపుతుంది. డిస్ప్లే నాలుగు పిసిల వరకు కనెక్ట్ అవ్వడానికి మరియు ప్రతి కంప్యూటర్ నుండి ఒకేసారి కంటెంట్‌ను చూడటానికి ఉపయోగపడుతుంది. ఇది ఫైనాన్స్ నిపుణులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. దీనిని ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఉపయోగించవచ్చు. ఈ 42.5-అంగుళాల 4K UHD డిస్‌ప్లే మానిటర్ యొక్క వివరాల విషయానికి వస్తే ఇది అధిక రిజల్యూషన్‌తో మల్టీ-మానిటర్ సెటప్ తో వస్తుంది. ఇది USB టైప్-సి పోర్టును కలిగి ఉండి 90W పవర్ ను అందిస్తుంది. డెల్ అల్ట్రాషార్ప్ 43 4 కె యుఎస్‌బి-సి మానిటర్ $1,049.99 (సుమారు రూ .75,653) ధర వద్ద ప్రపంచవ్యాప్తంగా 2020 జనవరి 30 నుండి మార్కెట్ లో లభించనున్నది.

 

 

అల్ట్రాషార్ప్ 27 4 కె USB-C మానిటర్ (U2720Q) మరియు అల్ట్రాషార్ప్ 25 USB-C మానిటర్ (U2520D)

అల్ట్రాషార్ప్ 27 4 కె USB-C మానిటర్ (U2720Q) మరియు అల్ట్రాషార్ప్ 25 USB-C మానిటర్ (U2520D)

మల్టీ-మానిటర్ సెటప్ అవసరం లేనివారికి డెల్ అల్ట్రాషార్ప్ 27 4 కె యుఎస్‌బి-సి మానిటర్ (U2720Q) మరియు అల్ట్రాషార్ప్ 25 యుఎస్‌బి-సి మానిటర్ (U2520D) అందుబాటులో ఉన్నాయి. U2720Q 27-అంగుళాల 4K డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే U2520D 25-అంగుళాల క్వాడ్ HD డిస్ప్లేతో వస్తుంది. అవి జనవరి 30 2020 నుండి $709.99 (సుమారు 51,115 రూపాయలు) మరియు $479.99 (సుమారు 34,584 రూపాయలు) ధరల వద్ద లభిస్తాయి. ఈ డిస్ప్లేలు 95 శాతం DCI-P3 కలర్ తో విస్తృత కలర్ కవరేజీని అందిస్తాయి. ఖచ్చితమైన కలర్ మరియు స్పష్టతను కోరుకునే నిపుణులు వీటిని కొనుగోలు చేయడం అతి ఉత్తమం.

 

 

డెల్ P-సిరీస్ మరియు E-సిరీస్ మానిటర్లు

డెల్ P-సిరీస్ మరియు E-సిరీస్ మానిటర్లు

P-సిరీస్ మరియు E-సిరీస్ మానిటర్ల రిఫ్రెష్‌తో డెల్ కంపెనీ తన సరసమైన ధరల మానిటర్ల శ్రేణికి కొత్త వాటిని పరిచయం చేస్తోంది. ఈ మానిటర్ల యొక్క డిస్ప్లేల కొలతలు 19-అంగుళాల నుండి 27-అంగుళాల వరకు ఉంటాయి. P-సిరీస్ మానిటర్లు FHD నుండి QHD రిజల్యూషన్‌తో లభిస్థాయి. ఇవి USB టైప్-సి కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.

 

 

ధరల వివరాలు

ధరల వివరాలు

E సిరీస్ మానిటర్లు ఇంటిగ్రేటెడ్ స్పీకర్లతో పాటు ఎత్తు సర్దుబాటును అందిస్తుంది. డెల్ యొక్క 27-అంగుళాల మానిటర్ (P2720D) మరియు డెల్ 27 USB-C మానిటర్ (P2720DC) రెండూ వరుసగా ఇప్పుడు $449.99 (సుమారు రూ.32,422) మరియు $479.99 (సుమారు రూ. 34,584) ధర వద్ద లభిస్తాయి. డెల్ 24 మానిటర్ (P2421D) మరియు డెల్ 24 USB-C మానిటర్ (P2421DC) 2020 ఫిబ్రవరి 27 న ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Dell Announced 86-inch, 43-inch 4K Touch Monitors With USB Type-C
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X